For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నల్ల‌ధ‌న కుబేరుల‌కు ప్ర‌భుత్వం హెచ్చ‌రిక‌

ప్ర‌ధాన‌మంత్రి గ‌రీబ్ క‌ల్యాణ్ యోజ‌న2016ను ప్ర‌వేశ‌పెట్ట‌బోతోంద‌ని కేంద్ర‌ రెవెన్యూ శాఖ కార్య‌ద‌ర్శి హ‌స్ముఖ్ అధియా వెల్ల‌డించారు. దీని ద్వారా వెల్ల‌డించ‌ని ఆదాయం క‌లిగిన వారు అయితే ప‌న్ను, పెనాల్టీ అ

|

ప్ర‌భుత్వం ఈ రోజు లోక్‌స‌భ‌లో ట్యాక్సేష‌న్ లాస్‌(రెండో స‌వ‌ర‌ణ‌),2016 బిల్లును ప్ర‌వేశ‌పెట్టిన త‌ర్వాత న‌ల్ల కుబేరుల‌కు తీవ్ర హెచ్చ‌రిక‌లు పంపుతోంది. ప్ర‌భుత్వం తాజాగా ప్ర‌ధాన‌మంత్రి గ‌రీబ్ క‌ల్యాణ్ యోజ‌న2016ను ప్ర‌వేశ‌పెట్ట‌బోతోంద‌ని కేంద్ర‌ రెవెన్యూ శాఖ కార్య‌ద‌ర్శి హ‌స్ముఖ్ అధియా వెల్ల‌డించారు. దీని ద్వారా వెల్ల‌డించ‌ని ఆదాయం క‌లిగిన వారు అయితే ప‌న్ను, పెనాల్టీ అయినా క‌ట్టాల‌ని లేదంటే ఈ కొత్త ప‌థ‌కాన్ని ఉప‌యోగించుకోవ‌ల్సిందిగా ఆయ‌న కోరారు. ప్ర‌ధాన‌మంత్రి గ‌రీబ్ క‌ల్యాణ్ యోజ‌న బిల్లు పార్ల‌మెంటు, రాష్ట్రప‌తి ఆమోదం పొందిన త‌ర్వాత దాన్ని నోటిఫై చేస్తారు.ఈ ప‌థ‌కానికి తుది గ‌డువు డిసెంబ‌రు 30,2016.

 నల్ల‌ధ‌న కుబేరుల‌కు ప్ర‌భుత్వం హెచ్చ‌రిక‌

ప్ర‌భుత్వం పెద్ద నోట్ల ర‌ద్దు నిర్ణ‌యం ప్ర‌క‌టించిన త‌ర్వాత న‌ల్ల‌ధ‌నం దాచుకునే వారు స్వ‌చ్చందంగా వెల్ల‌డించేలా చ‌ట్టాల‌కు త‌గు స‌వ‌ర‌ణ‌లు చేయ‌డం జ‌రిగింద‌ని అధియా తెలిపారు. రూ. 2.5ల‌క్ష‌ల లోపు డిపాజిట్ల‌పై ఆదాయ‌పు ప‌న్ను శాఖ క‌న్ను ఉండ‌బోద‌ని అధికారులు చెబుతున్నారు. అయితే ఈ 50 రోజుల‌కు సంబంధించి డిపాజిట్ల గురించిన స‌మాచారాన్ని ఐటీ శాఖ తీసుకుంటుంద‌ని, ప‌రిశీలిస్తుంద‌ని ఐటీ శాఖ అధికారులు తెలిపారు. ఆయా వివ‌రాల‌ను పాన్ నంబ‌రుతో స‌రిచూసి ప్ర‌భుత్వం విశ్లేషిస్తుంద‌ని సీబీడీటీ ఛైర్మ‌న్ సుశీల్ చంద్రా వెల్ల‌డించారు.

Read more about: black money
English summary

నల్ల‌ధ‌న కుబేరుల‌కు ప్ర‌భుత్వం హెచ్చ‌రిక‌ | Government warns about future action against black money holders

Income-tax officials, however, stressed that deposits up to ₹ 2.5 lakh will be free from scrutiny. They however, warned that the department will use its IT system to profile all information from banks over deposits in the 50-day period to deposit old currency notes.
Story first published: Monday, November 28, 2016, 16:52 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X