For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

స్వ‌చ్చంద ఆదాయ వెల్ల‌డి ప‌థ‌కం కింద రూ. 65,250 కోట్లు

|

2016లో కేంద్రం ప్ర‌క‌టించిన స్వ‌చ్చంద ఆదాయ వెల్ల‌డి ప‌థ‌కం(ఐడీఎస్‌) కింద రూ.65,250 కోట్ల విలువైన నల్ల‌ధ‌నం వెలుగులోకి వచ్చింది. ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ పథకం గడువు సెప్టెంబర్ 30తో ముగియడంతో కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ శనివారం సమావేశం ఏర్పాటుచేసి నల్లధన వివరాలను ప్రకటించారు. గత రెండేళ్ల పాలనలో పన్ను ఎగవేతలను నిరోధించేందుకు ప్రభుత్వం ఎన్నో చ‌ర్య‌ల‌ను తీసుకుంద‌ని జైట్లీ వివ‌రించారు.

Under IDS 65,250 crores black money exposed

మొత్తం 64,275 మంది నుంచి రూ.65,250 కోట్లు సేకరించినట్టు వెల్లడించారు. రూ.8,000 కోట్లను హెచ్ఎస్‌బీసీ బ్యాంకు ఖాతాల‌ జాబితా ద్వారా గుర్తించినట్టు చెప్పారు. ఆదాయ పన్ను లెక్కల్లో చూపకుండా పోగేసిన అక్రమాస్తుల వివరాలను స్వచ్ఛందంగా వెల్లడించాలని ఆదాయపు వెల్లడి పథకాన్ని ప్రభుత్వం తీసుకొచ్చింది. స్వచ్ఛందంగా ఆస్తుల వివరాలను వెల్లడించి చట్టపరమైన చర్యల నుంచి బయటపడేందుకు అవకాశం కల్పించింది. ఒకవేళ ఈ పథకం కింద కూడా లెక్కల్లో ఆస్తులను చూపకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం పలుమార్లు హెచ్చరించింది. అయిన‌ప్ప‌టికీ చాలా మంది న‌ల్ల కుబేరులు వివ‌రాల‌ను వెల్ల‌డించ‌లేదు. ఈ నేప‌థ్యంలో ప్ర‌భుత్వం వీరంద‌రిపై ఎటువంటి చ‌ర్య‌లు తీసుకుంటుందో వేచి చూడాలి.

Read more about: ids black money
English summary

స్వ‌చ్చంద ఆదాయ వెల్ల‌డి ప‌థ‌కం కింద రూ. 65,250 కోట్లు | Under IDS 65,250 crores black money exposed

till evening of Friday, Hyderabad emerged as a top destination with declaration of Rs 13,000 crore, followed by Mumbai (Rs 8,500 crore), New Delhi (Rs 6,000 crore) and Kolkata (Rs 4,000 crore).
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X