For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీ కార్డు సుర‌క్షిత‌మేనా?

ఇటీవ‌ల కొన్ని బ్యాంకుల‌కు చెందిన కార్డుల‌ను మాల్‌వేర్ సాయంతో అన‌ధికారిక లావాదేవీల‌కు ఉప‌యోగించార‌న్న స‌మాచారం గుప్పుమంది. ఎస్‌బీఐ 6 ల‌క్ష‌ల కార్డుల‌ను త‌క్ష‌ణ‌మే బ్లాక్ చేసిన‌ట్లు ప్ర‌క‌టించింది. ఈ నే

|

ఇటీవ‌ల కొన్ని బ్యాంకుల‌కు చెందిన కార్డుల‌ను మాల్‌వేర్ సాయంతో అన‌ధికారిక లావాదేవీల‌కు ఉప‌యోగించార‌న్న స‌మాచారం గుప్పుమంది. ఎస్‌బీఐ 6 ల‌క్ష‌ల కార్డుల‌ను త‌క్ష‌ణ‌మే బ్లాక్ చేసిన‌ట్లు ప్ర‌క‌టించింది. ఈ నేప‌థ్యంలో వివిధ నియంత్ర‌ణ సంస్థ‌ల‌ను, ఆర్‌బీఐను విచార‌ణ‌కు ఆదేశించింది. ఆర్థిక శాఖ‌. మొత్తం 30 లక్ష‌ల కార్డులు ప్ర‌మాదంలో ప‌డిన‌ట్లు పీటీఐ వార్తాక‌థ‌నం వెల్ల‌డించింది. ఎందుకైనా మంచిది పాస్‌వ‌ర్డ్ ఎప్పుడు ఒక‌టే ఉండ‌కుంగా చూసుకోండి. ఈ నేప‌థ్యంలో ఈ ప‌ది విష‌యాల‌ను తెలుసుకుందాం.

10 రోజుల్లో నివేదిక‌

10 రోజుల్లో నివేదిక‌

1. ఈ మొత్తం వ్య‌వ‌హారాల‌పై విచార‌ణ జ‌రిపేందుకు ఒక టెక్నిక‌ల్ ఎంక్వైరీ క‌మిటీని వేశారు. ఇది వ‌చ్చే వారం, ప‌ది రోజుల్లో త‌న నివేదిను స‌మర్పిస్తుంది. మొత్తం వాస్త‌వంగా ఏం జ‌రిగింద‌నే దాని గురించి అప్పుడు తెలిసే అవ‌కాశం ఉంది. ప్ర‌ధానంగా కార్డుల వివ‌రాలు హ్యాకింగ్‌కు గురాయ‌న్న‌ది ప్ర‌ధానంగా వ‌స్తున్న వార్త‌ల‌ను బ‌ట్టి తెలుస్తోంది.

ప్ర‌భుత్వ ఆదేశం

ప్ర‌భుత్వ ఆదేశం

2. ప్ర‌భుత్వం గ‌త వార‌మే ఆర్‌బీఐ, బ్యాంకుల‌ను హ్యాకింగ్ వ‌ల్ల క‌లిగిన‌ న‌ష్టం గురించిన జ‌రిగిన వివ‌రాల‌ను స‌మ‌ర్పించాల్సిందిగా ఆదేశించింది. అదే విధంగా సైబ‌ర్ నేరాల క‌ట్ట‌డికి ఏ విధంగా స‌న్న‌ద్దంగా ఉన్నారో తెల‌పాల్సిందిగా కోరింది.

ఎన్‌పీసీఐ

ఎన్‌పీసీఐ

3. ముఖ్య‌మైన ప్ర‌భుత్వ‌, ప్ర‌యివేటు రంగ బ్యాంకుల‌కు చెందిన 32 ల‌క్ష‌ల కార్డులు సైబ‌ర్ మాల్‌వేర్ దాడికి గుర‌యానేది ఇప్ప‌టికి ఉన్న స‌మాచారం. ఈ విష‌యాన్ని నేష‌న‌ల్ పేమెంట్స్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా(ఎన్‌పీసీఐ) చెప్పింది. ఎన్‌పీసీఐ ఆర్‌బీఐ ఆధ్వ‌ర్యంలో ప‌నిచేస్తుంది.

ఫోరెన్సిక్ ఆడిట్‌

ఫోరెన్సిక్ ఆడిట్‌

4. కొంత మంది కార్డుల‌ను చైనా, అమెరికాల్లో మోస‌పూరితంగా వినియోగించార‌ని బ్యాంకు యాజమాన్యాలు నివేదించాయి. దీంతో ఎన్‌పీసీఐ ఫోరెన్సిక్ ఆడిట్‌కు ఆదేశించింది.

వినియోగ‌దార్ల ఫిర్యాదులు

వినియోగ‌దార్ల ఫిర్యాదులు

5. 19 బ్యాంకుల‌కు చెందిన 641 మంది క‌స్ట‌మ‌ర్లు ఫిర్యాదులు చేశారు .త‌మ ఖాతాల నుంచి వారి ప్ర‌మేయం లేకుండా 1.3 కోట్ల రూపాయ‌ల‌ను డ్రా చేశారని వారు ఆరోపిస్తున్నారు.

విదేశాల్లో కార్డు విత్‌డ్రాయ‌ల్స్‌

విదేశాల్లో కార్డు విత్‌డ్రాయ‌ల్స్‌

6. వారంతా దేశంలోనే కార్డుల‌ను వినియోగిస్తుండ‌గా విదేశాల్లో త‌మ కార్డుల ద్వారా విత్‌డ్రాయ‌ల్స్ జ‌రిగాయ‌ని, ఇవి మోస‌పూరిత‌మైన‌వ‌ని వారు వాపోతున్నారు. వీటిని స‌దరు బ్యాంకులు సైతం ధ్రువీక‌రించాయి.

కార్డుల బ్లాక్‌, పిన్ మార్పు

కార్డుల బ్లాక్‌, పిన్ మార్పు

7. ఎవ‌రి కార్డుల‌యితే సైబ‌ర్(మాల్‌వేర్‌) దాడుల‌కు గుర‌య్యాయ‌ని అనుమానం క‌లిగితే వాటిని చాలా బ్యాంకులు బ్లాక్ చేశాయి. ఇంకా కొంత మంది క‌స్ట‌మ‌ర్ల‌ను నేరుగా సందేశాలు పంపి పిన్ మార్చుకోవాల్సిందిగా కోరాయి.

కొత్త కార్డులు

కొత్త కార్డులు

8. అతిపెద్ద బ్యాంక్ ఎస్‌బీఐ తాము 6లక్ష‌ల 25 వేల కార్డుల స్థానంలో కొత్త‌వి జారీచేయ‌నున్నట్లు తెలిపింది. వీటికి ఎటువంటి రుసుములు ప్ర‌త్యేకంగా వ‌సూలు చేయ‌ర‌ని విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం. ఇందుకోసం దాదాపు రూ. 10 నుంచి రూ. 12 ల‌క్ష‌ల వ‌ర‌కూ ఖ‌ర్చ‌వుతుంది.

ఎస్‌బీఐ క‌స్ట‌మ‌ర్ల‌కు సూచ‌న‌

ఎస్‌బీఐ క‌స్ట‌మ‌ర్ల‌కు సూచ‌న‌

9. క‌స్ట‌మ‌ర్ల‌కు జ‌రిగిన న‌ష్టాన్ని రిక‌వ‌ర్ చేసేందుకు ప్ర‌య‌త్నిస్తున్నామ‌ని చాలా బ్యాంకులు ప్ర‌క‌టించాయి. ముందు జాగ్ర‌త్త చ‌ర్య‌గా ఎస్‌బీఐ వినియోగ‌దారులు త‌మ ఏటీఎమ్‌ల్లోనే లావాదేవీలు జ‌ర‌పాల‌ని త‌మ క‌స్ట‌మ‌ర్ల‌ను కోరింది. ఎందుకంటే మాల్‌వేర్ దాడికి గురైన వాటిలో ఎస్‌బీఐ ఎటీఎమ్‌లు లేవ‌ని సంస్థ ముందే ప్ర‌క‌టించింది.

 60 కోట్ల డెబిట్ కార్డులు

60 కోట్ల డెబిట్ కార్డులు

10. దేశ‌వ్యాప్తంగా మొత్తం 60 కోట్ల డెబిట్ కార్డులు వినియోగంలో ఉన్నాయి. అందులో దేశీయంగా రూపొందించిన రూపే కార్డుల సంఖ్య 19 కోట్లు కాగా, మిగిలిన‌వ‌న్నీ వీసా, మాస్ట‌ర్ కార్డు కంపెనీల‌కు చెందిన‌వి.

English summary

మీ కార్డు సుర‌క్షిత‌మేనా? | Is your Bank ATM card is safe

The Finance Ministry has asked various agencies, including the Reserve Bank of India, to submit in 10 days their report on a data breach involving over 3 million debit cards, Press Trust of India reported citing ministry sources
Story first published: Monday, October 24, 2016, 12:12 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X