For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసే వారు ఇవి చ‌ద‌వండి

|

భార‌తీయుల‌కు మంచి పెట్టుబ‌డి మార్గం అంటే ముందుగా గుర్తుకొచ్చేది ఫిక్స్‌డ్ డిపాజిట్లే. అయితే చాలా మంది వీటి వ‌డ్డీపై ఉండే టీడీఎస్‌, ట్యాక్స్ కాంప్లికేష‌న్స్ వంటివి తెలుసుకోకుండా పెట్టుబ‌డి పెడుతూ ఉంటారు. ఈ నేప‌థ్యంలో ఎఫ్‌డీల గురించి ఆస‌క్తిక‌ర‌మ‌యిన ఐదు విష‌యాల‌ను తెలుసుకుందాం.

1. వ‌డ్డీ 10 వేల లోపు ఉంటే

1. వ‌డ్డీ 10 వేల లోపు ఉంటే

ఎఫ్‌డీపై ఒక ఆర్థిక సంవ‌త్స‌రంలో వ‌చ్చే వ‌డ్డీ రూ. 10 వేల లోపు ఉంటే ఎటువంటి ప‌న్ను క‌ట్ట‌క్క‌ర్లేదు. ఒక‌వేళ వ‌డ్డీ రూ. 10 వేలు దాటితే టీడీఎస్ 10 శాతం క‌ట్ అవుతుంది. ఒక‌వేళ మీరు పాన్ నంబ‌రు ఇచ్చి ఉండ‌క‌పోతే టీడీఎస్ 20% క‌ట్ అవుతుంది. ప్ర‌స్తుతం రిక‌రింగ్ డిపాజిట్ల‌కు సైతం ఈ నియ‌మం అమ‌ల‌వుతోంది.

2. అన్ని డిపాజిట్ల‌ను క‌లిపి

2. అన్ని డిపాజిట్ల‌ను క‌లిపి

ఇంత‌కుముందు ఒక బ్రాంచీలో ఉండే వాటికే టీడీఎస్‌ను లెక్కించేవారు. ఇప్పుడు అన్ని బ్రాంచీల్లో ఉండే డిపాజిట్ల‌న్నింటినీ క‌లిపి టీడీఎస్‌ను లెక్కిస్తున్నారు. అంటే రిక‌రింగ్ డిపాజిట్ లేదా ఫిక్స్‌డ్ డిపాజిట్ల‌న్నీ క‌లిపి వ‌చ్చే వ‌డ్డీ రూ. 10 వేలు దాటితే టీడీఎస్ మిన‌హాయిస్తారు.

3. ట్యాక్స్ రిట‌ర్నుల్లో డిక్లేర్ చేయాలి

3. ట్యాక్స్ రిట‌ర్నుల్లో డిక్లేర్ చేయాలి

బ్యాంకు టీడీఎస్‌ను లెక్కించి మిన‌హాయించిన‌ప్ప‌టికీ ఇన్‌క‌మ్ ట్యాక్స్ రిట‌ర్నుల్లో ఆ వివ‌రాల‌ను పొందుప‌ర‌చాలి. ట్యాక్స్ శ్లాబ్‌ను అనుస‌రించి వ‌డ్డీ ఆదాయం కూడా ప‌న్ను ప‌రిధిలోకి వ‌స్తుంది. బ్యాంకులు సాధార‌ణంగా 10% టీడీఎస్‌ను క‌ట్ చేస్తాయి. ఒక‌వేళ మీరు అధిక పన్ను(20%, 30%) బ్రాకెట్‌లో ఉంటే మిగిలిన అద‌న‌పు పన్ను ట్యాక్స్ రిట‌ర్నులు ఫైల్ చేసేట‌ప్పుడు క‌ట్టాలి.

4. ఫారం 15జీ లేదా 15హెచ్‌

4. ఫారం 15జీ లేదా 15హెచ్‌

ప‌న్ను సంక్ర‌మించే ఆదాయం రూ. 2.5 ల‌క్ష‌ల కంటే త‌క్కువ ఉన్న‌ప్పుడు 15జీ లేదా 15 హెచ్ ఫారాల‌ను స‌మ‌ర్పించ‌డం ద్వారా ఫిక్స్‌డ్ డిపాజిట్ల‌పై వ‌చ్చే వ‌డ్డీ మీద టీడీఎస్ మిన‌హాయించ‌కుండా చేసుకోవ‌చ్చు. ఒక వేళ మీరు ఆయా ఫారంలు స‌బ్‌మిట్ చేయ‌డం మ‌రిచిపోతే ప‌న్ను రిట‌ర్నులు స‌మ‌ర్పించేట‌ప్పుడు ఇవ్వ‌డం ద్వారా రీఫండ్ కోసం ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు.

5. పొదుపు ఖాతా వ‌డ్డీ

5. పొదుపు ఖాతా వ‌డ్డీ

పొదుపు ఖాతాలో ఉండే నిల్వ‌పై సంక్ర‌మించే వ‌డ్డీపై టీడీఎస్ మిన‌హాయించ‌రు. ఒక‌వేళ వ‌డ్డీ ద్వారా వ‌చ్చే ఆదాయం రూ. 10 వేల‌ను మించితే దానిపై ప‌న్ను క‌ట్టి ఆ విష‌యాన్ని ప‌న్ను రిట‌ర్నుల్లో చూపాలి.

Read more about: fd fixed deposit
English summary

ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసే వారు ఇవి చ‌ద‌వండి | These things you should know before investing in FDs

Banks deposits are one of the most popular investments among Indians. Yet many people are not aware of some of the rules, particularly pertaining to the taxability of interest income.
Story first published: Friday, September 23, 2016, 11:18 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X