For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ప్ర‌పంచంలో త‌క్కువ ఖ‌రీదైన న‌గ‌రాలు

పెట్టుబ‌డుల క‌న్స‌ల్టెన్సీ గ్రూప్ మెర్సెర్ ప్ర‌పంచంలో 17 త‌క్కువ ఖ‌రీదు గ‌ల న‌గ‌రాల జాబితాను త‌యారుచేసింది. వాటి జాబితా కింద చూడండి. ప్ర‌పంచంలో చీప్ న‌గ‌రాలు ఇవే...

|

పెట్టుబ‌డుల క‌న్స‌ల్టెన్సీ గ్రూప్ మెర్సెర్ ప్ర‌పంచంలో 17 త‌క్కువ ఖ‌రీదు గ‌ల న‌గ‌రాల జాబితాను త‌యారుచేసింది. తూర్పు యూర‌ప్‌, ఆఫ్రికా ప్రాంతంలో ఉన్న న‌గ‌రాలు ఎక్కువ ఉండ‌గా, అవి స‌మీప భ‌విష్య‌త్తులో అలా ఉంటుంద‌ని చెప్ప‌డానికి లేదు. ఇక్క‌డ ఆయా న‌గ‌రాల‌ను వీక్షించండి.

1) విన్ఢోక్‌, న‌మీబియా

1) విన్ఢోక్‌, న‌మీబియా

న‌మీబియా రాజ‌ధాని విన్డోక్ ప్ర‌పంచంలోనే అతి త‌క్కువ ఖ‌రీదైన న‌గ‌రం. ఈ న‌గ‌ర జ‌నాభా కేవ‌లం 3,22,500. దాని వ‌ల్లే న‌గ‌రంలో జీవించడానికి అయ్యే ఖ‌ర్చు త‌క్కువగా ఉంది.

 2) కేప్‌టౌన్‌, ద‌క్షిణాఫ్రికా

2) కేప్‌టౌన్‌, ద‌క్షిణాఫ్రికా

జోహెన్నెస్‌బ‌ర్గ్ లాగా ఈ న‌గ‌రంలో హింసా ప్ర‌వృత్తి ఉంది. అందుకే ఇక్క‌డ నివ‌సించాలంటే చాలా మంది ఆలోచిస్తారు. అయితే ఎటువంటి అనుమానాలు అక్క‌ర్లేకుండా ఇది అంద‌మైన న‌గ‌రం. ఆఫ్రికా మొత్తం అభివృద్ది చెందుతున్న‌ట్లే ఇక్క‌డ వ్యాపార కేంద్రాలు నిత్యం మెరుగ‌వుతున్నాయి.

3) బిష్కెక్‌, కిర్జికిస్తాన్‌

3) బిష్కెక్‌, కిర్జికిస్తాన్‌

స‌ముద్ర మ‌ట్టానికి 800 మీట‌ర్ల ఎత్తులో బిష్కెక్ ఉంటుంది. పాల‌రాతి నిర్మాణాల‌తో పాటు సోవియ‌ట్ ఆర్కిటెక్చ‌ర్ ఈ న‌గ‌రంలో ప్ర‌ముఖంగా కనిపిస్తుంది. వాతావ‌ర‌ణ కాలుష్యం ప్ర‌మాదక‌ర స్థాయిలో ఉండ‌టంతో ప‌ర్వ‌తాలున్నా అక్క‌డికి వెళ్ల‌డానికి ప‌ర్యాట‌కుల‌ను అనుమ‌తించరు.

4) బ్లాంటైర్‌, మ‌లావి

4) బ్లాంటైర్‌, మ‌లావి

యూరోపియ‌న్ వ‌ల‌స‌వాదుల‌కు ప్ర‌ముఖ కేంద్ర‌మిది. వారంతా మ‌లావి లేక్‌ను చితింబా బీచ్ ద్వారా ఎంజాయ్ చేస్తారు. ఆర్థిక‌, వ్య‌వ‌సాయ రంగాలు ఈ ప్ర‌దేశానికి ఉన్న ప్ర‌ధాన బ‌లం. ఎక్కువ‌గా అభివృద్దికి నోచుకోని కార‌ణంగా ఇక్క‌డ నివ‌సించేందుకు త‌క్కువ ఖ‌ర్చ‌వుతోంది.

5) జోహెన్నెస్‌బ‌ర్గ్‌, ద‌క్షిణాఫ్రికా

5) జోహెన్నెస్‌బ‌ర్గ్‌, ద‌క్షిణాఫ్రికా

సౌత్ ఆఫ్రికాలో అతిపెద్ద న‌గ‌ర‌మైన జోహెన్నస్‌బ‌ర్గ్ అంతర్జాతీయంగా వ్యాపారానికి ప్ర‌సిద్దికెక్కుతోంది. నేరాల రేటు ఎక్కువ‌గా ఉండ‌ట‌మే ఇక్క‌డ కాస్ట్ ఆఫ్ లివింగ్ త‌క్కువ ఉండేందుకు ఒక కార‌ణంగా చెబుతుంటారు. ఈ న‌గ‌రంలో హ‌త్యల రేటు ఎక్కువ‌గా ఉంటుందట‌.

6) మిన్స్క్ , బెలార‌స్

6) మిన్స్క్ , బెలార‌స్

పూర్వ‌పు సోవియ‌ట్ నుంచి విడిపోయిన ప్రాంతాల్లో ఇది ఒక‌టి. త‌యారీ రంగంలో వృద్దితో పాటు, మ‌రికొన్ని ఫ్యాక్ట‌రీల‌ను అనుమ‌తించ‌డం ద్వారా క‌మ్యూనిజం నుంచి నెమ్మ‌దిగా దూర‌మ‌వుతోంది. ఇక్క‌డ నిరుద్యోగిత త‌క్కువ‌గా ఉంటుంది. ఉపాధి క‌ల్ప‌నా కార్య‌క్ర‌మాల వ‌ల్ల ఇది సాధ్య‌మ‌వుతోంది.

7)టునిస్‌, ట్యునీషియా

7)టునిస్‌, ట్యునీషియా

త‌యారీ రంగం నుంచి సేవా రంగం వైపు మ‌ళ్లుతున్న న‌గ‌రాల్లో ట్యునిస్ ఒక‌టి. ఆఫ్రికాలో చాలా న‌గ‌రాల్లో వ‌లె ఇక్క‌డ జ‌నాభా పెరుగుతోంది. అయిన‌ప్ప‌టికీ నివసించడానికి త‌క్కువ ఖ‌ర్చ‌య్యే న‌గ‌రాల్లో ఇది ఉంది.

8) క‌రాచి, పాకిస్తాన్‌

8) క‌రాచి, పాకిస్తాన్‌

ప్ర‌పంచంలోనే 7వ అత్యుత్త‌మ జ‌న స‌మ్మ‌ర్ధ‌మైన న‌గ‌రం క‌రాచి. దాదాపు 2 కోట్ల 50 ల‌క్ష‌ల జ‌నాభా ఉంది. ఎక్కువ మంది త‌క్కువ ప్రాంతంలో నివ‌సించ‌డం మూలంగా ఈ న‌గ‌రంలో కాస్ట్ ఆఫ్ లివింగ్ త‌క్కువ‌గా ఉండేందుకు హేతువ‌యింది. అంతే కాకుండా ర‌క్షిత మంచి నీరు, హింస విష‌యంలో ఈ న‌గ‌రం చాలా స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కొంటోంది.

9) గబోరోన్‌, బోత్స‌వానా

9) గబోరోన్‌, బోత్స‌వానా

బోత్స‌వానాలో అతిపెద్ద న‌గ‌రం గ‌బోరోన్‌. ఆర్థిక రంగంలో 20% మందికి పైగా ప్ర‌జ‌లు ప‌నిచేస్తున్నారు. స‌బ్ అర్బ‌న్ వృద్ది ఎక్కువ‌గా చోటుచేసుకుంది.

10) లుసాకా, జాంబియా

10) లుసాకా, జాంబియా

గ‌త కొన్నేళ్లుగా ద‌క్షిణాఫ్రికాలో వేగంగా అభివృద్ది చెందుతున్న న‌గ‌రాల్లో లుసాకా ముందు వ‌రుస‌లో ఉంది. సాహ‌స కృత్యాల‌ను ఇస్ట‌ప‌డేవారు వ‌స్తూండ‌టం వ‌ల్ల ప‌ర్యాట‌కుల‌కు మంచి కేంద్రంగా త‌యారయింది. 20 లక్ష‌ల కంటే జ‌నాభా త‌క్కువ ఉండ‌టం న‌గ‌రంలో జీవించేందుకు అయ్యే ఖ‌ర్చు త‌క్కువ అయ్యేందుకు దోహ‌ద‌ప‌డింది. ఇది చాలా కాలం ఇలా ఉంటుంద‌ని చెప్ప‌లేం.

 11) స్కోప్జె, మాసిడోనియా

11) స్కోప్జె, మాసిడోనియా

ఈ న‌గ‌రానికి 4000 బీ.సీ నుంచి చ‌రిత్ర ఉంది. మొద‌టి నుంచి జీవ‌నానికి ఖ‌ర్చులు పెర‌గ‌కుండా ఉండే ప్ర‌దేశాల్లో ఇది ఒక‌టిగా ఉంటూ వ‌స్తోంది. ఎక్కువ జ‌నాభా మూలంగా నిరుద్యోగిత రేటు(30%) అదే స్థాయిలో ఉంటోంది.

12) Tbilisi, జార్జియా

12) Tbilisi, జార్జియా

తూర్పు యూర‌ప్‌లోని Tbilisi త‌క్కువ ఖ‌రీదైన న‌గ‌రాల్లో ఒక‌టిగా ఉంది. ప్ర‌పంచంలోనే సురక్షిత‌మైన న‌గ‌రాల్లో ఇది చోటు ద‌క్కించుకుంది. ప‌ర్యాట‌కుల‌కు స్వ‌ర్గ‌ధామంగా ఉన్న‌ట్లు నివేదిక‌లు చెబుతున్నాయి.

13) మాంటెర్రీ, మెక్సికో

13) మాంటెర్రీ, మెక్సికో

వాయువ్య మెక్సికోలో మాంటెర్రీ న‌గ‌రం ఉంది. ప్ర‌పంచ‌వ్యాప్తంగా ప్ర‌జ‌ల జీవ‌న నాణ్య‌త‌లో ఇది 94వ ర్యాంకును సాధించింది. 2006లో ఈ న‌గ‌ర జీడీపీ 78.5 బిలియ‌న్ డాల‌ర్లు. 2010 సంవ‌త్స‌రంలో ఒక్కో వ్య‌క్తి త‌ల‌స‌రి ఆదాయం 6,07,042పెసో లేదా 46,634 డాల‌ర్లుగా ఉంది. ఇక్క‌డ త‌క్కువ ఖ‌ర్చులుండ‌ట‌మే త‌ల‌సరి ఆదాయం, జీడీపీ ఎక్కువ ఉండేందుకు కార‌ణాలుగా నిలుస్తున్నాయి.

14) అల్మ‌టీ, క‌జ‌క్‌స్థాన్‌

14) అల్మ‌టీ, క‌జ‌క్‌స్థాన్‌

క‌జ‌క్‌స్థాన్ జీడీపీలో 20% అల్మ‌టీ నుంచే వ‌స్తుంది. ఆర్థిక రంగం ఇక్క‌డ ప్ర‌ధాన ఆదాయ వ‌న‌రు. యూరో-చైనా మెగా హైవేకు ఇక్క‌డ ప్ర‌తిపాద‌న‌లు ఉన్నాయి. ఒక‌వేళ ఇది కార్య‌రూపం దాలిస్తే ఇక్క‌డ జీవించేందుకు అయ్యే ఖ‌ర్చులు పెరుగుతాయి.

 15) స‌రాజెవో, హెర్జెగోవినా

15) స‌రాజెవో, హెర్జెగోవినా

బోస్నియా, హెర్జెగొవినా రాజ‌ధాని ఆ రెండు దేశాల్లో అతిపెద్ద న‌గ‌ర‌మైన స‌రాజెవో క‌మ్యూనిస్టు ప‌రిపాల‌న త‌ర్వాత చాలా ఇబ్బందుల‌ను ఎదుర్కొంది. అక్క‌డ ఉన్న ఆర్థిక వ్య‌వ‌స్థ కార‌ణంగా జీవ‌న ఖ‌ర్చులు త‌క్కువ‌గా ఉండేందుకు దారితీసింది.

16) కోల్‌క‌త‌, భార‌త‌దేశం

16) కోల్‌క‌త‌, భార‌త‌దేశం

కోల్‌క‌త పూర్వ‌నామం క‌ల‌క‌త్తా. మెట్రో న‌గ‌ర విస్తీర్ణం 1887 చ‌ద‌ర‌పు కిలోమీట‌ర్లు ఉండ‌గా జ‌నాభా 1కోటి 50 ల‌క్ష‌ల‌కు పైబ‌డి ఉంది. ఇండియాకు అభివృద్ది చెందుతున్న దేశంగా ముద్ర ఉన్న‌ప్ప‌టికీ పేద‌రికం చాలా ఇబ్బందిక‌రంగా ఉంది. న‌గ‌రాల్లో మురికివాడ‌లు అభివృద్దికి అవ‌రోధాలుగా ఉంటున్నాయి. అయితే ఎక్కువ మంది ఉపాధి అవ‌కాశాల‌కు త‌ర‌లి రావ‌డం మూలంగా న‌గ‌రాల్లో నివ‌సించడానికి అయ్యే ఖ‌ర్చు త‌గ్గుతోంది.

17) బెల్‌గ్రేడ్‌, సెర్బియా

17) బెల్‌గ్రేడ్‌, సెర్బియా

బెల్‌గ్రేడ్ చాలా అంద‌మైన న‌గ‌రం, ఆ వాతావర‌ణాన్ని ఆస్వాదించేందుకు ప‌ర్యాట‌కులు ఇష్ట‌ప‌డ‌తారు. ఇక్క‌డ అత్య‌ధిక ఉష్ణోగ్ర‌త 43.6 డిగ్రీల వ‌ర‌కూ, అత్య‌ల్ప ఉష్ణోగ్ర‌త -26.2 డిగ్రీల వ‌ర‌కూ న‌మోద‌వుతుంది.

English summary

ప్ర‌పంచంలో త‌క్కువ ఖ‌రీదైన న‌గ‌రాలు | cheapest cities in the world

The 17 cheapest cities in the world have been announced by investment consultancy group Mercer.Keep scrolling to see the 17 cities with the lowest cost of living in the world.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X