For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కౌంట్‌మ‌నీని స్వాధీనం చేసుకున్న లెండింగ్‌కార్ట్‌

ఆర్థిక వ్య‌వ‌హారాల‌కు సంబంధించిన స్టార్ట‌ప్ లెండింగ్ కార్ట్, పర్స‌న‌ల్ లోన్స్‌ను ఆన్‌లైన్‌లో అందించే కౌంట్‌మ‌నీ(KountMoney)ని స్వాధీనం చేసుకుంది.వ్య‌వ‌స్థాప‌కుల‌కు మూల‌ధ‌నం స‌మ‌కూర్చుకోవ‌డంలో ఎదుర‌య్య

|

ఆర్థిక వ్య‌వ‌హారాల‌కు సంబంధించిన స్టార్ట‌ప్ లెండింగ్ కార్ట్, పర్స‌న‌ల్ లోన్స్‌ను ఆన్‌లైన్‌లో అందించే కౌంట్‌మ‌నీ(KountMoney)ని స్వాధీనం చేసుకుంది. రుణ గ్ర‌హీత‌ల‌కు సులువుగా రుణాలందించేందుకు వీలుగా దీప‌క్‌, గౌర‌వ్‌, అభిషేక్‌, అభి రంజ‌న్‌లు కౌంట్‌మ‌నీని ప్రారంభించారు. లెండింగ్ కార్ట్ చేతికి ఈ సంస్థ రావ‌డంతో సంస్థ సాంకేతిత‌లు, విశ్లేష‌ణ సామ‌ర్థ్యాలు మ‌రింత‌గా మెరుగుప‌డ‌తాయి. అంతేకాకుండా వినియోగదారు అవ‌స‌రాల‌కు త‌గ్గ‌ట్లుగా రుణాలందించేందుకు మ‌రింత విస్తృతంగా సేవ‌లందిందంచ‌డానికి వీలు క‌లుగుతుంద‌ని లెండింగ్‌కార్ట్ కంపెనీ తెలిపింది.

lendingkart

కౌంట్‌మ‌నీ 2015 అక్టోబ‌ర్‌లో ప్రారంభ‌మై ఆన్‌లైన్ ద్వారా రుణాల‌ను అంద‌జేస్తోంది. వ్య‌క్తిగ‌త రుణాలు, బంగారు రుణాలు, గృహ రుణాలు, విద్యా రుణాలు మొద‌లైన‌వి దీని ద్వారా పొందవ‌చ్చు.
వ్య‌వ‌స్థాప‌కుల‌కు మూల‌ధ‌నం స‌మ‌కూర్చుకోవ‌డంలో ఎదుర‌య్యే ఇబ్బందుల‌ను తీర్చేందుకు లెండింగ్ కార్ట్‌ను స్థాపించారు. ఈ సంస్థ అందించే ఆన్‌లైన్ రుణానికి ద‌ర‌ఖాస్తు ప్రక్రియ కేవ‌లం 15 నిమిషాలే. ఈ సంస్థ‌తో ఒప్పందం కుదుర్చుకున్న ఎన్‌బీఎఫ్‌సీలు 3 రోజుల్లోగా రుణం జారీచేసేందుకు ప్ర‌య‌త్నిస్తాయి.

English summary

కౌంట్‌మ‌నీని స్వాధీనం చేసుకున్న లెండింగ్‌కార్ట్‌ | Lendingkart acquires KountMoney

Fintech startup Lendingkart has acquired KountMoney, an online lending marketplace for personal loans.
Story first published: Tuesday, October 18, 2016, 14:24 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X