For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రోజువారీ ఖ‌ర్చుల్లోంచి డ‌బ్బు మిగ‌ల్చడం ఎలా?

|

బ‌డ్జెట్ వేసుకుంటే ప్ర‌ణాళిక బ‌ద్దంగా నెల‌వారీ ఖ‌ర్చుల‌పై నియంత్ర‌ణ ఉంటుంది. ప్ర‌తి నెలా అద‌నంగా కొంత మొత్తాన్ని మిగిల్చేందుకు ఆస్కారం ఉంటుంది. ఇక్క‌డ నెల‌కు రూ. 9వేలు లేదా రోజుకు రూ. 300 ఎలా పొదుపు చేయాలో చూద్దాం.

క‌రెంటు బిల్లు

క‌రెంటు బిల్లు

రిఫ్రిజిరేట‌ర్‌ను సూర్య ర‌శ్మి నేరుగా త‌గిలే ప్ర‌దేశంలో ఉంచ‌కండి. దాని చుట్టూ గాలి వెళ్లేంత స్థ‌లం ఉండేలా చూడండి. క్రమంగా ఫిల్ట‌ర్ల‌ను శుభ్ర‌ప‌ర‌చండి. ఏసీ ఆన్ చేసి ఉంచిన‌ప్పుడు తలుపులు, కిటికీలు మూసి ఉంచేలా చూసుకోవాలి. ఏదైనా వ‌స్తువు వాడ‌న‌ప్పుడు దానికి సంబంధించిన స్విచ్ ఆఫ్ చేయండి. ఏసీని 22 కంటే 25 డిగ్రీల ద‌గ్గ‌ర ఉంచ‌డం ద్వారా మీరు 5% విద్యుత్‌ను ఆదా చేయవ‌చ్చు. వాట‌ర్ హీట‌ర్ ఉష్ణోగ్ర‌త‌ను త‌గ్గించ‌డం ద్వారా మీరు 15% విద్యుత్‌ను ఆదా చేయొచ్చు. వీట‌న్నింటి ద్వారా మీ నెల‌వారీ కరెంటు బిల్లు ఆదా అవుతుంది.

ర‌వాణా

ర‌వాణా

మీరు సొంత వాహ‌నం వాడుతున్న‌ట్ల‌యితే వారంలో ఒక‌సారి ప్ర‌జా ర‌వాణాను వాడండి. అది ఇబ్బంద‌యితే కార్ పూలింగ్‌ను ప్ర‌య‌త్నించ‌వ‌చ్చు. గేర్ల‌ను త‌ర‌చూ మార్చ‌వ‌ద్దు. టైర్ ఒత్తిడిని ఆప్టిమమ్‌గా నిర్వ‌హించండి. కార్‌లో ఉన్న దుమ్మును క్లీన్ చేయండి. ఆగిన‌ప్పుడు ఇంజిన్ ఆఫ్ చేయండి. వారానికి రెండు సార్లు ప్ర‌జా ర‌వాణాను వాడ‌టం ద్వారా మీరు నెల‌లో రూ. 800 పొదుపు చేయ‌వ‌చ్చు. ఇంధ‌నాన్ని స‌రిగ్గా పొదుపు చేసి వాడితే నెల‌లో రూ. 500 దాకా ఆదా అవుతుంది.

ఇంట్లో స‌రుకులు

ఇంట్లో స‌రుకులు

సూప‌ర్ మార్కెట్ల‌లో కంటే మార్కెట్ల‌లో కొంచెం ధ‌ర‌లు త‌క్కువ ఉంటాయి. వారానికి ఒక‌సారి ఇలా వెళ్లి పండ్లు, కూర‌గాయ‌లు కొనుక్కొని రావ‌డం వ‌ల్ల 10 నుంచి 12% త‌క్కువ డబ్బుకే అన్ని తెచ్చుకోవ‌చ్చు. ప్యాకేజీ వ‌స్తువులు కొనే కంటే తృణ ధాన్యాలు, ప‌ప్పుల‌ను లూజ్‌గా కొంటే రూ. 7 నుంచి 10 ఒక కేజీ మీద ఆదా చేయ‌వ‌చ్చు. మ‌న ఇంటి ప‌క్క‌న ఉండే స్టోర్ల‌లో స్థానిక వెరైటీలు కొంటే ఒక్కో ఉత్ప‌త్తిపైన రూ. 20 నుంచి 100 వ‌ర‌కూ పొదుప చేయ‌వ‌చ్చు.

ఎంట‌ర్‌టైన్‌మెంట్‌

ఎంట‌ర్‌టైన్‌మెంట్‌

సినిమాల‌ను వీకెండ్‌లో చూసే బ‌దులు వారం మ‌ధ్య‌లో చూసేందుకు ప్ర‌య‌త్నించండి. రెస్టారెంట్ల‌కు వెళ్లే ముందు ఎక్క‌డైనా ఆఫ‌ర్లు ఉన్నాయోమో చూస్తే మంచిది. ఒక్కోసారి బ‌య‌ట తినే కంటే ఆన్‌లైన్‌లో ఆర్డ‌ర్ చేస్తే డిస్కౌంట్లు ఉండొచ్చు. మీకు వీలైతే ఇలా చేసి చూడవ‌చ్చు. సినిమాల‌కు వెళ్లే ముందు ఏదైనా కార్డుపైన టిక్కెట్లు బుక్ చేసుకుంటే రాయితీ ఉందేమో చెక్ చేసుకోండి.

మందులు

మందులు

త‌రుచూ మెడిసిన్లు(మందులు) కొంటూ ఉంటే అపోలో ఫార్మ‌సీ లేదా మెడ్‌ప్ల‌స్ వంటి వాటిలో కొన‌వ‌చ్చు. అక్క‌డ బిల్లుపై రాయితీ వ‌స్తుంది. దీని వ‌ల్ల ఇంకో అనుకూల‌త ఏంటంటే వారిచ్చే లాగిన్ ఐడీ వివ‌రాల ద్వారా మీరు మీ మందుల జాబితాను డౌన్‌లోడ్ చేసుకునే వీలుంటుంది. ట్యాక్స్ ఫైలింగ్ స‌మ‌యంలో సైతం ఇది ఉప‌యోగ‌ప‌డుతుంది.

కొన్ని అద‌న‌పు ఖ‌ర్చులు

కొన్ని అద‌న‌పు ఖ‌ర్చులు

రోజుకు తాగే సిగ‌రెట్ల సంఖ్య‌ను త‌గ్గించండి. వీలైతే పూర్తిగా మానేయండి. ఇంటి నుంచి బాక్స్ తీసుకెళ్లి తిన‌డం వల్ల క‌నీసం రూ. 50 నుంచి 70 ఆదా చేయ‌వ‌చ్చు. 5 సిగ‌రెట్లు తాగ‌డం ఆపితే రూ. 60 వ‌ర‌కూ పొదుపు చేయ‌వ‌చ్చు. ఈ చ‌ర్య‌ల ద్వారా నెల‌కు రూ. 3300 వ‌ర‌కూ పొదుపు చేసిన‌ట్లే.

క్రెడిట్ కార్డు

క్రెడిట్ కార్డు

మీరు ఈ స‌ల‌హాను చాలా చోట్ల విని ఉంటారు. క్రెడిట్ కార్డును సాధ్య‌మైనంత‌గా వాడ‌క‌పోవ‌డ‌మే పోలు.

త‌ప్ప‌ద‌నుకుంటే త‌క్కువ ప‌రిమితి ఉన్న కార్డు తీసుకోండి. క్రెడిట్ కార్డు వాడ‌క‌పోవ‌డం వ‌ల్ల ప్ర‌ధానంగా లాభ‌మేంటంటే అన‌వ‌స‌ర‌మైన కొనుగోళ్లు జ‌ర‌ప‌రు. ఇంధ‌నం బిల్లు చెల్లింపుల‌కు స‌ర్‌చార్జీ లేకుండా ఉండేందుకు కొన్ని చోట్ల క్రెడిట్‌ కార్డు ఉప‌యోగించ‌వ‌చ్చు.

బిల్లు చెల్లింపులు

బిల్లు చెల్లింపులు

ఏవైనా బిల్లులు చెల్లించేట‌ప్పుడు వాలెట్ల ద్వారా జ‌రిపే వీలుందేమో చూడాలి. కొన్ని సార్లు వాలెట్ల ద్వారా జ‌రిపే చెల్లింపుల‌కు రాయితీలు, క్యాష్‌బ్యాక్‌లు వంటివి ఉంటాయి. కిరాణా బిల్లులు, ఇంట‌ర్నెట్‌, డీటీహెఛ్‌, మొబైల్ బిల్లులు వంటివి ఈ విధంగా చేయ‌వ‌చ్చు. ట్యాక్సీ రైడ్‌లు, సినిమా టిక్కెట్ల‌కు, ఆన్‌లైన్ షాపింగ్‌, ఫుడ్ ఆర్డ‌ర్లు, హోట‌ల్ బుకింగ్‌, విమాన‌, రైలు, బ‌స్ టిక్కెట్ల వంటి వన్నీ సాధ్య‌మైనంత వ‌ర‌కూ వాలెట్లు లేదా కార్డు ద్వారా చెల్లింపులు జ‌ర‌పండి.

Read more about: savings expenses
English summary

రోజువారీ ఖ‌ర్చుల్లోంచి డ‌బ్బు మిగ‌ల్చడం ఎలా? | Daily saving tips to reduce expenses

Smart people are those who balance their earnings and expenditures and still make a savings out of it. How much you earn does not matter, what counts is how much you can save without hurting much.
Story first published: Tuesday, September 27, 2016, 10:39 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X