For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

యూపీఐ గురించి తెలుసుకోవాల్సిన ప‌లు అంశాలు

|

బ్యాంకు ఖాతాల మ‌ధ్య న‌గ‌దు బ‌దిలీ మ‌రింత సుల‌భం అయింది. మీరు ప్ర‌తిసారి ఐఎఫ్ఎస్ కోడ్‌ల కోసం వెదికి, అవ‌త‌లి వ్య‌క్తిని అడిగి విసిగిపోయారా? అయితే ఇది చ‌ద‌వండి. దేశంలో చెల్లింపుల వ్య‌వ‌స్థ‌లో సంచ‌ల‌నం సృష్టించేందుకు ఎన్‌పీసీఐ యునిఫైడ్ పేమెంట్ ఇంట‌ర్‌ఫేస్‌(యూపీఐ)ను ప్ర‌వేశ‌పెట్టింది. దేశంలో న‌గ‌దు ర‌హిత వ్య‌వ‌స్థ‌ను ప్రోత్స‌హించేందుకు ఆర్‌బీఐ యూపీఐ యాప్‌ను త‌యారుచేసింది. ప్ర‌స్తుతం 21 బ్యాంకులు ఇందులో భాగ‌స్వాముల‌య్యాయి. ప్ర‌స్తుతం ఒక్కో బ్యాంకు వారి యాప్‌ల్లో ఈ సౌక‌ర్యాన్ని క‌ల‌గ‌జేస్తున్నాయి. నెమ్మ‌దిగా అన్ని ప్ర‌భుత్వ, ప్ర‌యివేటు బ్యాంకులు దీని ప్ర‌యోజ‌నాల‌ను వారి వినియోగ‌దారుల‌కు క‌ల్పిస్తాయి. ఈ నేప‌థ్యంలో యూపీఐ గురించిన ఆస‌క్తిక‌ర విష‌యాల‌ను తెలుసుకుందాం.

1. వివ‌రాల న‌మోదు

1. వివ‌రాల న‌మోదు

ఏదైనా బ్యాంకు క‌స్ట‌మ‌ర్‌ను ఈమెయిల్ ఐడీ లాంటి వ‌ర్చువ‌ల్ అడ్ర‌స్‌తో గుర్తించే స‌దుపాయాన్ని యూపీఐ యాప్ క‌ల్పిస్తుంది. ఇందులో ఎటువంటి బ్యాంకు వివ‌రాలు ఉండ‌వు కాబ‌ట్టి వినియోగ‌దారుడు ఎటువంటి భ‌యం లేకుండా దీన్ని ఇత‌రుల‌తో పంచుకోవ‌చ్చు. దీన్ని ఉప‌యోగించుకోవాల‌నుకుంటే వినియోగ‌దారులు మొద‌టిసారిగా న‌మోదు చేసుకోవాలి.

2. వ‌ర్చువ‌ల్ ఐడీ

2. వ‌ర్చువ‌ల్ ఐడీ

ఎక్కువగా వినియోగ‌దారులు పేరు, మొబైల్ నంబ‌రు క‌లిసి వ‌చ్చేలా పెట్టుకునేందుకు అవ‌కాశం ఉంది. అక్క‌డ ఏ పేరు లేదా నంబ‌రు పెట్టాల‌నుకునేది మీ ఇష్టం. ఉదాహ‌ర‌ణ‌కు రంజిత్‌@ఐసీఐసీఐ లేదా 9848012345@యాక్సిస్ అని పెట్టుకోవ‌చ్చు.ఐసీఐసీఐ పాకెట్ వినియోగ‌దారులు ఉదాహ‌ర‌ణ‌కు సూర‌జ్‌007@పాకెట్ ఫార్మెట్‌లో యూపీఐ వ‌ర్చువ‌ల్ అడ్ర‌స్‌ను క్రియేట్ చేసుకోవ‌చ్చు.

3. ఒక ఖాతాకు ఒకే అడ్ర‌స్‌

3. ఒక ఖాతాకు ఒకే అడ్ర‌స్‌

వివిధ బ్యాంకు ఖాతాల‌కు ప్ర‌త్యేక వ‌ర్చువ‌ల్ అడ్ర‌స్‌ల‌ను పెట్టుకోవ‌చ్చు. అంతే కాకుండా వేరే బ్యాంకుల‌కు వేర్వేరు వ‌ర్చువ‌ల్ అడ్ర‌స్‌ల‌ను సృష్టించుకోవ‌చ్చు.

4. సెక్యూర్ పిన్‌

4. సెక్యూర్ పిన్‌

చెల్లింపుల కోసం సెక్యూర్ పిన్‌(ఓటీపీ)ను న‌మోదు చేస్తే లావాదేవీ ప్ర‌క్రియ పూర్త‌వుతుంది.

5. ఎప్పుడైనా ఎక్క‌డైనా

5. ఎప్పుడైనా ఎక్క‌డైనా

ఇది 24 గంట‌లూ, 365 రోజులూ ప‌నిచేస్తుంది (ఐఎమ్‌పీఎస్ లాగే). లావాదేవీ పూర్త‌యిందా లేదా అనే విష‌యం వెంట‌నే తెలిసిపోతుంది.

6. క్యాష్ ఆన్ డెలివ‌రీకి బ‌దులుగా

6. క్యాష్ ఆన్ డెలివ‌రీకి బ‌దులుగా

ఈ-కామ‌ర్స్ వెబ్‌సైట్ల కొన్న వ‌స్తువుల‌కు చేసే చెల్లింపుల‌కు ఇది ప్ర‌యోజ‌న‌కారిగా ఉండ‌గ‌ల‌దు. క్యాష్ ఆన్ డెలివ‌రీకి బ‌దులుగా యూపీఐను ఉప‌యోగించి స‌త్వ‌ర‌మే చెల్లింపులు చేయ‌వ‌చ్చు. న‌గ‌దు చెల్లింపులు లేకుండా ఇది బాగా ఉంటుంది. అంతే కాకుండా బిల్లు చెల్లింపులు, పిల్ల‌ల పాఠ‌శాల ఫీజులు, అనుమ‌తించిన షాపింగ్ మాల్స్‌లో చెల్లింపుల‌ను చేయ‌వ‌చ్చు

7. ఐఎమ్‌పీఎస్ కంటే అడ్వాన్స్‌డ్‌

7. ఐఎమ్‌పీఎస్ కంటే అడ్వాన్స్‌డ్‌

ఐఎమ్‌పీఎస్ కంటే అడ్వాన్స్‌డ్ వ‌ర్ష‌న్ చెల్లింపు వ్య‌వ‌స్థ‌గా దీన్ని చెప్పుకోవ‌చ్చు. మొబైల్‌; ల‌్యాప్‌ట్యాప్‌,ట్యాబ్‌ల వంటి ప‌రిక‌రాల్లో ఇంట‌ర్నెట్ ఉంటే 24X7 లావాదేవీల‌ను క్ష‌ణాల్లో జ‌ర‌ప‌వ‌చ్చు. ఏటీఎమ్‌ల్లో సైతం ఈ సేవ ఉంటుంది.

8. ప్ర‌స్తుత యాప్‌ల్లోనే

8. ప్ర‌స్తుత యాప్‌ల్లోనే

ప్ర‌స్తుతం చాలా బ్యాంకులు దీనికి సంబంధించిన యాప్‌లను విడుద‌ల చేస్తున్నాయి. కొన్ని బ్యాంకులు ఉన్న యాప్‌ల్లోనే దీన్ని అద‌న‌పు సౌక‌ర్యంగా అందిస్తున్నాయి. ఐసీఐసీఐ ఐమొబైల్‌, పాకెట్ యాప్‌ల్లో దీన్ని ఇన్‌స‌ర్ట్ చేసింది. ఆ యాప్‌ల్లో అంత‌ర్భాగంగా మీరు దీన్ని వాడుకోవ‌చ్చు.

యూపీఐ సౌక‌ర్యం క‌ల్పిస్తున్న‌ బ్యాంకులు

యూపీఐ సౌక‌ర్యం క‌ల్పిస్తున్న‌ బ్యాంకులు

యూపీఐ సౌక‌ర్యం క‌ల్పిస్తున్న‌ బ్యాంకులు: ఆంధ్రా బ్యాంకు, యాక్సిస్ బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ మ‌హారాష్ట్ర, భార‌తీయ మ‌హిళా బ్యాంకు, కెన‌రా బ్యాంకు, క్యాథ‌లిక్ సిరియ‌న్ బ్యాంకు, డీసీబీ బ్యాంకు, ఫెడ‌ర‌ల్ బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంకు, టీజేఎస్‌బీ స‌హ‌కారీ బ్యాంకు, ఓరియంట‌ల్ బ్యాంక్ ఆఫ్ కామ‌ర్స్‌, క‌ర్ణాట‌క బ్యాంకు, యూకో బ్యాంకు, యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేష‌న‌ల్ బ్యాంకు, సౌత్ ఇండియ‌న్ బ్యాంకు, విజ‌యా బ్యాంకు, యెస్ బ్యాంకు

10. యూపీఐని ఉప‌యోగించండిలా

10. యూపీఐని ఉప‌యోగించండిలా

  1. ఫోన్‌లో ప్లేస్టోర్ నుంచి యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
  2. యాప్‌లో లాగిన్ అవ్వండి

  3. వ‌ర్చువ‌ల్ అడ్ర‌స్‌ను క్రియేట్ చేసుకోండి
  4. మొద‌టిసారి బ్యాంకు ఖాతాను యాడ్ చేసుకోండి
  5. ఎమ్‌పిన్‌ను సెట్ చేసుకోండి
  6. అంతే యూపీఐని ఉప‌యోగించుకునేందుకు మీరు త‌యార్
11. నంద‌న్ నీలేక‌ని కీల‌క పాత్ర‌

11. నంద‌న్ నీలేక‌ని కీల‌క పాత్ర‌

ఎన్‌పీసీఐ చేప‌ట్టిన ఈ యూపీఐ ప్రాజెక్టుకు ఇన్ఫోసిస్ స‌హ వ్య‌వ‌స్థాప‌కుడు నంద‌న్ నీలేక‌ని స‌ల‌హాదారుగా ప‌నిచేశారు. ర‌ఘురామ్ రాజ‌న్ ఏప్రిల్ నెల‌లో దీన్ని ప్రారంభించిన త‌ర్వాత పైల‌ట్ ప్రాజెక్టు కింద ర‌న్ చేశారు. ప్ర‌స్తుతం దీన్ని లైవ్‌లోకి తీసుకొచ్చారు. మీరు టెక్‌సావీ అయితే ఉప‌యోగించండి మ‌రి.

Read more about: upi bank account ifsc code
English summary

యూపీఐ గురించి తెలుసుకోవాల్సిన ప‌లు అంశాలు | Now u can transfer money without ifsc code

What is Unified Payment Interface? What is meant by upi? Advantages of upi over imps
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X