For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అక్టోబ‌ర్‌కు ఉత్త‌మ‌ ఫిక్స్‌డ్ డిపాజిట్ రేట్లు అందించే కంపెనీలు

|

మానిట‌రీ పాల‌సీ క‌మిటీ అక్టోబ‌ర్ 4న స‌మావేశ‌మై వ‌డ్డీ రేట్ల‌పై నిర్ణ‌యం తీసుకుంటుంది. అప్పుడు వ‌డ్డీ రేట్ల కోత‌పై నిర్ణ‌యం తీసుకుంటే ఎఫ్‌డీ వడ్డీ రేట్లు వ‌చ్చే 2,3 వారాల్లో త‌గ్గే ఆస్కారం ఉంది. అందుకే పెట్టుబ‌డిదారుల‌కు వ‌డ్డీ రేట్లు మార‌క‌ముందే ఎఫ్‌డీలను ఎంచుకోవాల‌ని సూచిస్తున్నాం. అక్టోబ‌ర్ నెల‌కు ఉత్త‌మ డిపాజిట్ రేట్లు అందించే కొన్ని సంస్థ‌ల‌ను చూద్దాం.

బ‌జాజ్ ఫిన్ స‌ర్వ్‌

బ‌జాజ్ ఫిన్ స‌ర్వ్‌

24-60 నెల‌ల డిపాజిట్ల‌కు బ‌జాజ్ ఫిన్‌స‌ర్వ్ 8.45% వ‌డ్డీ రేటును ఇస్తోంది. బ్యాంకులు అందించే వ‌డ్డీ రేటు కంటే ఇది దాదాపు 1 శాతం ఎక్కువ‌గా ఉంటుంది. క్రిసిల్ ఈ డిపాజిట్ల‌కు FAAA(స్టేబుల్) రేటింగ్ ఇవ్వ‌గా, ఇక్రా MAAA(స్టేబుల్) రేటింగ్ ఇచ్చింది. ఈ రేటింగ్ ఇచ్చారంటే సుర‌క్షిత‌మైన డిపాజిట్ల‌ని అర్థం. బ‌జాజ్ గ్రూప్ నుంచి వ‌చ్చినందున ఈ సంస్థ నుంచి భ‌ద్ర‌త‌ను ఆశించ‌వ‌చ్చు.

కేటీడీఎఫ్‌సీ

కేటీడీఎఫ్‌సీ

ఈ డిపాజిట్ల‌కు కేర‌ళ ప్ర‌భుత్వ హామీ ఉంటుంది. ఎందుకంటే కేటీడీఎఫ్‌సీ కేర‌ళ ప్ర‌భుత్వ రంగ సంస్థ‌. అందుకే వ‌డ్డీ,అస‌లు చెల్లించ‌డంలో విఫ‌లం అవ్వ‌క‌పోవ‌చ్చు. 1, 2, 3 ఏళ్ల డిపాజిట్ల‌కు వ‌డ్డీ రేట్లు 8.50 శాతంగా ఉన్నాయి. ఇవి ప్ర‌స్తుతం మంచి వ‌డ్డీ రేట్ల‌ను చెప్పాలి. 5-ఏళ్ల డిపాజిట్ల‌కు 10.25 శాతంగా రాబ‌డి ఉండ‌గ‌ల‌దు. సీనియ‌ర్ సిటిజ‌న్ డిపాజిట్ల‌కు అద‌నంగా 0.25 శాతం వ‌డ్డీ రేటును ఆఫ‌ర్ చేస్తున్నారు.

మ‌హీంద్రా ఫైనాన్స్‌

మ‌హీంద్రా ఫైనాన్స్‌

అన్ని ర‌కాల కాల‌ప‌రిమితి డిపాజిట్ల‌కు మ‌హీంద్రా ఫైనాన్స్ 8.45% వడ్డీ రేటును ఆఫ‌ర్ చేస్తోంది. 5-ఏళ్ల కాలంలో ఫిక్స్‌డ్ డిపాజిట్ మొత్తంపై 10 శాతం రాబ‌డి వ‌స్తుంద‌ని అంచ‌నా. సీనియ‌ర్ సిటిజ‌న్స్ చేసే డిపాజిట్ల‌కు అద‌నంగా మ‌రో 0.25% వ‌డ్డీ ఇస్తారు. ఈ కంపెనీ డిపాజిట్లు సుర‌క్షిత‌మైన‌వి ఎందుకంటే క్రిసిల్ FAAA(స్టేబుల్) రేటింగ్ ఇచ్చింది.

బంధ‌న్ బ్యాంకు

బంధ‌న్ బ్యాంకు

బ్యాంకు డిపాజిట్ల‌లో మ‌దుపు చేయాల‌నుకునే వారికి బంధ‌న్ బ్యాంకు డిపాజిట్ ఆక‌ర్ష‌ణీయంగా ఉంటుంది. 366-400 రోజుల కాల‌ప‌రిమితి డిపాజిట్‌కు 8.25శాతం వ‌డ్డీ రేటు వ‌స్తుంది. దేశంలో ఇత‌ర బ్యాంకులు అందించే వ‌డ్డీ రేటు కంటే ఇది 0.75% ఎక్కువ‌. ముఖ్యంగా ప్ర‌భుత్వ రంగ బ్యాంకుల ఇచ్చే దాని కంటే ఈ వ‌డ్డీ రేటు ఎక్కువ‌.

మీకు స‌మీపంలో ఈ బ్యాంకు బ్రాంచీ లేక‌పోతే ఆన్‌లైన్ ఎఫ్‌డీ సైతం చేయ‌వ‌చ్చు.

శ్రీ‌రామ్ ట్రాన్స్‌పోర్ట్‌

శ్రీ‌రామ్ ట్రాన్స్‌పోర్ట్‌

48 నెల‌ల నుంచి 60 నెల‌ల ఫిక్స్‌డ్ డిపాజిట్ల‌పై శ్రీ‌రామ్ ట్రాన్స్‌పోర్ట్ 8.42 శాతం వ‌డ్డీ రేటును ఇస్తోంది. 24,36 నెల‌ల కాలానికి ఉండే క్యుములేటివ్ డిపాజిట్ల‌పై 8.19% వ‌డ్డీ ఇవ్వ‌జూపుతున్నారు.

వ‌డ్డీ ఆదాయం రూ. 5 వేల‌కు మించితే, కంపెనీ డిపాజిట్ల‌కు టీడీఎస్ అమ‌ల‌వుతుంద‌ని గుర్తుంచుకోండి. ఆర్‌బీఐ డిపాజిట్ల కోత‌కు మొగ్గుచూపుతుంద‌ని భావిస్తున్న త‌రుణంలో ఈ డిపాజిట్లు ఎంచుకోవాల్సిందిగా సూచిస్తున్నాం.

డీహెచ్ఎఫ్ఎల్ ఫిక్స్‌డ్ డిపాజిట్లు

డీహెచ్ఎఫ్ఎల్ ఫిక్స్‌డ్ డిపాజిట్లు

ఈ కంపెనీ వ‌డ్డీ రేటు చాలా వాటి కంటే ఉత్త‌మంగా ఉంది. 40 నెల‌ల డిపాజిట్‌పై 8.65% వ‌డ్డీ రేటు ఉండ‌గా, 48-120 నెల‌ల డిపాజిట్ల‌కు సైతం అదే వ‌డ్డీ రేటు ఇచ్చే అవ‌కాశం ఉంది. ఈ డిపాజిట్ల‌కు ఏఏఏ రేటింగ్ ఉండ‌టం మూలంగా సుర‌క్షిత‌మైన‌వ‌నే చెప్ప‌వ‌చ్చు.

ఆర్‌బీఎల్ బ్యాంకు

ఆర్‌బీఎల్ బ్యాంకు

ఈ బ్యాంకు ఇటీవ‌లే ప‌బ్లిక్ ఇష్యూకు వ‌చ్చింది. ఈ బ్యాంకు 24-36 నెల‌ల డిపాజిట్ల‌కు 8.25% వ‌డ్డీ ఇస్తోంది.

డిస్‌క్లెయిమ‌ర్‌:

డిస్‌క్లెయిమ‌ర్‌:

కంపెనీ డిపాజిట్లు రిస్క్ ఉండే పెట్టుబ‌డులు. రాబ‌డుల‌కు ముందుగానే హామీ ఇవ్వ‌లేం. వృత్తి నిపుణుల స‌ల‌హా తీసుకుని పెట్టుబ‌డి పెట్టాల్సిందిగా సూచించ‌డ‌మైన‌ది.

ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసే వారు ఇవి చ‌ద‌వండిఫిక్స్‌డ్ డిపాజిట్ చేసే వారు ఇవి చ‌ద‌వండి

Read more about: fd fixed deposit
English summary

అక్టోబ‌ర్‌కు ఉత్త‌మ‌ ఫిక్స్‌డ్ డిపాజిట్ రేట్లు అందించే కంపెనీలు | best fixed deposits in the october month in India

best fixed deposits in the October month in India
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X