For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

జీవిత బీమా పాల‌సీల్లోని ర‌కాలు

|

ఆర్థిక విష‌యాల‌పై అవగాహన పెరుగుతున్న కొద్దీ సంపాదించే ప్ర‌తి ఒక్క‌రికీ బీమా క‌చ్చిత‌మైన అవ‌స‌ర‌మ‌ని తెలుస్తోంది. అయితే బీమా పాల‌సీల్లో చాలా ర‌కాలున్నాయి. ఏజెంట్లు అన్ని అంశాల‌ను వివ‌రించ‌కుండా బ‌ల‌వంతంగా ఏదో పాల‌సీ కొనుగోలు చేయాల‌ని సూచిస్తే అదే పాల‌సీని కొంటే త‌ర్వాత మ‌నం అనుకున్న విధంగా బీమా చేయించుకోలేద‌ని బాధ‌ప‌డాలి. అందుకే బీమా పాల‌సీల్లో ర‌కాల‌ను గురించి వివ‌రంగా తెలుసుకుంటే ఈ బాధ ఉండ‌దు. జీవిత బీమా పాల‌సీల్లోని ప‌లు ర‌కాల‌ను గురించి ఇక్క‌డ తెలుసుకుందాం.

ట‌ర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ

ట‌ర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ

జీవిత బీమా పాల‌సీ ముఖ్య ఉద్దేశం పాల‌సీదారు మ‌ర‌ణం త‌ర్వాత కుటుంబానికి ఆర్థిక భ‌రోసా కల్పించ‌డం. బీమా అనేది ముఖ్యంగా ర‌క్ష‌ణ కోసం అంతే కానీ దాన్ని పెట్టుబ‌డిగా చూడ‌లేం. ఈ విధంగా చూస్తే కుటుంబానికి సంపూర్ణ ర‌క్ష‌ణ క‌ల్పించేవే ట‌ర్మ్ ఇన్సూరెన్స్ పాల‌సీలు. ఈ పాల‌సీలు పాల‌సీదారుకు గ‌రిష్ట ర‌క్ష‌ణ క‌ల్పిస్తాయి. అయితే పాల‌సీ కాల‌ప‌రిమితి మొత్తం పాల‌సీదారు జీవించి ఉన్న‌ట్ల‌యితే ద‌క్కే ప్ర‌యోజ‌నాలు స్వ‌ల్పం. పాల‌సీ కాల‌ప‌రిమితి లోపు పాల‌సీదారు చ‌నిపోయిన‌ట్ల‌యితే వారి కుటుంబానికి లేదా నామినీకి ప్ర‌యోజ‌నాల‌ను అంద‌జేస్తారు.

సంపూర్ణ జీవిత బీమా పాల‌సీ

సంపూర్ణ జీవిత బీమా పాల‌సీ

కాల‌పరిమితితో ముగియ‌కుండా జీవిత కాలం మొత్తానికి వ‌ర్తించే పాల‌సీయే సంపూర్ణ జీవిత బీమా పాల‌సీ. పాల‌సీదారు జీవితాంతం వ‌ర‌కూ ఈ పాల‌సీ వ‌ర్తిస్తుంది. చాలా కంపెనీలు ప్ర‌వేశ‌పెట్టే ఈ పాల‌సీల్లో ప్రీమియం పాల‌సీ అమల్లో ఉన్నంత వ‌ర‌కూ చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పుడు ప‌రిమితి కాలం వ‌ర‌కూ ప్రీమియం చెల్లించే, ఒకేసారి ప్రీమియం చెల్లించే పాల‌సీలను సైతం కంపెనీలు అందుబాటులోకి తీసుకువ‌స్తున్నాయి.

ఎండోమెంట్ పాల‌సీ

ఎండోమెంట్ పాల‌సీ

ఎండోమెంట్ పాల‌సీల్లో బీమా ర‌క్ష‌ణతో పాటు పొదుపు కూడా ఉంటుంది. వీటిని బీమా కంపెనీ ముందే సూచించిన మెచ్యూరిటీ పీరియ‌డ్‌తో ప్ర‌వేశ‌పెడ‌తారు. పాల‌సీ ముగిసే లోపు అనుకోకుండా ఏదైనా జ‌రిగి శాశ్వ‌త వైక‌ల్యం క‌లిగినా లేదా బీమాదారు మ‌ర‌ణించినా బీమా హామీ మొత్తాన్ని చెల్లిస్తారు. మామూలుగా అయితే పాల‌సీ ముగిసిన త‌ర్వాత మెచ్యూరిటీ బెనిఫిట్స్‌ను చెల్లిస్తారు.

మ‌నీ బ్యాక్ ప్లాన్లు

మ‌నీ బ్యాక్ ప్లాన్లు

మ‌నీ బ్యాక్ ప్లాన్ల‌లో మెచ్యూరిటీకి ముందే నిర్ణీత కాల‌వ్య‌వ‌ధుల్లో మ‌న డ‌బ్బు కొంత శాతం తిరిగి వ‌చ్చేలా ఏర్పాటు ఉంటుంది. ఉదాహ‌ర‌ణ‌కు 20 ఏళ్ల కాల‌ప‌రిమితి ఉన్న పాల‌సీలో 5,10,15 ఏళ్లకు ఒక‌సారి చెల్లింపులు జ‌రిపే వీలుండేలా ఆప్ష‌న్‌ను ఎంచుకోవ‌చ్చు. ఇందులో పాల‌సీ కాల‌ప‌రిమితి మొత్తానికి రిస్క్ క‌వ‌రేజీ ఉంటుంది.

పిల్ల‌ల పాల‌సీలు

పిల్ల‌ల పాల‌సీలు

పిల్ల‌ల భ‌విష్య‌త్తుకు భ‌రోసా ఉండేలా వారు చిన్న‌గా ఉన్న‌ప్పుడే వారి కోసం పాల‌సీలు తీసుకునేందుకు వీలుంది. ఈ ప్లాన్ల‌న్నీ పిల్ల‌ల పేరిట లేదా త‌ల్లిదండ్రుల పేరిట తీసుకోవ‌చ్చు. 18 లేదా 21 ఏళ్ల వ‌య‌సు వ‌చ్చిన త‌ర్వాత నుంచి పాల‌సీ ప్ర‌యోజ‌నాల‌ను చెల్లించే ఆప్ష‌న్‌ను ఎంచుకునేందుకు పాల‌సీలు అవ‌కాశం క‌ల్పిస్తున్నాయి. పిల్ల‌ల పాల‌సీల్లో కాల‌పరిమితి ముందే పాల‌సీ ప్రీమియం క‌ట్టే త‌ల్లిదండ్రులు మ‌ర‌ణిస్తే త‌దుప‌రి ప్రీమియంల‌ను క‌ట్టాల్సిన అవ‌స‌రం లేకుండా బీమా కంపెనీలు వెసులుబాటు క‌ల్పిస్తున్నాయి.

యాన్యుటీలు

యాన్యుటీలు

ప‌ద‌వీ విర‌మ‌ణ త‌ర్వాత పింఛ‌ను పొందాల‌నుకునే వారి కోసం రూపొందించిన‌వే రిటైర్మెంట్ పెన్ష‌న్ పాల‌సీలు(యాన్యుటీలు). సాధార‌ణంగా 60 ఏళ్ల త‌ర్వాత నుంచి పింఛ‌ను అందుకునేలా బీమా కంపెనీల పాల‌సీలు ఉంటున్నాయి. మ‌న అవ‌స‌రాన్ని బ‌ట్టి ఎన్ని నెల‌ల‌కు ఒక‌సారి పింఛ‌ను కావాలో ఆప్ష‌న్‌ను ఎంచుకుంటే స‌రిపోతుంది. ప‌ద‌వీ విర‌మ‌ణ త‌ర్వాత ఆర్థిక ఇబ్బందుల‌ను తగ్గించేందుకు కొంత వ‌ర‌కూ యాన్యుటీలు దోహ‌దం చేస్తాయి.

యూలిప్‌లు

యూలిప్‌లు

రిటైల్ ఇన్వెస్ట‌ర్లు స్టాక్ మార్కెట్‌లో ప్ర‌వేశించేందుకు యూలిప్‌లు ఉప‌యోగ‌ప‌డ‌తాయి. వినియోగ‌దారుడి న‌ష్ట‌భ‌య సామ‌ర్థ్యాన్ని బ‌ట్టి యూలిప్ పెట్టుబ‌డుల‌ను ఈక్విటీలో గానీ, డెట్ ఫండ్స్‌లో గానీ పెట్టుబ‌డులుగా పెట్ట‌వ‌చ్చు. దీర్ఘ‌కాలిక పెట్టుబ‌డి ప్ర‌ణాళిక క‌లిగి ఉండే వారి కోసం యూలిప్‌లు అనుకూలమైన‌వి. ఈ పాల‌సీల‌కు ప్రీమియాన్ని పాల‌సీదారు పెట్టుబ‌డి సామ‌ర్థ్యాన్ని బట్టి ఎవ‌రికి వారే ఎంచుకోవ‌చ్చు.

ముగింపు

ముగింపు

బీమా పాల‌సీ ఉంటే పాల‌సీదారు మ‌ర‌ణం త‌ర్వాత కుటుంబానికి ఆర్థిక భ‌రోసా ల‌భిస్తుంది.

ప్ర‌స్తుతం దేశంలో వేగంగా ఎదుగుతున్న రంగాల్లో బీమా రంగం ముందు వ‌రుస‌లో ఉంది. బీమాకు సంబంధించి మార్కెట్లో అవ‌గాహ‌న త‌క్కువ‌గా ఉంది. మీ ఆర్థిక ల‌క్ష్యాల‌కు త‌గ్గ పాల‌సీ ఎంచుకుంటే అది భ‌విష్య‌త్తులో ఉప‌యోగ‌ప‌డుతుంది.

English summary

జీవిత బీమా పాల‌సీల్లోని ర‌కాలు | types of insurance policies in India

In life lot of things are uncertain. So keeping one life insurance policy for everyone saves your family from financial risks in future. But in market different types of policies are there. In this context we are giving different types of insurance policies
Story first published: Thursday, September 8, 2016, 10:30 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X