For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

తెలుగులో బిజినెస్ వార్త‌లు సంక్షిప్తంగా, వేగంగా

తెలుగు గుడ్‌రిట‌ర్న్స్ త‌మ పాఠ‌కుల కోసం కొత్త ఫీచ‌ర్‌ను ప్రారంభించింది. తెలుగులో బిజినెస్ వార్త‌లు సంక్షిప్తంగా, వేగంగా త‌క్కువ స‌మ‌యంలో ఎక్కువ వార్త‌ల‌ను చ‌దివేలా ఒకే క‌థ‌నంలో అన్ని వార్త‌ల‌ను సంక్షి

|

తెలుగు గుడ్‌రిట‌ర్న్స్ త‌మ పాఠ‌కుల కోసం కొత్త ఫీచ‌ర్‌ను ప్రారంభించింది. తెలుగులో బిజినెస్ వార్త‌లు సంక్షిప్తంగా, వేగంగా త‌క్కువ స‌మ‌యంలో ఎక్కువ వార్త‌ల‌ను చ‌దివేలా ఒకే క‌థ‌నంలో అన్ని వార్త‌ల‌ను సంక్షిప్తీక‌రిస్తోంది. ఉద్యోగ జీవితాల‌తో అంద‌రూ బిజీగా ఉంటున్న స‌మ‌యం ఇది. అలాంటి వారి కోస‌మే ముందు రోజు వార్త‌లు సంక్షిప్తంగా, వేగంగా చ‌దివేందుకు. దీని ద్వారా బిజినెస్‌, ప‌ర్స‌న‌ల్ ఫైనాన్స్‌, స్టాక్ మార్కెట్; బ‌ంగారం ధ‌ర‌ల‌ను ఒకేచోట తెలుసుకోండి.

ఆధార్‌పై సందేహాలా? ఈ నంబ‌రుకు ఫోన్ చేయండి

ఆధార్‌పై సందేహాలా? ఈ నంబ‌రుకు ఫోన్ చేయండి

ఆధార్‌పై ప్ర‌జ‌ల‌కు ఉన్న సందేహాల‌ను నివృత్తి చేసేందుకు వీలుగా ఒక సరికొత్త టోల్‌ ఫ్రీ హెల్ప్‌లైన్‌ను ప్రారంభించారు. దాని నెంబరు కూడా దేశ ప్రజలందరికీ సులభంగా గుర్తుండేలా.. స్వాతంత్ర్యం వచ్చిన ఏడాది1947గా నిర్ణయించారు. బ్యాంకు సేవలు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు.. ఇలా అన్నింటికీ ఆధార్ తప్పనిసరి అయిపోయింది. దీంతో ఆధార్ గురించి ప్ర‌జ‌ల‌కు ఉన్న సందేహాల‌ను త్వ‌రిత‌గ‌తిన తీర్చ‌డం అనివార్య‌మైంది. ఈ నేప‌థ్యంలో ఈ నంబ‌రును ప్రారంభించారు. సోమవారం నుంచి శనివారం వరకు ఉదయం 7 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ఇది పనిచేస్తుంది. ఆదివారాల్లో అయితే ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఏజెంట్లు కాల్స్‌కు స్పందిస్తారు.

దేశ వృద్ది రేటు ల‌క్ష్యం 10 శాతం

దేశ వృద్ది రేటు ల‌క్ష్యం 10 శాతం

రాబోయే మూడు దశాబ్దాల్లో నిలకడగా 9నుంచి 10 శాతం వృద్ధి రేటును సాధించడంపై దృష్టి పెడుతూ భారత దేశం వస్తు సేవల పన్ను(జీఎస్‌టీ) అమ‌లు, పెద్ద నోట్ల రద్దుసహా పలు సాహ‌సోపేత‌మైన చర్యలు తీసుకుందని నీతి ఆయోగ్ సిఈఓ అమితాబ్ కాంత్ వెల్ల‌డించారు. ‘దివాలా చట్టం మొదలుకొని వస్తు సేవల పన్ను(జీఎస్‌టీ), పెద్ద నోట్ల రద్దు దాకా భారత్‌లో మేము వ్యవస్థాగత సంస్కరణలను చేపడుతున్నాం' అని ఆయన చెప్పారు.

టీసీఎస్ బోర్డు స‌మావేశానికి మిస్త్రీ దూరం

టీసీఎస్ బోర్డు స‌మావేశానికి మిస్త్రీ దూరం

టాటా సన్స్ చైర్మన్ పదవినుంచి తొలగించిన సైరస్ మిస్త్రీ గురువారం జరిగిన ఆ గ్రూపు సంస్థ టిసీఎస్ బోర్డు సమావేశానికి గైరుహాజరయ్యారు. కాగా, టిసిఎస్ బోర్డునుంచి మిస్ర్తిని తొలగించడంపై నిర్ణయం తీసుకోవడం కోసం వచ్చేనెల అసాధారణ సర్వసభ్య సమావేశం నిర్వహించాలని గురువారం జరిగిన బోర్డు సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.

పెట్రోలు బంకుల్లో సైతం న‌గ‌దు విత్‌డ్రా

పెట్రోలు బంకుల్లో సైతం న‌గ‌దు విత్‌డ్రా

బ్యాంకులు, ఏటీఎంల ముందు క్యూల సమస్యను అధిగమించేందుకు పెట్రోల్ బంకుల్లో సైతం నగదు విత్‌డ్రాయ‌ల్స్‌కు కేంద్రం ఏర్పాట్లు చేసింది. ఇందులో భాగంగా శుక్రవారం నుంచి దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన 2,500 పెట్రోల్ బంకుల్లో డెబిట్/క్రెడిట్ కార్డు స్వైప్ చేయడం ద్వారా రోజుకు రూ.2 వేలు తీసుకోవ‌చ్చు.

ఎయిర్ ఇండియాకు 246 కోట్ల నిర్వ‌హ‌ణ న‌ష్టం

ఎయిర్ ఇండియాకు 246 కోట్ల నిర్వ‌హ‌ణ న‌ష్టం

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో ప్రభుత్వరంగ విమానయాన సంస్థ ఎయిరిండియా నిర్వహణ నష్టం కొంత మేరకు తగ్గింది. గత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌-జూన్‌లో రూ.315.37 కోట్ల నష్టాన్ని చవి చూడగా, ఈసారి ఇది రూ.246.14 కోట్లకు పరిమితమైంది. ‘2016-17 తొలి త్రైమాసికంలో రూ.87.28 కోట్ల నిర్వహణ లాభాన్ని ఆర్జించాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది.

ఆంధ్రా బ్యాంకుకు రూ. 10 వేల కోట్లు

ఆంధ్రా బ్యాంకుకు రూ. 10 వేల కోట్లు

పెద్ద నోట్ల ర‌ద్దుతో సామాన్యులంతా త‌మ వ‌ద్ద ఉన్న రూ. 500, రూ. 1000 నోట్ల‌ను డిపాజిట్ చేసేందుకు ఎగ‌బ‌డుతున్నారు. త‌మ పొదుపు ఖాతాల్లో జ‌మ చేసేందుకు చాలా మంది గ్రామీణ‌, సెమీ అర్బ‌న్ ప్రాంతాల ప్ర‌జ‌లు ఎక్కువ‌గా బ్యాంకుల‌నే ఆశ్ర‌యిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో ఆంధ్రా బ్యాంకుకు ఆక‌ర్ష‌ణీయంగా డిపాజిట్లు వ‌స్తున్నాయ‌ని, మొత్తం ఇప్ప‌టి వ‌ర‌కూ రూ. 8వేల నుంచి రూ. 10 వేల కోట్ల డిపాజిట్లు వ‌చ్చి ఉండొచ్చ‌ని సంబంధిత వ‌ర్గాలు పేర్కొన్నాయి. డిపాజిట్లు చేయాల‌నుకునే వారిలో ఎక్కువ శాతం మంది పెద్ద నోట్ల‌ను డిపాజిట్ల‌ను చేస్తున్నారు. దాదాపు స‌గ‌టున రోజుకు రూ. 1000 కోట్ల కాసా డిపాజిట్లు వ‌చ్చి ఉంటాయ‌ని అంచ‌నా.

క‌రెన్సీ కొర‌త లేదు: రిజ‌ర్వ్ బ్యాంక్‌

క‌రెన్సీ కొర‌త లేదు: రిజ‌ర్వ్ బ్యాంక్‌

నోట్ల కొర‌త ఉంటుందేమోన‌న్న అపోహ‌తో అవ‌స‌రం లేక‌పోయినా ముంద‌స్తు జాగ్ర‌త్త‌తో పెద్ద‌మొత్తంలో న‌గ‌దును ఉప‌సంహ‌రించుకుని నిల్వ చేసుకోవ‌ద్ద‌ని ఆర్‌బీఐ ప్ర‌జ‌ల‌కు సూచించింది. న‌గ‌దు కొర‌త ఉందంటూ వ‌స్తున్న వార్త‌ల్లో వాస్త‌వం లేద‌ని స్ప‌ష్టం చేసింది. నోట్ల మార్పిడికి స‌రిప‌డా న‌గ‌దును బ్యాంకుల‌కు స‌ర‌ఫ‌రా చేస్తున్న‌ట్లు తెలిపింది.

స్వ‌ల్పంగా త‌గ్గిన బంగారం ధ‌ర‌లు

స్వ‌ల్పంగా త‌గ్గిన బంగారం ధ‌ర‌లు

హైద‌రాబాద్‌లో గురువారం బంగారం ధ‌ర‌లు 22 క్యారెట్ల 10 గ్రాములు 29,060 గానూ, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం 31,800గానూ ఉంది. ఈ రోజు 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం 28,770 గానూ, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర 30,770 గానూ ఉంది.

హైద‌రాబాద్‌లో మారే బంగారం రేట్ల‌ను ఎప్పటిక‌ప్పుడు తెలుసుకోండి.

32 పైస‌లు కోల్పోయిన రూపాయి

32 పైస‌లు కోల్పోయిన రూపాయి

శుక్ర‌వారం ప్రారంభ ట్రేడింగ్‌లో డాల‌రుతో రూపాయి 32 పైస‌లు త‌గ్గి 68 కంటే త‌గ్గింది. గురువారం డాల‌రుతో 12 పైస‌లు బ‌ల‌ప‌డి 67.83 పైస‌ల‌కు చేరింది. ఎగుమ‌తిదార్లు, బ్యాంకులు డాల‌రు అమ్మ‌కాల‌కు పాల్ప‌డ‌టంతో ఇలా జ‌రిగింది. అమెరికా వ‌డ్డీ రేట్లు పెంచ‌బోతున్న సంకేతాల‌ను యూఎస్ ఫెడ‌ర‌ల్ రిజ‌ర్వ్ ఛైర్మ‌న్ జానెట్ యెల్లెన్ సంకేతాల‌ను పంప‌డంతో శుక్ర‌వారం డాల‌రు బ‌ల‌ప‌డింది.

వివిధ దేశాల క‌రెన్సీ విలువ‌ల‌ను ఇక్క‌డ తెలుసుకోండి

10.59 గం.ల స‌మ‌యానికి డాల‌రుతో రూపాయి 68.09గా ఉంది.

Read more about: mf fd gold share market stock market
English summary

తెలుగులో బిజినెస్ వార్త‌లు సంక్షిప్తంగా, వేగంగా | Read all business news in telugu in 60 sec

Telugu.goodreturns.in covers latest on stock markets, share market news, corporate and business news, personal finance, mutual funds and a classroom section to enhance investor knowledge. Read All Personal Finance, Share market gold and various business news just One click.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X