For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

డిపాజిట్ వ‌డ్డీ రేట్ల‌ను త‌గ్గించిన మ‌రో రెండు బ్యాంకులు

పెద్ద నోట్ల రద్దుతో బ్యాంకులకు పెద్ద ఎత్తున డ‌బ్బు వ‌చ్చి చేరుతోంది. నగదు నిల్వలు పెరుగుతుండటంతో బ్యాంకులు ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల వడ్డీరేట్లను తగ్గిస్తున్నాయి. కొన్ని రిటైల్‌, బల్క్‌ డిపాజిట్లపై చెల్లి

|

పెద్ద నోట్ల రద్దుతో బ్యాంకులకు పెద్ద ఎత్తున డ‌బ్బు వ‌చ్చి చేరుతోంది. నగదు నిల్వలు పెరుగుతుండటంతో బ్యాంకులు ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల వడ్డీరేట్లను తగ్గిస్తున్నాయి. కొన్ని రిటైల్‌, బల్క్‌ డిపాజిట్లపై చెల్లించే వడ్డీరేట్లను ఎస్‌బీఐ 15 బేసిస్‌ పాయింట్లు తగ్గించిన సంగతి తెలిసిందే. తాజాగా వేటు రంగ బ్యాంకులు ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీలు అదే బాట పట్టాయి. ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై 0.25శాతం వడ్డీరేట్లను తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. అంతేకాకుండా త్వరలో రుణాల‌పై వడ్డీరేట్లు కూడా తగ్గే అవకాశం ఉన్నట్లు సమాచారం.

 డిపాజిట్ వ‌డ్డీ రేట్ల‌ను త‌గ్గించిన మ‌రో రెండు బ్యాంకులు


390 రోజుల నుంచి రెండేళ్ల వ్యవధి ఉండే ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై 0.15శాతం తగ్గిస్తున్నట్లు ఐసీఐసీఐ బ్యాంకు తన వెబ్‌సైట్‌లో పేర్కొంది. దీంతో ప్రస్తుతం 7.25శాతం ఉన్న వడ్డీరేటు 7.10శాతానికి త‌గ్గ‌నుంది.
ఇక హెచ్‌డీసీఎఫ్‌సీ బ్యాంకు కూడా బల్క్‌ డిపాజిట్లపై 0.25శాతం తగ్గినట్లు తన వెబ్‌సైట్‌లో ఉంచింది. తాజా వడ్డీరేట్లు నేటి నుంచి అమల్లోకి వస్తాయని బ్యాంకు తెలిపింది. దీంతో 7శాతం నుంచి 6.25శాతానికి వడ్డీరేట్లు తగ్గాయి.

Read more about: interest rate banks
English summary

డిపాజిట్ వ‌డ్డీ రేట్ల‌ను త‌గ్గించిన మ‌రో రెండు బ్యాంకులు | ICICI, HDFC Bank cut FD rates by 25%

Faced with liquidity comfort, major lenders, including ICICI and HDFC Bank, on Thursday lowered FD rates by up to 0.25 per cent in view of surge in deposits following the demonetisation.
Story first published: Friday, November 18, 2016, 9:41 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X