For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బ్ర‌హ్మ‌పుత్ర‌కు ఇబ్బందులు సృష్టించేందుకు సిద్ద‌మైన చైనా

|

ఒక ప‌క్క సింధు న‌ది ఒప్పందంపై పాకిస్థాన్‌తో తాడోపేడీ తేల్చుకునేందుకు భార‌త్ సిద్ధ‌మైన వేళ చైనా ప‌క్క‌లో బల్లెంలా త‌యారైంది. బ్ర‌హ్మ‌పుత్ర ఉప‌న‌దుల్లో ఒక‌దాన్ని చైనా బ్లాక్ చేసింది. దానిపైన ఒక ఖ‌రీదైన జ‌ల‌విద్యుత్ ప్రాజెక్టును నిర్మించ త‌ల‌పెట్ట‌డంలో భాగంగా ఆ దేశం ఇలా చేస్తోంది. దీంతో దిగువ‌భాగాన ఉన్న దేశాల్లో ఒక‌టైన మ‌న‌కు నీళ్లు రావ‌డం క‌ష్ట‌మ‌వుతుంది. ఈ ప్రాజెక్టు పూర్త‌యితే దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ‌పై పెను ప్ర‌భావమే ప‌డ‌నుంది. చైనాలో క్షియాజిగా పిల‌వ‌బ‌డే ఈ న‌ది సిక్కింలోకి ప్ర‌వ‌హించ‌గానే షిగ‌స్తెగా మారుతోంది. అక్క‌డ నుంచి అరుణాచ‌ల్ ప్ర‌దేశ్ బ్ర‌హ్మ‌పుత్ర‌లోకి ప్ర‌వాహం వెళుతుంది.

china project on bramhaputra tributary

టిబెట్‌లో బ్ర‌హ్మ‌పుత్ర ఉప‌న‌ది అయిన షిబుకు( Xiabuqu) ఉప‌న‌దిపై 740 మిలియ‌న్ డాల‌ర్ల‌తో లాల్హో పేరుతో చైనా ఈ ప్రాజెక్టును నిర్మించత‌ల‌పెట్టింది. ప్రాజెక్టు అడ్మిస్ట్రేష‌న్ బ్యూరో అధిప‌తి చైనా దేశ అధికార న్యూస్ ఏజెన్సీతో ఈ విష‌యాన్ని వెల్ల‌డించారు.2014లో నిర్మాణం ప్రారంభ‌మైన ఈ బృహ‌త్త‌ర ప్రాజెక్టు 2019తో పూర్తికానుంది. చైనా చేసే ఈ ప‌నుల వ‌ల్ల కింద‌నున్న భార‌త్‌, బంగ్లాదేశ్‌లు ఇబ్బందులు ఎదుర్కొంటాయా లేదా అనే విష‌యంపై ఇంకా స్ప‌ష్ట‌త రాలేదు.

చైనా 12వ ఆర్థిక ప్ర‌ణాళిక‌లో భాగంగా 3 అతిపెద్ద హైడ్రోప్రాజెక్టుల‌ను బ్ర‌హ్మ‌పుత్ర న‌దిపై నిర్మించాల‌నుకుంటున్నారు. సాధార‌ణంగా నీటి పంప‌కాల‌పై దేశాల మ‌ధ్య ఎలాంటి ఒప్పందాలు లేనందున 2013లో అక్టోబ‌ర్‌లో నిపుణుల క‌మిటీని(ఎక్స్‌ప‌ర్ట్ లెవ‌ల్ మెకానిజం) ఏర్ప‌రుచుకున్నారు. ఇది రెండు దేశాల మ‌ధ్య న‌దుల నీటి పంప‌కం గురించి జ‌రిగింది. అయితే చైనా వాద‌న మ‌రోలా ఉంది. భార‌త్ అభ్యంత‌రాల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకున్న త‌ర్వాతే తాము ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్న‌ట్లు చెబుతోంది. తాము నీటిని ఒడిసిప‌ట్టేందుకు ఈ ప్రాజెక్టుల‌ను నిర్మించ‌డం లేద‌ని వివ‌ర‌ణ ఇస్తోంది.

English summary

బ్ర‌హ్మ‌పుత్ర‌కు ఇబ్బందులు సృష్టించేందుకు సిద్ద‌మైన చైనా | China blocks Brahmaputra tributary

As India mulls scrapping Indus Waters Treaty to make Pakistan feel the pinch of its terror policy, China has blocked a tributary of the Brahmaputra river in Tibet as part of its "most expensive" hydro project which could cause concern in India as it may impact water flows into the lower riparian countries
Story first published: Saturday, October 1, 2016, 15:35 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X