For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రిల‌య‌న్స్ వంట‌గ్యాస్

ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్‌ఐఎల్).. ఎల్‌పీజీ (వంటగ్యాస్) రిటైల్ రంగంలోకి ప్రవేశించింది. ప్రపంచంలోనే అతిపెద్ద చమురు శుద్ధి వ్యవస్థను కలిగి ఉన్న ఆ సంస్థ 4 కిలోల ఎల్‌పీజ

|

ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్‌ఐఎల్).. ఎల్‌పీజీ (వంటగ్యాస్) రిటైల్ రంగంలోకి ప్రవేశించింది. ప్రపంచంలోనే అతిపెద్ద చమురు శుద్ధి వ్యవస్థను కలిగి ఉన్న ఆ సంస్థ 4 కిలోల ఎల్‌పీజీ సిలిండర్లను మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. అయితే పైలట్ ప్రాజెక్టులో భాగంగా తొలుత 4 జిల్లాల్లోనే ఈ 4 కిలోల ఎల్‌పీజీ సిలిండర్ల సరఫరాను ప్రారంభించింది. ఈ మేరకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికానికి గాను ఇటీవల ప్రవేశపెట్టిన ఆర్థిక ఫలితాల విడుద‌ల సందర్భంగా నిర్వహించిన సమావేశంలో రిలయన్స్ స్పష్టం చేసింది.

reliance gas

దేశవ్యాప్తంగా ఎల్‌పిజి వినియోగం 10 శాతం పెరిగిన నేపథ్యంలో రిలయన్స్‌తోపాటు ఎస్సార్ ఆయిల్ సైతం ఎల్‌పీజీపై దృష్టి సారించింది. ప్రస్తుతం ప్రభుత్వరంగ సంస్థలైన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీ), భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్), హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్‌పీసీఎల్) సంస్థలే ఎల్‌పీజీ రిటైల్ మార్కెట్‌లో సింహ భాగం వాటాను క‌లిగి ఉన్నాయి. 5 కిలోలు, 14.2 కిలోలతో గృహవసరాలకు వంటగ్యాస్‌ను సరఫరా చేస్తున్న ఈ సంస్థలు.. 19 కిలోలతో వాణిజ్య అవసరాలకూ అందిస్తున్నాయి. వీటిలో సబ్సిడీ ధరకు ఏడాదికి 14.2 కిలోల సిలిండర్లు 12, 5 కిలోల సిలిండర్లను 34 ప‌రిమితి మేర‌కు అమ్ముతున్నాయి. ఈ పరిమితి దాటితే మార్కెట్ ధరను వసూలు చేస్తున్నాయి. ప్ర‌యివేటు సంస్థలు ఎల్‌పీజీ రంగంలో ఉన్నా సిలిండర్లను మార్కెట్ ధరకే అమ్ముతున్నాయి. అయితే 10 లక్షలకు మించి వార్షిక ఆదాయం ఉన్నవారికి వంటగ్యాస్ సబ్సిడీని ఎత్తేయడం, దాంతో సబ్సిడీ సిలిండర్ ధర, సబ్సిడీయేతర సిలిండర్ ధరకు మధ్య పెద్దగా తేడా లేకపోవడంతో ప్రైవేట్‌రంగ సంస్థలు కూడా ఎల్‌పీజీమార్కెట్‌లోకి ప్రవేశించాలని చూస్తున్నాయి. ఢిల్లీలో 14.2 కిలోల సబ్సిడీ సిలిండర్ ధర 427 రూపాయలుగా ఉంటే, సబ్సిడీయేతర సిలిండర్ ధర 490 రూపాయలుగా ఉంది. గతంలో ఈ తేడా 400-500 రూపాయలుగా ఉండటం గమనార్హం. తమ ప్లాంట్లలో ఉత్పత్తి చేసిన ఎల్‌పిజిలో 1.2 లక్షల టన్నుల వరకు ప్రైవేట్ వంటగ్యాస్ మార్కెటింగ్ సంస్థలకు అమ్ముకోవచ్చని గ‌తేడాది రిలయన్స్ సంస్థ‌కు కేంద్రం అనుమతి కూడా ఇచ్చింది. ఈ క్రమంలోనే 4 కిలోల వంటగ్యాస్ సిలిండర్లతో రిలయన్స్ రంగంలోకి దిగింది.

Read more about: reliance ril
English summary

రిల‌య‌న్స్ వంట‌గ్యాస్ | Reliance forays into retail gas market

Reliance Industries (RIL) has marked its entry into cooking gas retailing, launching a 4-kg LPG cylinder in 4 districts on pilot basis. The government had last year permitted RIL to sell up to 1.2 lakh tonnes (LT) of LPG produced at its plants to private cooking gas marketers.
Story first published: Monday, October 24, 2016, 17:23 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X