For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అమ్మో! జ‌న్‌ధ‌న్ ఖాతాల్లో అంత మొత్తంలో డిపాజిట్లా?

నోట్ల ర‌ద్దు ప్ర‌క‌ట‌న తర్వాత జ‌న్‌ధ‌న్ ఖాతాల్లో డిపాజిట్లు ఇబ్బ‌డిముబ్బ‌డిగా పెరుగుతున్నాయి. మొత్తం రూ. 64,252 కోట్ల రూపాయ‌లు డిపాజిట్ అయిన‌ట్లు ప్ర‌భుత్వం చెబుతున్న లెక్క‌ల ప్ర‌కారం తెలుస్తోంది. ఇంద

|

నోట్ల ర‌ద్దు ప్ర‌క‌ట‌న తర్వాత జ‌న్‌ధ‌న్ ఖాతాల్లో డిపాజిట్లు ఇబ్బ‌డిముబ్బ‌డిగా పెరుగుతున్నాయి. మొత్తం రూ. 64,252 కోట్ల రూపాయ‌లు డిపాజిట్ అయిన‌ట్లు ప్ర‌భుత్వం చెబుతున్న లెక్క‌ల ప్ర‌కారం తెలుస్తోంది. ఇందులో ఉత్త‌ప‌ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం రూ. 10,670 కోట్ల‌తో ప్ర‌థ‌మ స్థానంలో ఉండ‌గా, ప‌శ్చిబ బెంగాల్‌, రాజ‌స్థాన్ త‌ర్వాతి స్థానాల్లో ఉన్నాయి. అదే విధంగా సున్నా నిల్వ ఖాతాల‌ను త‌గ్గించే ఉద్దేశంతో జ‌న్‌ధ‌న్ ఖాతాల్లో రూ. 1 లేదా రూ.2 డిపాజిట్ చేయాల‌ని ప్ర‌భుత్వం ఎలాంటి ఆదేశాలు ఇవ్వ‌లేద‌ని కేంద్రం నొక్కిచెప్పింది.

అమ్మో! జ‌న్‌ధ‌న్ ఖాతాల్లో అంత మొత్తంలో డిపాజిట్లా?

లోక్‌స‌భ‌లో ఒక ప్ర‌శ్న‌కు స‌మాధానంగా ఆర్థిక శాఖ స‌హాయ మంత్రి సంతోష్ గంగ్వార్ జ‌న్‌ధ‌న్ ఖాతాల‌కు సంబంధించి ప‌లు విష‌యాల‌ను వెల్ల‌డించారు. న‌వంబ‌రు 16 నాటికి 25.58 కోట్ల ఖాతాల్లో రూ. 64,252 కోట్ల డిపాజిట్లు ఉన్న‌ట్లు ఆయ‌న చెప్పారు. 3.79 కోట్ల ఖాతాదారుల‌తో ముందు వ‌రుస‌లో ఉన్న ఉత్త‌ర‌ప్ర‌దేశ్ పెద్ద మొత్తంలో డిపాజిట్లను క‌లిగి ఉంది. మొత్తం డిపాజిట్ల‌లో రూ. 10,670 కోట్లు ఆ రాష్ట్రానివే. దాని త‌ర్వాత ప‌శ్చిమ బెంగాల్ 2.44 కోట్ల ఖాతాల్లో రూ. 7826 కోట్ల డిపాజిట్ల‌ను క‌లిగి ఉంది. రాజస్థాన్ 1.89 కోట్ల ఖాతాల‌తో రూ. 5345.57 కోట్ల డిపాజిట్ల‌తో మూడో స్థానంలో ఉంది. బీహార్ 2.62 కోట్ల ఖాతాల‌తో రూ. 4912.79 కోట్ల డిపాజిట్ల‌ను క‌లిగి నాలుగో స్థానంలో ఉంది.

మొత్తం 25.58 కోట్ల‌ ఖాతాల్లో 5.98 కోట్లు(23.02%) సున్నా నిల్వ ఖాతాలున్నాయి. ఒక నిర్దిష్ట స‌మ‌యంలో అన్ని జ‌న్ ధ‌న్ ఖాతాల‌ను ఆధార్‌తో అనుసంధానించాల్సిందిగా బ్యాంకుల‌కు ఆదేశాలిచ్చిన‌ట్లు గంగ్వార్ చెప్పుకొచ్చారు. పీఎమ్‌జేడీవై ప్ర‌ధాన ఉద్దేశం ప్ర‌భుత్వ సంక్షేమ ప‌థ‌కాల ద్వారా అందే ప్ర‌యోజ‌నాలు, ప్ర‌భుత్వం ద్వారా ప్ర‌జ‌ల‌కు అందే న‌గ‌దు ల‌బ్దిని ఈ ఖాతాల ద్వారా బ‌దిలీ చేయ‌డం. ఈ విధంగా ప్ర‌త్య‌క్ష న‌గ‌దు బ‌దిలీ ద్వారా సున్నా నిల్వ ఖాతాల‌ను త‌గ్గించ‌వ‌చ్చ‌ని ఆయన అన్నారు.

Read more about: pmjdy jan dhan yojana
English summary

అమ్మో! జ‌న్‌ధ‌న్ ఖాతాల్లో అంత మొత్తంలో డిపాజిట్లా? | Deposits in Jan Dhan accounts rise to Rs 64,250 crore

"As on November 16, 25.58 crore accounts with aggregate deposits of Rs 64,252.15 crore have been opened under Pradhan Mantri Jan Dhan Yojana (PMJDY) across the country," Minister of State for Finance Santosh Kumar Gangwar said in a written reply to the Lok Sabha.
Story first published: Saturday, November 26, 2016, 17:06 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X