For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నాలుగంచెల జీఎస్‌టీ రేటుకు కౌన్సిల్ ఓకే

దేశంలో నాలుగంచెల వస్తు సేవల పన్ను అమలులోకి తేవాలని జిఎస్‌టి కౌన్సిల్‌ నిర్ణయించింది. గురువారం ఢిల్లీలో సమావేశమైన జిఎస్‌టీ కౌన్సిల్‌ దేశంలో 5, 12, 18, 28 శాతం పన్ను రేట్లు అమలుపరచాలని నిర్ణయించింది. దీ

|

దేశంలో నాలుగంచెల వస్తు సేవల పన్ను అమలులోకి తేవాలని జిఎస్‌టి కౌన్సిల్‌ నిర్ణయించింది. గురువారం ఢిల్లీలో సమావేశమైన జిఎస్‌టీ కౌన్సిల్‌ దేశంలో 5, 12, 18, 28 శాతం పన్ను రేట్లు అమలుపరచాలని నిర్ణయించింది. దీంతో వచ్చే ఏప్రిల్‌ ఒకటో తేదీ నుంచి కొత్త పన్నుల విధానాన్ని ఆచరణీయం చేసే దిశగా ఒక పెద్ద అడుగు పడినట్టయింది. ఈ నేప‌థ్యంలో జీఎస్‌టీ ట్యాక్స్ శ్లాబులోని నాలుగు రేట్ల గురించి ప‌లు అంశాల‌ను తెలుసుకుందాం.

జీఎస్‌టీ కౌన్సిల్‌

జీఎస్‌టీ కౌన్సిల్‌

జీఎస్టీ చట్టంలోని సెక్షన్ 12 కింద కేంద్రం కౌన్సిల్‌ను ఏర్పాటు చేసింది. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఈ కౌన్సిల్ కు అధ్యక్షుడుగా ఉంటారు. ప్రధాన అటు ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణ్యం నేతృత్వంలోని ప్యానెల్ కొన్ని సూచనలు, సలహాలు అందించింది.ఈ కౌన్సిల్ కు ఆర్థిక మంత్రి చైర్మన్ గా వ్యవహరించనుండగా, రాష్ట్రాల ఆర్థికమంత్రులు సభ్యులుగా ఉంటారు. వస్తు సేవలపై పన్ను రేటు ఎంత ఉండాలి? మినహాయింపు ఉండే విభాగాలేంటి? పన్ను విధానం, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం తదితర అంశాలపై నిర్ణయాలు తీసుకోనుంది.

నిత్యావ‌స‌రాలు

నిత్యావ‌స‌రాలు

ప్రజలకు జీవనాధారమైన ఆహార వస్తువులను జీరో టాక్స్‌ రేటులో పెట్టారు. వినియోగదారుల ద్రవ్యోల్బణం బాస్కెట్‌లో సగం వాటా ఆహార వస్తువులదే. ఇవి కాకుండా ప్రజలకు నిత్యావ‌స‌రాల‌పై కనిష్ఠంగా ఐదు శాతం శ్లాబ్‌ వర్తింప చేయాలని జిఎస్‌టి కౌన్సిల్‌ నిర్ణయించింది.

వీటిపై గ‌రిష్ట ప‌న్ను

వీటిపై గ‌రిష్ట ప‌న్ను

మ‌రో వైపు విలాసవంతమైన వస్తువులు, సిగరెట్లు, కూల్‌డ్రింక్‌లు గరిష్ఠంగా 28 శాతం శ్లాబ్‌లో ఉంటాయి. వీటిపై ఈ పన్నుతో పాటు అదనపు సుంకం కూడా ప్రభుత్వం విధిస్తుంది. ఇతర వస్తువులన్నింటికీ 12, 18 శాతం ప్రామాణిక రేట్లు వర్తిస్తాయని జిఎస్‌టి కౌన్సిల్‌ సమావేశం అనంతరం ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ చెప్పారు. సబ్బులు, ఆయిల్‌, షేవింగ్‌ స్టిక్‌లు, టూత పేస్టులు వంటివన్నీ 18 శాతం పన్ను బ్రాకెట్‌లోకి వచ్చే అవకాశం ఉన్నట్టు ఆయన తెలిపారు. ప్రస్తుతం 30 నుంచి 31 శాతం పన్ను శ్లాబ్‌లో ఉన్న (ఎక్సైజు సుంకం 12.5 శాతం, వాట్‌ 14.5 శాతం కలిపి) వస్తువులన్నింటి పైన గరిష్ఠ రేటును 28 శాతంగా నిర్ణయించినట్టు జైట్లీ తెలిపారు.

రాష్ట్ర ప్ర‌భుత్వాలు కోల్పోయే లోటును భ‌ర్తీ చేస్తాం

రాష్ట్ర ప్ర‌భుత్వాలు కోల్పోయే లోటును భ‌ర్తీ చేస్తాం

విలాసవంతమైన కార్లు, పొగాకు ఉత్పత్తులు, కూల్‌డ్రింక్‌లపై వసూలు చేసే సెస్‌, క్లీన్‌ ఎనర్జీ సెస్‌ ద్వారా సమకూరే ఆదాయాన్ని జిఎస్‌టి అమలు వల్ల రాష్ర్టాలు నష్టపోతున్న ఆదాయం భర్తీకి ఉపయోగించనున్నట్టు జైట్లీ తెలిపారు.

అయితే ఈ సెస్‌ ఇప్పుడు వాటిపై వసూలు చేస్తున్న పన్ను రేటు, జిఎస్‌టిలో కుదించిన రేటుకు మధ్యస్థంగానే ఉంటుంది గనుక వాస్తవ భారం ఏమీ పెరగబోదని ఆయన స్పష్టం చేశారు. ఐదు సంవత్సరాల అనంతరం ఈ సెస్‌లన్నీ రద్దవుతాయన్నారు. జిఎస్‌టి అమలు వల్ల రాష్ర్టాలు నష్టపోతున్న ఆదాయానికి ఐదు సంవత్సరాల పాటు పరిహారం చెల్లించేందుకు కేంద్రం అంగీకరించిన విషయం విదితమే. జిఎస్‌టి నష్టపరిహారం భారం కేంద్రంపై 50 వేల కోట్ల రూపాయల మేరకు ఉంటుందని అంచనా.

రేట్ల విష‌యంలో కౌన్సిల్ ఏకాభిప్రాయం

రేట్ల విష‌యంలో కౌన్సిల్ ఏకాభిప్రాయం

గత నెలలో జిఎస్‌టి కౌన్సిల్‌ సమావేశంలో ఈ నాలుగంచెల రేట్లను 6, 12, 18, 26 శాతంగా పరిగణనలోకి తీసుకున్నారు. తాజాగా ఖరారు చేసిన రేటులో కనిష్ఠ స్థాయి శ్లాబ్‌ను ఒక శాతం తగ్గించి ఐదు శాతం చేయగా గరిష్ఠ స్థాయి శ్లాబ్‌ను రెండు శాతం పెంచి 28 శాతం చేశారు. మధ్యలో రేట్లు రెండూ యథాతథంగా ఉన్నాయి. గురువారం నాటి జిఎస్‌టి కౌన్సిల్‌ ఈ పన్ను రేట్ల విషయంలో ఏకాభిప్రాయానికి వచ్చింది.

రాష్ట్ర ప్ర‌భుత్వాల వాద‌న‌లు

రాష్ట్ర ప్ర‌భుత్వాల వాద‌న‌లు

కేరళ వంటి రాష్ర్టాలు గరిష్ఠ స్థాయిలో పన్ను రేటు 40 శాతం విధించాలని కోరాయి. బంగారంపై నాలుగు శాతం జిఎస్‌టి విధించాలని తాము ప్రతిపాదించామని, ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్‌ సిసోడియా రెండు శాతం పన్ను విధించాలని సూచించారని జైట్లీ చెప్పారు.

ఇది కూడా చ‌ద‌వండి జీఎస్‌టీ వ‌ల్ల సామాన్యుడికి క‌లిగే ప్ర‌యోజ‌నాలు

బంగారంపై రేటును నిర్ణ‌యించ‌లేదు

బంగారంపై రేటును నిర్ణ‌యించ‌లేదు

బంగారంపై పన్ను రేటు నిర్ణయాన్ని వాయిదా వేసినట్టు ఆయన తెలిపారు. అన్ని శ్లాబ్‌లను కలిపితే సగటు పన్ను రేటు కాంగ్రె్‌సతో సహా పలు పార్టీలు కోరిన 18 శాతం కన్నా దిగువనే ఉన్నట్టు ఆయన తెలిపారు. ఏయే వస్తువులు ఏ శ్లాబ్‌లోకి వచ్చేది అధికారులు చర్చించి జాబితా రూపొందిస్తారని, దాన్ని జిఎస్‌టి కౌన్సిల్‌ ఖరారు చేస్తుందని జైట్లీ చెప్పారు.

 జీఎస్‌టీ వ‌స్తే ఏమ‌వుతుంది?

జీఎస్‌టీ వ‌స్తే ఏమ‌వుతుంది?

జీఎస్‌టీ అమలులోకి వస్తే పొగాకు ఉత్పత్తులు, పాన్‌ మసాలా, కూల్‌డ్రింక్‌ల ధరలు చుక్కలనంటుతాయి. వీటిపై గరిష్ఠంగా 28 శాతం పన్ను విధించడంతో పాటు అదనంగా సెస్‌ కూడా విధించేందుకు జిఎస్‌టి కౌన్సిల్‌ నిర్ణయించింది. ప్రస్తు తం పొగాకు ఉత్పత్తులపై 65 శాతం, కూల్‌ డ్రింక్స్‌పై 40 శాతం పన్ను పడుతోంది.

English summary

నాలుగంచెల జీఎస్‌టీ రేటుకు కౌన్సిల్ ఓకే | Four-tier GST rate structure finalised

A four-tier GST tax structure of 5, 12, 18 and 28 per cent, with lower rates for essential items and the highest for luxury and de-merits goods that would also attract an additional cess, was decided by the all-powerful GST Council on Thursday.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X