For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఉద్యోగాల‌కు గుదిబండ కానున్న ఆటోమేష‌న్

|

ఆటోమేషన్ కారణంగా భారతదేశంలో భారీ ఎత్తున ఉద్యోగాలు కోల్పోనున్నట్టు ప్రపంచబ్యాంక్ హెచ్చరిస్తోంది. దాదాపు 69శాతం ఉద్యోగాల‌కు ఆటోమేష‌న్ కోతపెడుతుందని వ‌ర‌ల్డ్ బ్యాంకు అబిప్రాయ‌ప‌డింది. అభివృద్ధి చెందుతున్న దేశాలలో టెక్నాలజీ సంప్రదాయ ఆర్థిక మార్గం నమూనాకు విఘాతం కలిగిస్తుందని ప్రపంచ బ్యాంకు పరిశోధనలో తేలింది. ఇక్క‌డ సంప్ర‌దాయ ఆర్థిక మార్గం అంటే ఇండియాలో చాలా ప‌నులు మ్యాన్యువ‌ల్‌గా జ‌రుగుతాయి. అవ‌న్నీ ఆటోమేష‌న్ వ‌ల్ల మ‌నుషులు చేసే అవ‌స‌రం లేకుండా ఆటోమేటిక్ జ‌రుగుతుఊ ఉంటాయి. అలాగే చైనా, ఇథియోపియా దేశాల్లో 77శాతం ఉద్యోగాలు నష్టపోనున్నాయని అంచనా వేసింది. మొత్తానికి ఆటోమేషన్ ప్రభావంతో 85 శాతం ఉద్యోగాలు ప్రమాదంలో పడ్డాయని స్పష్టం చేసింది.

jobs loss because of automation

తీవ్రమైన పేదరికం పై కిమ్ బ్రూకింగ్స్ సంస్థ‌లో మంగళవారం జరిగిన చర్చ సందర్భంగా ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు జిమ్ కిమ్ ఈ త‌ర‌హా వ్యాఖ్యలు చేశారు. సాంకేతికత మూలంగా ప్రపంచంలో ఎన్నో మార్పులు వచ్చినప్పటికీ దాని ప్రభావాలను అంచనా వేస్తున్నామ‌ని చెప్పారు. అభివృద్ధిని ప్రోత్సహించడానికి గాను తమ పెట్టుబడుల ప్రోత్సాహం కొనసాగుతుందన్న ఆయన దేశాల భవిష్యత్ ఆర్థిక వ్యవస్థకు అవసరమైన వివిధ రకాల మౌలిక సౌక‌ర్యాల‌ గురించి సైతం ఆలోచిస్తున్నామన్నారు. కానీ అభివృద్ధి చెందుతున్న దేశాల్లో పారిశ్రామికీకరణ పూర్తిస్థాయిలో సాధ్యం కాకపోవచ్చని అన్నారు. సంప్రదాయ ఆర్థికవ్యవస్థ వృద్ధికి వ్య‌య‌సాయంలో ఉత్పాద‌క‌ను పెంచడం ఒక మంచి మార్గంగా ఉప‌క‌రించ‌గ‌ల‌ద‌ని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.

యాంత్రీకరణ, సాంకేతిక‌త‌ కారణంగా సంప్రదాయ పారిశ్రామిక ఉత్పత్తి దెబ్బతిందనీ, మ‌నుషులు నేరుగా చేసేఉద్యోగాలు నష్టపోతున్నామనీ, ఈ ధోరణి అమెరికాకు పరిమితం కాదనీ, ప్రపంచ దేశాల్లో ప్రతిచోటా ప్రజలు దీనికి ప్రభావితమవుతున్నారని కిమ్ ఆందోళ‌న వ్య‌క్తప‌రిచారు. దీనిపై చైనాలో జరిగిన జీ 20 సమావేశంలో ప్రపంచ నాయకులందరూ ఆందోళన వ్యక్తం చేశారని తెలిపారు. అయితే ఉమ్మడి వాణిజ్యం ద్వారా ఆర్థిక వ్యవస్థ వృద్దికోసం ప్రపంచ దేశాల సమిష్టి కృషితో కొంత పురోగతి సాధించిన ప్పటికీ తీవ్రమైన ఎదురుగాలి తప్పడం లేదని కిమ్ వ్యాఖ్యానించారు. సరుకుల ధరల క్షీణత ప్రపంచ వాణిజ్యంలో మందగింపు కారణమవుతోందన్నారు. ఇది చారిత్రాత్మక స్థాయిలో ఉందని కిమ్ పేర్కొన్నారు.

Read more about: jobs automation
English summary

ఉద్యోగాల‌కు గుదిబండ కానున్న ఆటోమేష‌న్ | Automation threatens 69% jobs in India World Bank

Automation threatens 69 per cent of the jobs in India, while 77 per cent in China, according to a World Bank research which has said that technology could fundamentally disrupt the pattern of traditional economic path in developing countries.
Story first published: Wednesday, October 5, 2016, 16:10 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X