For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

టెక్ మ‌హీంద్రా లాభాలు త‌గ్గాయ్‌

ప్రముఖ ఐటీ సంస్థ టెక్ మహింద్రా లాభాల్లో పడిపోయింది. 2016 ఆర్థికసంవత్సరం సెప్టెంబర్‌తో ముగిసిన రెండో త్రైమాసికంలో ఏకీకృత‌ నికర లాభాలు 19.2 శాతం క్షీణించి, కేవలం రూ.643.4 కోట్ల నికరలాభాలను మాత్రమే ఆర్జి

|

ప్రముఖ ఐటీ సంస్థ టెక్ మహింద్రా లాభాల్లో పడిపోయింది. 2016 ఆర్థికసంవత్సరం సెప్టెంబర్‌తో ముగిసిన రెండో త్రైమాసికంలో ఏకీకృత‌ నికర లాభాలు 19.2 శాతం క్షీణించి, కేవలం రూ.643.4 కోట్ల నికరలాభాలను మాత్రమే ఆర్జించింది. గతేడాది ఇదే స‌మ‌యంలో ఈ లాభాలు రూ.780.3 కోట్లగా ఉన్నాయి. త్రైమాసిక ఫలితాల్లో నిర్వ‌హ‌ణ కార్య‌క‌లాపాల నుంచి వచ్చిన మొత్తం ఆదాయాలు 8% ఎగిసి రూ.7,167.4 కోట్లగా నమోదైనట్టు కంపెనీ బీఎస్ఈ ఫైలింగ్‌లో పేర్కొంది.

టెక్ మ‌హీంద్రా లాభాలు త‌గ్గాయ్‌

ఈ ఆర్థిక త్రైమాసికంలో తమ పనితీరు, కొత్త సాంకేతిక అంశాల్లో తాము పెట్టిన పెట్టుబడుల, సామర్థ్యాల ఫలితమేనని టెక్ మహింద్రా వైస్ చైర్మన్ వినీత్ నాయర్ వెల్ల‌డించారు. డాలర్ విలువలో ఆర్జించే పీఏటీలు(పన్నుల అనంతర లాభాలు) యేటికేటికీ 18.2 శాతం పడిపోయి, 96.5 మిలియన్ డాలర్లుగా నమోదైనట్టు పేర్కొన్నారు. మొత్తంగా ఈ క్వార్టర్ తమకు మంచి త్రైమాసికమేనని, కీలకమైన కమ్యూనికేషన్, ఎంట‌ర్‌ప్రైజ్ బిజినెస్‌లు వృద్ధిని నమోదుచేయడానికి దోహదం చేశాయని కంపెనీ సీఈవో సీపీ గుర్నానీ తెలిపారు.

Read more about: tech mahindra
English summary

టెక్ మ‌హీంద్రా లాభాలు త‌గ్గాయ్‌ | Tech Mahindra Shares Gain 6% because of good Q2 results

Tech Mahindra surprised the street, after Infosys, TCS and Wipro delivered numbers that lagged estimates.
Story first published: Friday, October 28, 2016, 16:02 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X