For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఫ‌లితాల త‌డ‌బాటుతో టీసీఎస్ బాట‌లో ఇన్ఫోసిస్‌

|

ఇటీవ‌లి త్రైమాసిక ఫ‌లితాలు నిరాశ‌ప‌ర‌చ‌డంతో డీలా ప‌డ్డ ఐటీ దిగ్గ‌జం ఇన్ఫోసిస్ లాభాల‌ను త‌గ్గ‌కుండా చూసుకునేందుకు వ్యూహాల‌ను సిద్దం చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా త‌న పోటీ కంపెనీ టీసీఎస్ ఇంత‌కు ముందు అమ‌లు చ‌సిన ప్ర‌ణాళిక‌ల‌ను ప‌రిశీలిస్తున్న‌ట్లు స‌మాచారం.
ఇన్ఫోసిస్ సీఈవోగా విశాల్ సిక్కా ప‌గ్గాలు చేపట్టిన‌ప్ప‌టి నుంచి కొంత మంది టాప్ లెవెల్ ఉద్యోగులు కంపెనీని వీడారు. ఈ నేప‌థ్యంలో టీసీఎస్ ఏడు సంవత్సరాల క్రితం అమల్లోకి తెచ్చిన ప్రక్రియను ఇన్ఫోసిస్ అవలంబించబోతున్న‌ట్లుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. తన వ్యాపారాన్ని చిన్న యూనిట్లుగా విస్తరించనున్నామనే ఎత్తుగడను ప్రకటించి ప్రాఫిట్ అండ్ లాస్ ఖాతాను ఏర్పాటు చేస్తున్న‌ట్లు సంస్థ యాజ‌మాన్యం తెలిపింది.

 ఫ‌లితాల త‌డ‌బాటుతో టీసీఎస్ బాట‌లో ఇన్ఫోసిస్‌

పూనే సమావేశంలో విశ్లేషకుల ప్రశ్నలకు సమాధానం చెప్పిన విశాల్ సిక్కా ఈ మేరకు వివరణ ఇచ్చారు. వ్యాపార విభజనలో భాగంగా స్వయంప్రతిపత్తిగల యూనిట్లను ఏర్పాటు చేయనున్నట్లు వెల్ల‌డించారు. ఇది త‌మ విస్త‌ర‌ణ‌కు తోడ్ప‌డ‌గ‌ల‌ద‌ని, ఆయా వ్యక్తుల జవాబుదారీతనం ఇస్తుందని చెప్పారు. చిన్నచిన్న యూనిట్లుగా విభజించామని చెప్పినప్పటికీ సంఖ్యను గురించి క‌చ్చిత‌మైన స‌మాచారాన్ని వెల్ల‌డించ‌లేదు. ఇంకా తరువాతితరం నాయకత్వం వివరాలను వెల్లడించడానికి నిరాకరించింది.
టీసీఎస్ సీఈవోగా ఎన్ చంద్ర‌శేఖ‌ర్ హ‌యాంలో దాదాపు ఏడు సంవత్సరాల క్రితం 2009లో ఇలాంటి చర్యలకు శ్రీకారం చుట్టిన సంగ‌తి తెలిసిందే. దాదాపు 23 మంది మినీ సీఈవో లకు బాధ్యలను అప్పగించి, వ్యాపార వృద్ధిలో టార్గెట్స్ ఇ చ్చింది. అయితే ప్రస్తుతమున్న వ్యాపారంలో అంతరాయం రాకుండా చిన్న చిన్న యూనిట్లను అనుమతినివ్వడమనే నూతన ప్రక్రియ ఇన్ఫోసిస్ వ్యాపార వృద్ధికి తోడ్పడే అవకాశం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు.

Read more about: infosys tcs
English summary

ఫ‌లితాల త‌డ‌బాటుతో టీసీఎస్ బాట‌లో ఇన్ఫోసిస్‌ | infosys in the way of tcs because of poor results

Since he took over as CEO two years ago, Vishal Sikka has weathered a bunch of management exits, the latest of which was that of ManishTandon - who was in charge of healthcare, insurance and life sciences. The Bengaluru-based company responded by concentrating responsibility in the hands of its presidents,
Story first published: Monday, August 29, 2016, 14:36 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X