For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

క‌లానిథి మార‌న్ వార్షిక వేత‌నం రూ. 56 కోట్లా?

|

ఆసియాలో అత్య‌ధిక సంఖ్య‌లో బిలియ‌నీర్లు క‌లిగిన దేశాల్లో భార‌త‌దేశం రెండో స్థానంలో ఉంది. 1990ల్లో ఆర్థిక స‌ర‌ళీక‌ర‌ణ‌ల త‌ర్వాత ఎన్నో భార‌తీయ బ‌హుళ జాతి కంపెనీలు ప్ర‌పంచ స్థాయికి ఎదిగాయి. ఈ క్ర‌మంలో ఎంద‌రో వ్య‌వ‌స్థాప‌కులు, ఎండీలు, చైర్మ‌న్‌లు, సీఈవోలు త‌మ సర్వ‌శ‌క్తుల‌ను ఒడ్డారు. కంపెనీకి లాభాలు గ‌డించ‌డంలో కీల‌క పాత్ర వ‌హించిన వారికి వార్షిక‌ వేత‌నాలు అదే స్థాయిలో అందుతున్నాయి. మొద‌టి స్థానంలో క‌లానిథి మార‌న్ ఉండ‌గా, దివి ల్యాబ‌రేట‌రీస్ అధినేత ముర‌ళి దివి 10వ స్థానంలో ఉన్నారు. 2015లో అత్య‌ధిక వార్షిక వేత‌నాలు అందుకున్న ప‌ది మంది జాబితాను ఇక్క‌డ చ‌ద‌వండి.

1.క‌లానిథి మార‌న్‌

1.క‌లానిథి మార‌న్‌

గ‌తేడాది లెక్క‌ల ప్ర‌కారం దేశంలోనే రెండో స్థానంలో ఉన్న అతిపెద్ద టెలివిజ‌న్ నెట్‌వ‌ర్క్ స‌న్‌టీవీ ఛైర్మ‌న్ క‌లానిథి మార‌న్ రూ. 56.25 కోట్ల వార్షిక వేత‌నాన్ని పొందుతున్నారు. ప్ర‌స్తుతం ఆసియాలోనే అతి ఎక్కువ లాభాలు గ‌డిస్తున్న మీడియా సంస్థ స‌న్ నెట్‌వ‌ర్క్. క‌లానిధి మార‌న్ స్పైస్‌జెట్ ఎయిర్‌లైన్స్‌ను కొనేశారు. స‌న్ నెట్‌వ‌ర్క్‌కు చెందిన టెలివిజ‌న్ చానళ్లు, వార్తాప‌త్రిక‌లు ప్ర‌ధానంగా ద‌క్షిణ భార‌తేదేశంలో ఉన్నాయి. మ‌రో వైపు ఎఫ్ఎం రేడియో చాన‌ళ్లు, డీటీహెచ్ సేవలు, ఎయిర్‌లైన్స్ దేశ‌వ్యాప్తంగా విస్త‌రించి ఉన్నాయి.

2. కావేరి మార‌న్

2. కావేరి మార‌న్

క‌లానిథి మార‌న్ భార్య అయిన కావేరి మార‌న్ స‌న్ నెట్‌వ‌ర్క్ ఎగ్జిక్యూటివ్ డైరెక్ట‌రుగా ఉన్నారు. మొత్తం జాబితాలో రెండో అతిపెద్ద వేత‌నం పొందే వ్య‌క్తిగా ఆమె నిలిచారు. ఫార్చూన్ మ్యాగ‌జైన్ ప్ర‌కారం ఇండియాలో అత్య‌ధిక వేత‌నం పొందే మ‌హిళ ఆమే. వార్షిక వేత‌నం రూ. 56.24 కోట్లు.

3. న‌వీన్ జిందాల్

3. న‌వీన్ జిందాల్

గ‌తంలో ఎంపీగా ప‌నిచేసిన న‌వీన్ జిందాల్ 2014 లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో ఓడిపోయారు. జిందాల్ స్టీల్ అండ్ ప‌వ‌ర్ లిమిటెడ్‌కు చైర్మ‌న్‌గా ప‌నిచేస్తున్న ఆయ‌న వేత‌నం రూ. 54.98 కోట్లు. ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియాను పార్ల‌మెంట్ స‌వ‌రించేలా చేసి ప్ర‌తి ఒక్క భార‌తీయుడు 365 రోజులూ ఎగ‌రేసుకునేందుకు అనుమ‌తిచ్చేలా చ‌ట్టాన్ని మార్చేందుకు దారితీసిన ప‌రిణామాలకు న‌వీన్ జిందాల్ ఆద్యుడు.

4. కుమార మంగ‌ళం బిర్లా

4. కుమార మంగ‌ళం బిర్లా

ఆదిత్యా బిర్లా గ్రూప్ చైర్మ‌న్‌గా 1995లో కుమార మంగ‌ళం బిర్లా నియ‌మితుల‌య్యారు. తండ్రి మ‌ర‌ణంతో 28 ఏళ్ల‌కే ప‌ద‌విని స్వీక‌రించారు. అప్ప‌టి నుంచి గ్రూప్ ట‌ర్నోవ‌ర్‌ను 2 బిలియ‌న్ డాల‌ర్ల నుంచి 40 బిలియ‌న్ డాల‌ర్ల స్థాయికి తీసుకొచ్చేందుకు ఎంతో క‌ష్ట‌ప‌డ్డారు. 17 ఏళ్ల‌లో 26 సంస్థ‌ల‌ను కొన్నారు, విలీనం చేసుకున్నారు. అన్ని సంస్థ‌ల‌ను సొంతం చేసుకున్న మొద‌టి భార‌తీయ కంపెనీ ఇదే. కే.ఎం. బిర్లా వార్షిక వేత‌నం రూ. 49.62 కోట్లు.

5. ప‌వ‌న్ ముంజల్‌

5. ప‌వ‌న్ ముంజల్‌

ప‌వ‌న్ ముంజ‌ల్ వార్షిక వేత‌నం రూ. 32.80 కోట్లు. ముంజ‌ల్ హీర్ మోటో కార్ప్ సీఈవోగా ప‌నిచేస్తున్నారు. మొత్తం గ్రూప్ వ్యూహాత్మ‌క ప్ర‌ణాళిక‌లోనూ సంస్థ వృద్ది బాట ప‌ట్ట‌డంలోనూ ఈయ‌న కీల‌క భూమిక వ‌హించారు. సీసీఐ లాంటి కీల‌క క‌మిటీల‌కు చైర్మ‌న్‌గా ఉన్నారు. ప్రఖ్యాత మేనేజ్‌మెంట్ సంస్థ ఐఐఎమ్, ల‌క్నో బోర్డ్‌లో సభ్యుడిగా ఉన్నారు.

6. బ్రిజ్‌మోహ‌న్ లాల్ ముంజ‌ల్‌

6. బ్రిజ్‌మోహ‌న్ లాల్ ముంజ‌ల్‌

హీరో గ్రూప్ చైర్మ‌న్‌, వ్య‌వ‌స్థాప‌క డైరెక్ట‌ర్‌గా ప‌నిచేసిన బ్రిజ్‌మోహ‌న్ లాల్ ముంజ‌ల్ 32.73 కోట్ల వార్షిక వేత‌నం అందుకున్నారు. సీఐఐ, సొసైటీ ఆఫ్ ఆటోమొబైల్ మ్యాన్యుఫ్యాక్చ‌ర‌ర్స్‌కు ప్రెసిడెంట్‌గా ప‌నిచేశారు. భార‌త ప్ర‌భుత్వం ఆయ‌న్ను ప‌ద్మ భూష‌ణ్ అవార్డుతో స‌త్క‌రించింది.

గ‌తేడాది న‌వంబ‌రు,1న ఆయ‌న దిల్లీలో మ‌ర‌ణించారు.

7. సునీల్ కాంత్ ముంజ‌ల్‌

7. సునీల్ కాంత్ ముంజ‌ల్‌

సునీల్ కాంత్ ముంజ‌ల్ హీరో మోటార్ కార్ప్ జాయింట్ మేనేజింగ్ డైరెక్ట‌ర్‌. ఆయ‌న వార్షిక వేత‌నం రూ. 31.51 కోట్లు. కంపెనీ బోర్డ్ ఆఫ్ డైరెక్ట‌ర్ల‌లో 2006లో నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్ట‌రుగా చేరారు. ఆగ‌స్టు 17,2011 నుంచి ఐదేళ్ల కాలానికి జాయింట్ మేనేజింగ్ డైరెక్ట‌రుగా నియ‌మితుల‌య్యారు. ప్ర‌స్తుతం సైతం ఆయ‌న జేఎండీగా కొన‌సాగుతున్నారు. డూన్ స్కూల్ అలుమ్నీ స‌భ్యుడైన ఆయ‌న డూన్ స్కూల్‌, ఐఎస్‌బీ బోర్డ్ ఆఫ్ డైరెక్ట‌ర్ల‌లో మెంబ‌ర్‌గా ప‌నిచేశారు.

 8. పీ ఆర్ రామసుబ్ర‌మ‌ణియ రాజా

8. పీ ఆర్ రామసుబ్ర‌మ‌ణియ రాజా

రామ్‌కో సిమెంట్ చైర్మ‌న్‌, ఎండీ అయిన రామ సుబ్ర‌మ‌ణియ రాజా వార్షిక వేత‌నం రూ. 30.96 కోట్లు. రామ్‌కో సిమెంట్ సిమెంట్‌, మోర్టార్‌, ప‌వ‌న విద్యుత్ ఉత్ప‌త్తి విభాగాల్లో వ్యాపారాల‌ను విస్త‌రించింది. అత‌ని నేతృత్వంలో కంపెనీ నూత‌న విజ‌యాల‌నెన్నింటినో సాధించింది. 1938లో సంస్థ‌ను స్థాపించిన‌ప్ప‌టి నుంచి దానితో అనుబంధం క‌లిగి ఉన్నారు.

9. షింజో న‌కానిశి

9. షింజో న‌కానిశి

ప్ర‌ముఖ కార్ల త‌యారీ కంపెనీ మారుతి సుజికి ఎండీ అయిన నకానిశి వార్షిక వేత‌నం రూ. 30.90 కోట్లు. సుజుకి మోటార్ కార్పొరేష‌న్‌ సీనియ‌ర్ మేనేజింగ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీస‌ర్‌, ఎగ్జిక్యూటివ్ జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్‌గా సైతం వ్య‌వ‌హ‌రిస్తున్నారు. సుజుకి మోటార్ కార్పొరేష‌న్ డైరెక్ట‌ర్‌గా 1999లో నియ‌మితుల‌య్యారు.

డా. ముర‌ళి కే దివి

డా. ముర‌ళి కే దివి

దివీస్ ల్యాబొరేట‌రీస్ ఎండీ ముర‌ళి కే దివి వార్షిక వేత‌నం రూ. 26.46 కోట్లు. కాక‌తీయ యూనివ‌ర్సిటీ నుంచి ఫార్మాస్యుటిక‌ల్ సైన్సెస్‌లో డాక్ట‌రేట్‌ను పొందారు. అమెరిక‌న్ ఇనిస్టిట్యుట్ ఆఫ్ కెమిక‌ల్ ఇంజినీర్స్‌, అమెరిక‌న్ కెమిక‌ల్ సొసైటీ, అమెరిక‌న్ కాస్మొటిక్ సొసైటీ, అమెరిక‌న్ ఫార్మాస్యుటిక‌ల్ ఆసోషియేన్‌లో స‌భ్యుడిగా ఉన్నారు. ఫార్మాస్యుటిక‌ల్స్ త‌యారీ రంగంలో 30 ఏళ్ల అనుభ‌వం క‌లిగి ఉన్నారు.

Read more about: sun network ceo
English summary

క‌లానిథి మార‌న్ వార్షిక వేత‌నం రూ. 56 కోట్లా? | Highest paid executives in India

Media baron and Chairman and MD of Sun Group Kalanithi Maran tops the list of highest paid executives in India.India is a home to some of the most well paid executives also along with second highest number of billionaires in Asia
Story first published: Tuesday, August 30, 2016, 12:08 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X