For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఎఫ్‌డీల కంటే ఉత్త‌మ రాబ‌డులు కావాలా? అయితే వీటిని ప‌రిశీలించండి

|

క్ర‌మ‌మైన ఆదాయం కోసం చూసే వారికి బ్యాంకు డిపాజిట్లు మొద‌టి మార్గంగా క‌న‌బ‌డ‌తాయి. ర‌క్ష‌ణ ఎక్కువ‌గా ఉండ‌ట‌మే కాకుండా క‌చ్చిత‌మైన ఆదాయం రావ‌డమే ఇందుకు కార‌ణం. మరి ఆదాయ‌పు పన్ను మాటేమిటి? బ‌్యాంకు డిపాజిట్ల విష‌యానికొస్తే అక్క‌డ వ‌చ్చే వడ్డీని సైతం పెట్టుబ‌డిదారు ఆదాయంలో క‌లిపి చూస్తారు. త‌ర్వాత వారి వారి ట్యాక్స్‌ శ్లాబును బ‌ట్టి పన్ను వ‌ర్తింప‌జేస్తారు. ప్ర‌స్తుతం ఆర్‌బీఐ వ‌డ్డీ రేట్లు(రెపో రేటు) త‌గ్గించ‌డంతో ఆ విధంగా కూడా డిపాజిట్ల వ‌డ్డీ రేట్లు త‌గ్గే అవ‌కాశం ఉంది.
ఒక ప‌క్క త‌క్కువ వ‌డ్డీ రేట్లు, మ‌రో వైపు ప‌న్ను వ‌ర్తింపుల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుని ఆర్థిక ప్ర‌ణాళిక నిపుణులు సిస్ట‌మ్యాటిక్ విత్‌డ్రాయ‌ల్ ప్లాన్స్‌(ఎస్‌డ‌బ్ల్యూపీ)ను సూచిస్తున్నారు. వీటి ద్వారా ఎక్కువ ప‌న్ను బ్రాకెట్లో ఉన్న‌వారు ప‌న్ను మిన‌హాయింపులు పొంద‌డంతో పాటు క్ర‌మ‌మైన ఆదాయం పొంద‌వ‌చ్చు.
డెట్ ఫండ్స్‌ను తొంద‌ర‌గా న‌గ‌దు రూపంలోకి మార్చుకునే వీలుంటుంది. 2018లోపు మ‌రో 100 నుంచి 150 పాయింట్ల మేర వ‌డ్డీ రేట్లు త‌గ్గుతాయ‌ని భావిస్తున్న త‌రుణంలో డెట్ మార్కెట్లు బాగా ప‌నిచేస్తాయ‌ని అవుట్‌లుక్ ఏసియా క్యాపిట‌ల్ ఛీప్ ఎగ్జిక్యూటివ్ మ‌నోజ్ నాగ్‌పాల్ అభిప్రాయ‌ప‌డ్డారు. వ‌డ్డీ రేట్లు త‌గ్గుతున్న‌ప్పుడు డెట్ మార్కెట్లు బాగా రాణిస్తాయి.

mutual funds vs fixed deposits

ప్ర‌పంచ వ్యాప్తంగా వృద్ది త‌గ్గుముఖం ప‌ట్ట‌డంతో పాటు, ద్ర‌వ్యోల్బ‌ణం నియంత్ర‌ణ‌లోకి రావ‌డంతో అంత‌ర్జాతీయంగా డెట్ మార్కెట్లు మంద‌కొడిగా పనిచేశాయి. దీంతో వ‌డ్డీ రేట్లు త‌గ్గుతున్నాయి. దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ ఒక ప‌క్క బ‌లంగా ఉండ‌టంతో భార‌త్‌లో వ‌డ్డీ రేట్లు త‌క్కువ ఉన్నాయి. వీట‌న్నింటిని ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంటే వ‌చ్చే మూడు నుంచి ఐదేళ్ల కాలంలో వ‌డ్డీ రేట్లు మ్యూచువ‌ల్ ఫండ్ రాబ‌డుల కంటే ఎక్కువ రాబ‌డినివ్వ‌మ‌నే అంచ‌నా ఉంది.

సిస్ట‌మ్యాటిక్ విత్‌డ్రాయ‌ల్ ప్లాన్ అంటే
నిర్ణీత స‌మ‌యాల్లో మొత్తం పెట్టుబ‌డి నుంచి కొంచెం కొంచెం డ‌బ్బును వెన‌క్కు తీసుకునే స‌దుపాయం సిస్ట‌మ్యాటిక్ విత్‌డ్రాయ‌ల్ ప్లాన్‌లో ఉంటుంది. క్ర‌మానుగ‌తంగా ఆదాయం కావాల‌నుకునే వారికి ఇవి బాగా న‌ప్పుతాయి. సిస్ట‌మ్యాటిక్ విత్‌డ్రాయ‌ల్ ప్లాన్స్‌లోంచి రెండు ర‌కాలుగా డ‌బ్బు వెన‌క్కు తీసుకోవ‌చ్చు. మొద‌టి మార్గంలో క్ర‌మానుగ‌త స‌మ‌యాల్లో అంటే నెల‌వారీ, త్రైమాసికానికి ఒక‌సారి కొంత మొత్తాన్ని వెన‌క్కు తీసుకోవ‌చ్చు. ఒక నిర్ణీత మొత్తం కాకుండా మ‌న‌కు న‌చ్చినంత డ‌బ్బును ఉన్న‌దాంట్లోంచి వెన‌క్కు తీసుకోవ‌చ్చు.

ఎఫ్‌డీల కంటే సిస్ట‌మ్యాటిక్ విత్‌డ్రాయ‌ల్ ప్లాన్స్ ఏ విధంగా ఉత్త‌మం?
డెట్ ఫండ్ల‌లో పెట్టే డ‌బ్బులు, పెట్టుబ‌డి విలువ మూడేళ్ల కంటే ఎక్కువ ఉంటేనే ఉత్త‌మ రాబ‌డుల‌ను ఆశించ‌వ‌చ్చు. అప్పుడే వాటిని దీర్ఘ‌కాలిక పెట్టుబ‌డులుగా ప‌రిగ‌ణించ‌వ‌చ్చు. ప్ర‌స్తుతం డెట్ ఫండ్ల‌పై దీర్ఘ‌కాలిక మూల‌ధ‌న రాబ‌డి ప‌న్ను 20 శాతం ఉంది. అయితే మీ పెట్టుబ‌డికి ఇండెక్సేష‌న్ బెనిఫిట్ ఉంటుంది. అంటే మీరు పెట్టిన మొత్తాన్ని ద్ర‌వ్యోల్బ‌ణంతో ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుని విలువ లెక్కించి అప్పుడు ప‌న్ను వ‌ర్తింప‌జేస్తారు. ద్ర‌వ్యోల్బ‌ణాన్ని లెక్క‌లోకి తీసుకుని మీ పెట్టుబ‌డి విలువ‌ను లెక్కించ‌డం మూలంగా దీర్ఘ‌కాలిక మూల‌ధ‌న రాబ‌డి ప‌న్ను(లాంగ్ ట‌ర్మ్ క్యాపిట‌ల్ గెయిన్ ట్యాక్స్) చాలా త‌క్కువ‌గానే పడుతుంది.
అయితే మూడేళ్ల‌కు ముందుగానే డెట్ ఫండ్ల‌ను రిడీమ్‌(విత్‌డ్రా) చేస్తే ఆదాయ‌పు ప‌న్ను శ్లాబ్ ఆధారంగా స్వ‌ల్ప‌కాలిక రాబడి ప‌న్నును వ‌ర్తింప‌జేస్తారు. ఒక వేళ మూడేళ్ల‌కు ముందుగానే మీరు తీయాల్సి వ‌చ్చింద‌ని అనుకుందాం. ఆ విధంగా చూసినా ఎఫ్‌డీల‌తో పోలిస్తే ప‌న్ను విష‌యంలో డెట్ ఫండ్ల‌లో సిస్ట‌మ్యాటిక్ ఇన్వెస్ట్‌మెంట్, విత్‌డ్రాయ‌ల్‌ ప్లాన్‌లే ఉత్త‌మం.
ప్రస్తుతం రిటైల్ ఇన్వెస్ట‌ర్ల‌లో చిన్న స్థాయి మదుప‌ర్ల నుంచే కాకుండా అధిక నిక‌ర ఆస్తి విలువ(హెచ్ఎన్ఐ) విలువ క‌లిగిన వారి నుంచి కూడా సిస్ట‌మ్యాటిక్ విత్‌డ్రాయ‌ల్ ప్లాన్ల‌కు మంచి స్పంద‌నే వ‌స్తోంది.

ఎఫ్‌డీ చేసేవారు ఇది చ‌ద‌వండిఎఫ్‌డీ చేసేవారు ఇది చ‌ద‌వండి

ఉదాహ‌ర‌ణ‌కు ఒక వ్య‌క్తి 20 శాతం ట్యాక్స్ బ్రాకెట్‌లో ఉన్నార‌నుకుందాం. అత‌ని వ‌ద్ద రూ. 20 ల‌క్ష‌లు ఉంది దాన్ని పెట్టుబ‌డి పెట్టాల్సి ఉంది. కానీ అత‌నికి క్ర‌మ‌మైన ఆదాయం(రెగ్యుల‌ర్ ఇన్‌క‌మ్‌) కావాలి. ఇప్పుడు ఫిక్స్‌డ్ డిపాజిట్ల‌ను, 10 శాతం రాబ‌డి వ‌చ్చే డెట్ ఫండ్ల‌ను పోల్చి చూద్దాం. ఫిక్స్‌డ్ డిపాజిట్ల‌లో వ‌చ్చే రూ.2 ల‌క్ష‌ల వ‌డ్డీపై ప‌న్ను రూపంలో రూ. 41,200 క‌ట్టాల్సి ఉంటుంది. అదే డెట్ మ్యూచువ‌ల్ ఫండ్ల విష‌యంలో ఫండ్ హౌస్ నుంచి సిస్ట‌మ్యాటిక్ విత్‌డ్రాయ‌ల్ ప్లాన్‌ను బ‌ట్టి రూ. 2 లక్ష‌ల‌ను అందుకుంటాడు. ఒక ఏడాదిలో ఎన్ఏవీ రూ. 10 నుంచి రూ. 11కు పెరిగంద‌నుకుందాం. కాబట్టి ఫండ్ హౌస్ రూ. 2 లక్ష‌ల‌ను చెల్లించేందుకు 18,182 యూనిట్ల‌ను ఉప‌యోగించుకుంటుంది. అంటే అన్ని యూనిట్లు మీకు త‌గ్గుతాయి. ఇప్పుడు ఒక్కో యూనిట్ రూ. 10 చొప్పున మొత్తం ఆ యూనిట్ల విలువ రూ. 181820.ఇది మీ కొనుగోలు(పెట్టుబ‌డి) విలువ‌. అంటే మీకు క్యాపిట‌ల్ గెయిన్స్(మూల‌ధ‌న రాబ‌డి) కొంచెం డ‌బ్బుకే వ‌ర్తిస్తుంది. రూ. 18,000(2,00,00- 1,82,00) ఈ మొత్తానికి మూల‌ధ‌న రాబ‌డి ప‌న్ను క‌ట్టాలి. పెట్టుబ‌డిదారు 3700 వ‌ర‌కూ ప‌న్నును సిస్ట‌మ్యాటిక్ విత్‌డ్రాయ‌ల్ ప్లాన్ విష‌యంలో చెల్లిస్తే; ఎఫ్‌డీల విష‌యంలో అది రూ. 41,200గా ఉంది. అయితే ఇది మూడేళ్ల పాటు మొత్తాన్ని ఒకేసారి విత్‌డ్రా చేయ‌ని వాళ్ల‌కు వ‌ర్తిస్తుంది.

English summary

ఎఫ్‌డీల కంటే ఉత్త‌మ రాబ‌డులు కావాలా? అయితే వీటిని ప‌రిశీలించండి | Which is better among mutual funds and fixed deposits

Bank deposits have been one of the most popular investment options when it comes to earning a regular income. Besides the safety factor, guaranteed income is one of the big pluses why investors opt for bank deposits.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X