For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

2030 నాటికి టాప్‌-3లో యూఎస్‌, చైనా, ఇండియా

అయితే డాల‌రు జీడీపీ ప‌రంగా చూస్తే అమెరికానే అగ్ర‌స్థానంలో ఉంది. మారుతున్న ఆర్థిక ప‌రిస్థితుల దృష్ట్యా చూస్తే మొద‌టి రెండు స్థానాల్లో ఈ రెండు దేశాలే ఉన్నా 2030 నాటికి భార‌త్ మూడో స్థానానికి చేరుతుంద‌ని

|

ప్ర‌స్తుతం ప్ర‌పంచాన్ని ఆర్థికంగా శాసిస్తున్న దేశాలుగా చైనా, అమెరికా, జ‌పాన్‌, యూకే, జ‌ర్మ‌నీ ఉన్నాయి. కొనుగోలు శ‌క్తి ఆధారంగా లెక్కించే జీడీపీలో చైనా అమెరికాను దాటేసింది. అయితే డాల‌రు జీడీపీ ప‌రంగా చూస్తే అమెరికానే అగ్ర‌స్థానంలో ఉంది. మారుతున్న ఆర్థిక ప‌రిస్థితుల దృష్ట్యా చూస్తే మొద‌టి రెండు స్థానాల్లో ఈ రెండు దేశాలే ఉన్నా 2030 నాటికి భార‌త్ మూడో స్థానానికి చేరుతుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో ప్ర‌పంచంలో 2030 సంవ‌త్స‌రం నాటికి ఏయే దేశాలు ఏ ఏ స్థానాల్లో ఉన్నాయో తెలుసుకుందాం.

1. అమెరికా

1. అమెరికా

2016లో అమెరికా జీడీపీ 17,149 బిలియ‌న్ డాల‌ర్లుగా ఉంది. 2030 నాటికి అది 2.3% పెరిగి 23,857 బిలియ‌న్ డాల‌ర్లుగా ఉండ‌బోతుంద‌ని అంచ‌నా.

ప్ర‌స్తుతం 48,900 బిలియ‌న్ డాల‌ర్ల సంప‌ద‌తో అమెరికా ప్ర‌పంచంలోనే అగ్ర‌స్థానంలో ఉంది.

 2. చైనా

2. చైనా

17400 బిలియ‌న్ డాల‌ర్ల సంప‌ద‌తో ప్ర‌పంచంలోనే రెండో సంప‌న్న దేశంగా చైనా ఉంది. ప్ర‌స్తుత చైనా ఆర్థిక వ్య‌వ‌స్థ జీడీపీ 9307 బిలియ‌న్ డాల‌ర్లుగా ఉంది. 2030 నాటికి అది 18,829 బిలియ‌న్ డాల‌ర్ల‌కు పెర‌గ‌నుంది.

3. భార‌త‌దేశం

3. భార‌త‌దేశం

వ‌చ్చే ఒక‌టిన్నర ద‌శాబ్దంలో దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ రెండంకెల వృద్ది రేటును సాధిస్తుంద‌ని అంచ‌నా. ప్ర‌స్తుతం 2016లో దేశ జీడీపీ 2557 బిలియ‌న్ డాల‌ర్లుండ‌గా 2030 నాటికి అది 7287 బిలియ‌న్ డాల‌ర్లుకు చేర‌గ‌ల‌ద‌ని భావిస్తున్నారు.

సంప‌ద విష‌యంలో 5600 బిలియ‌న్ డాల‌ర్ల‌తో భార‌త్ ప్ర‌పంచంలోనే ఏడో స్థానంలో ఉంది.

4. జ‌పాన్

4. జ‌పాన్

జ‌పాన్ ఆర్థిక వ్య‌వ‌స్థ 0.7% వృద్ది చెందుతుంద‌ని అంచ‌నా. అంటే ప్ర‌స్తుత జీడీపీ 5792 బిలియ‌న్ డాల‌ర్ల నుంచి 2030 నాటికి 6535 బిలియ‌న్ డాల‌ర్ల‌కు పెర‌గ‌వ‌చ్చు.

5. జ‌ర్మ‌నీ

5. జ‌ర్మ‌నీ

జ‌ర్మ‌నీ 2016లో 3747 బిలియ‌న్ డాల‌ర్ల జీడీపీని క‌లిగి ఉంది. 2030 నాటికి 0.9% వృద్దితో 4308 బిలియ‌న్ డాల‌ర్ల జీడీపీని అందుకోగ‌ల‌ద‌ని అంచ‌నా.

6. యూకే

6. యూకే

2.5% వృద్దితో 2030 నాటికి యూకే ప్ర‌పంచంలోనే 6వ స్థానంలో నిల‌వ‌గ‌ల‌దు. అంటే ప్ర‌స్తుత జీడీపీ 2710 బిలియ‌న్ డాల‌ర్ల నుంచి 3815 బిలియ‌న్ డాల‌ర్ల స్థాయికి పెరగ‌వ‌చ్చు.

7. ఫ్రాన్స్‌

7. ఫ్రాన్స్‌

2016లో 2809 బిలియ‌న్ డాల‌ర్ల జీడీపీ సాధించిన ఫ్రాన్స్ 2030 సంవ‌త్స‌రానికి 3476 బిలియ‌న్ డాల‌ర్ల స్థాయికి చేరుకోవ‌చ్చు. అంటే దాదాపు 1.5 శాతం వృద్దిలో పెరుగుద‌ల‌ సాధించ‌వ‌చ్చు.

8. బ్రెజిల్‌

8. బ్రెజిల్‌

బ్రిక్స్‌దేశాల్లో ఒక‌టైన బ్రెజిల్ వ‌చ్చే కొన్నేళ్ల‌లో ఆర్థికంగా పుంజుకోనుంది. 2016 గ‌ణాంకాల ప్ర‌కారం 2315 బిలియ‌న్ డాల‌ర్ల జీడీపీగా ఉన్న ఈ దేశం 2030 నాటికి 3161 బిలియ‌న్ డాల‌ర్ల జీడీపీనీ తాక‌గ‌ల‌ద‌ని అంచ‌నా. వృద్దిలో 2.5 శాతం పెరుగుద‌ల ఉంటుంది.

 9. కెన‌డా

9. కెన‌డా

జీడీపీలో 2.1 శాతం పెరుగుద‌ల‌తో కెన‌డా ప్ర‌పంచంలోనే 9వ స్థానానికి చేరుకోగ‌ల‌ద‌ని భావిస్తున్నారు. దీని ప్ర‌కారం 2016లో 1829 బిలియ‌న్ డాల‌ర్ల స్థాయి వ‌ద్ద ఆ దేశ జీడీపీ 2030 కల్లా 2486 బిలియ‌న్ డాల‌ర్ల‌కు పెర‌గ‌గ‌ల‌దు.

10. ఇట‌లీ

10. ఇట‌లీ

2016లో 2071 బిలియ‌న్ డాల‌ర్ల జీడీపీని క‌లిగిన ఇటలీ 2030 సంవ‌త్స‌రానికి 2350 బిలియ‌న్ డాల‌ర్ల జీడీపీ స్థాయికి ఎదగ‌గ‌ల‌దు. అంటే జీడీపీలో వృద్ది 0.8% ఉంటుంద‌ని అంచ‌నా.

11. ర‌ష్యా

11. ర‌ష్యా

2016లో ర‌ష్యా జీడీపీ: 1594 బిలియ‌న్ డాల‌ర్లు

2030లో ర‌ష్యా జీడీపీ: 2219 బిలియ‌న్ డాల‌ర్లు

12. ఇండోనేషియా

12. ఇండోనేషియా

2016లో ఇండోనేషియా జీడీపీ: 1037 బిలియ‌న్ డాల‌ర్లు

2030లో ఇండోనేషియా జీడీపీ: 2077 బిలియ‌న్ డాల‌ర్లు

13.మెక్సికో

13.మెక్సికో

2016లో మెక్సికో జీడీపీ : 1244 బిలియ‌న్ డాల‌ర్లు

2030లో మెక్సికో జీడీపీ : 1970 బిలియ‌న్ డాల‌ర్లు

14. ఆస్ట్రేలియా:

14. ఆస్ట్రేలియా:

2016లో ఆస్ట్రేలియా జీడీపీ: 1338 బిలియ‌న్ డాల‌ర్లు

2030లో ఆస్ట్రేలియా జీడీపీ: 1943 బిలియ‌న్ డాల‌ర్లు

15. స్పెయిన్

15. స్పెయిన్

2016లో స్పెయిన్ జీడీపీ: 1478 బిలియ‌న్ డాల‌ర్లు

2030లొ స్పెయిన్ జీడీపీ: 1918 బిలియ‌న్ డాల‌ర్లు

16. ద‌క్షిణ కొరియా

16. ద‌క్షిణ కొరియా

2016లో ద‌క్షిణ కొరియా జీడీపీ: 1310 బిలియ‌న్ డాల‌ర్లు

2030లో ద‌క్షిణ కొరియా జీడీపీ: 1906 బిలియ‌న్ డాల‌ర్లు

17. ట‌ర్కీ

17. ట‌ర్కీ

2016లో జీడీపీ: 923 బిలియ‌న్ డాల‌ర్లు

2030లో జీడీపీ : 1589 బిలియ‌న్ డాల‌ర్లు

18. సౌదీ అరేబియా

18. సౌదీ అరేబియా

2016లో సౌదీ అరేబియా జీడీపీ: 689 బిలియ‌న్ డాల‌ర్లు

2030లో సౌదీ అరేబియా జీడీపీ: 1205 బిలియ‌న్ డాల‌ర్లు

19. నెద‌ర్లాండ్స్‌

19. నెద‌ర్లాండ్స్‌

2016లో జీడీపీ: 868 బిలియ‌న్ డాల‌ర్లు

2030లో జీడీపీ: 1089 బిలియ‌న్ డాల‌ర్లు

20. నైజీరియా

20. నైజీరియా

2016లో నైజీరియా జీడీపీ: 492 బిలియ‌న్ డాల‌ర్లు

2030లో నైజీరియా జీడీపీ: 916 బిలియ‌న్ డాల‌ర్లు

English summary

2030 నాటికి టాప్‌-3లో యూఎస్‌, చైనా, ఇండియా | Largest economies by 2030

Will today’s five largest economies—China, the United States, India, Japan and Germany—maintain their places between now and 2030? Or will see a reshuffling?
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X