For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

స్పెక్ట్రం మెగావేలం ప్రారంభం

|

దేశంలోనే అతిపెద్ద స్పెక్ట్రం వేలం ప్రారంభ‌మైంది. ప్ర‌ముఖ టెలికాం ఆప‌రేట‌ర్ల‌న్నీ బిడ్డింగ్ ప్రారంభించాయి. దీని ద్వారా ప్ర‌భుత్వానికి రూ. 5.63 ల‌క్ష‌ల కోట్ల ఆదాయం సంక్ర‌మించ‌నుంద‌ని అంచ‌నా. ఈ వేలంలో పాల్గొనేందుకు రిల‌య‌న్స్ జియో, వోడాఫోన్‌, ఐడియా సెల్యూలార్‌, భార‌తి ఎయిర్‌టెల్‌, టాటా టెలి స‌ర్వీసెస్‌, రిల‌యన్స్ క‌మ్యూనికేష‌న్స్ అర్హ‌త సాధించాయి. ఈ రోజు వేలం 10 గంట‌ల‌కు ప్రారంభ‌మైంది. రేప‌టి నుంచి రోజూ ఉద‌యం 9 గంట‌ల నుంచి సాయంత్రం 7 గంట‌ల వ‌ర‌కూ వేలం జ‌రుగుతుంది. 700, 800, 900, 1800, 2100, 2300, 2500 మెగామెర్జ్జ్ బ్యాండ్ల‌లో ఫ్రీక్వెన్సీని విక్ర‌యించ‌నున్నారు. మొత్తం 2354 మెగాహెర్జ్జ్ వేలానికి సిద్దంగా ఉంది. ఈ రేడియో త‌రంగాల‌ను(ఫ్రీక్వెన్సీని) 2జీ, 3జీ, 4జీ మొబైల్ సేవ‌ల‌కు ఉప‌యోగించుకోవ‌చ్చు. ఏ రోజుకారోజు బిడ్డింగ్ ఫ‌లితాల‌ను టెలికాం శాఖ ప్ర‌క‌టిస్తుంది.

telecom spectrum auction

ఐడియా ఇప్ప‌టికే 10 టెలికాం స‌ర్కిల్స్‌లో 4జీ స్పెక్ట్ర‌మ్‌ను క‌లిగి ఉంది. వోడాఫోన్ 9 స‌ర్కిల్స్‌లో 4జీ స్పెక్ట్ర‌మ్‌ను క‌లిగి ఉంది. వోడాఫోన్ నూత‌న స్పెక్ట్ర‌మ్ కొనుగోలు కోసం రూ. 47 వేల కోట్ల‌ను సిద్దంగా ఉంచింది. మొత్తం దేశ‌వ్యాప్తంగా ఉన్న అన్ని స‌ర్కిల్స్‌లో బిడ్డింగ్‌లో పాల్గొనేందుకు జియోకు మాత్ర‌మే అర్హ‌త ఉంది.

Read more about: spectrum telecom
English summary

స్పెక్ట్రం మెగావేలం ప్రారంభం | spectrum auction from October 1

Telecom operators have started bidding for airwaves in the country’s largest spectrum auction in which airwaves worth Rs. 5.63 lakh crore have been put up for sale.
Story first published: Saturday, October 1, 2016, 14:22 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X