For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ప్ర‌పంచంలో ప‌ది సంప‌న్న దేశాలు

|

ప్రపంచంలోని 10 సంపన్న దేశాల్లో భారత్ 7వ స్థానంలో నిలిచింది. న్యూ వరల్డ్ వెల్త్ నివేదిక ప్రకారం... భారత్ 5,600 బిలియన్ డాలర్ల సంపదతో ఈ స్థానం సంపాదించుకోగా, 48,900 బిలియన్ డాలర్ల సంపదతో అమెరికా అగ్ర‌స్థానంలో ఉంది. అయితే ఇవ‌న్నీ దేశ మొత్తం సంప‌ద ఆధారంగా రూపొందించిన లెక్క‌లు. అంటే జీడీపీ ఆధారంగా గ‌ణించిన‌వి. గ‌త సంవ‌త్స‌ర కాలంలో ఇండియా, ఆస్ట్రేలియా, కెన‌డా దేశాలు సంప‌ద విష‌యంలో ఇట‌లీని దాటేశాయి. జూన్ 2016 నాటికి ప్రపంచంలో ప‌ది అగ్ర సంప‌న్న దేశాల‌ను ఇక్క‌డ చూద్దాం.

10. ఇట‌లీ

10. ఇట‌లీ

6 నుంచి 7 కోట్ల మ‌ధ్య జ‌నాభా క‌లిగిన ఇట‌లీ మిశ్ర‌మ ఆర్థిక వ్య‌వ‌స్థ‌. యూరో జోన్‌లో మూడో అతిపెద్ద దేశ‌మైన ఇట‌లీ ప్ర‌పంచంలో సంప‌ద‌లో 10 వ స్థానంలో ఉంది. ప్ర‌పంచవ్యాప్తంగా త‌యారీలో 6వ అతిపెద్ద దేశం ఇట‌లీ. ఈ దేశ సంప‌ద 4400 బిలియ‌న్ డాల‌ర్లు. ఇట‌లీ క‌రెన్సీ యూరో. ఇట‌లీ దేశంలో ముఖ్య న‌గ‌రాలు రోమ్‌, మిల‌న్‌, నేపుల్స్‌,ట్యురిన్‌. వైన్ ఉత్ప‌త్తిలో ప్ర‌పంచంలోనే మొద‌టి స్థానంలో ఉంది. ఆటోమొబైల్‌, యంత్ర ప‌రిక‌రాలు, ఆహారం, డిజైన్‌, ఫ్యాష‌న్ రంగాలు దేశ ప్ర‌ధాన ఆదాయ వ‌న‌రులు.

9. అస్ట్రేలియా

9. అస్ట్రేలియా

కామ‌న్‌వెల్త్ దేశ‌మైన ఆస్ట్రేలియా సంప‌ద‌లో ప్రపంచంలో 9వ స్థానంలో నిలిచింది. ఈ దేశ జీడీపీ 4500 బిలియ‌న్ డాల‌ర్లు. మైనింగ్ సంబంధిత ఎగుమ‌తులు, టెలిక‌మ్యూనికేష‌న్లు, బ్యాంకింగ్‌, త‌యారీ ఈ దేశానికి ప్ర‌ధాన ఆదాయ వ‌న‌రులు. ఈ దేశ క‌రెన్సీ ఆస్ట్రేలియ‌న్ డాల‌రు. త‌ల‌స‌రి ఆదాయ‌ప‌రంగా చూస్తే ప్ర‌పంచంలో మొద‌టి 5 స్థానాల్లో నిలిచే ఆస్ట్రేలియా మాన‌వాభివృద్దిలో(హెచ్‌డీఐ) ప‌రంగా అమెరికా త‌ర్వాత రెండో స్థానంలో ఉండ‌టం విశేషం. అస్ట్రేలియా రాజ‌ధాని క్యాన్‌బెర్రా కాగా ప్ర‌ధాన న‌గ‌రం సిడ్నీ.

8. కెనడా

8. కెనడా

4700 బిలియ‌న్ డాల‌ర్ల‌తో సంప‌ద విష‌యంలో కెనడా ప్ర‌పంచంలోనే 8వ స్థానంలో నిలిచింది. 2016 జ‌నాభా లెక్క‌ల ప్రకారం కెన‌డా దేశ జ‌నాభా 3 కోట్ల 61 ల‌క్ష‌లు. జీ8 దేశాల్లో కెన‌డా సైతం స‌భ్య‌త్వం క‌లిగి ఉంది. త‌యారీ, మైనింగ్‌, సేవా రంగాల వృద్దితో ప‌ట్ట‌ణీక‌ర‌ణ ఎక్కువ‌యిన మూలంగా ఈ దేశం సంప‌ద ఇబ్బ‌డిముబ్బ‌డిగా పెరిగింది. 2015 నాటికి కెన‌డా 13 మంది నోబెల్ విజేత‌ల‌ను క‌లిగి ఉంది.

7. భార‌త‌దేశం

7. భార‌త‌దేశం

5600 బిలియ‌న్ డాల‌ర్ల‌తో మ‌న దేశం సంప‌ద ప‌రంగా ఏడో స్థానంలో నిలిచింది. సంప‌ద‌లో చెప్పుకోద‌గ్గ పురోగ‌తి ఉంద‌ని నివేదిక పేర్కొంది. భార‌త దేశ జ‌నాభా 2016 అంచ‌నాల ప్ర‌కారం 129 కోట్ల‌కు పైనే. కొనుగోలు శ‌క్తి ఆధారంగా చూస్తే మూడో స్థానంలో ఉండ‌టం ఇండియాకు లాభించే అంశం. మ‌న దేశంలో సేవా రంగం 56 శాతం ఆదాయాన్ని సృష్టిస్తోంది. పారిశ్రామిక రంగం 26 శాతాన్ని, వ్య‌వ‌సాయ రంగం 18 శాతం ఆదాయాన్ని స‌మ‌కూరుస్తున్నాయి. ప్రైస్ వాట‌ర్‌కూప‌ర్ 2011 నివేదిక ప్ర‌కారం కొనుగోలు శ‌క్తిలో 2045 నాటికి అమెరికాను భార‌త్ మించేస్తుంది.

6. ఫ్రాన్స్

6. ఫ్రాన్స్

ఫ్యాష‌న్‌లో ముందు వ‌రుస‌లో ఉండే ఫ్రాన్స్ సంప‌ద‌లో మాత్రం ఆరో స్థానంలో నిలిచింది. ఈ దేశ సంప‌ద 6600 బిలియ‌న్ డాల‌ర్లు.

చరిత్ర కాలం నుంచి వ్య‌వ‌సాయ ఉత్ప‌త్తుల్లో ఫ్రాన్స్ అతిపెద్ద ఉత్ప‌త్తిదారుగా ఉంది. ప‌ర్యాట‌క రంగం ఈ దేశానికి మ‌రో ప్ర‌ధాన ఆదాయ వ‌న‌రు. యూనెస్కో ప్ర‌పంచ వార‌స‌త్వ ప్ర‌దేశాల్లో 37 ప్ర‌ముఖ ప్ర‌దేశాలు ఈ దేశం నుంచే ఉన్నాయి.

5. జ‌ర్మ‌నీ

5. జ‌ర్మ‌నీ

9100 బిలియ‌న్ డాల‌ర్ల‌తో జ‌ర్మ‌నీ 5వ స్థానంలో నిలిచింది. 2015 లెక్క‌ల ప్రకారం జ‌ర్మ‌నీ దేశం జనాభా 8.17 కోట్లు. కొనుగోలు శ‌క్తి ఆధారంగా ఈ దేశం ప్ర‌పంచంలో ఐదో స్థానంలో ఉంది. చాలా పారిశ్రామిక‌, సాంకేతిక రంగాల్లో జ‌ర్మ‌నీ ప్ర‌పంచంలోనే ముందు వ‌రుస‌లో నిలిచింది. ఈ దేశ సేవా రంగం జీడీపీలో 71% ఆదాయాన్ని స‌మ‌కూరుస్తోంది.

4. యూకే

4. యూకే

భార‌త‌దేశంలో ఒక రాష్ట్రమంత జ‌నాభా క‌లిగిన యూకే సంప‌ద‌లో మాత్రం దూసుకెళుతోంది. ఈ దేశ మొత్తం సంప‌ద 9200 బిలియ‌న్ డాల‌ర్లు. యూకే క‌రెన్సీ పౌండ్ స్టెర్లింగ్‌. ఈ దేశంలో సేవా రంగం, జీడీపీకి 73 శాతం ఆదాయాన్ని స‌మ‌కూరుస్తుంది.

3. జ‌పాన్‌

3. జ‌పాన్‌

విస్తీర్ణంలో చిన్న‌దైన‌ప్ప‌టికీ మేథో సంప‌త్తితో జ‌పాన్ మూడో స్థానంలో నిలిచింది. జ‌పాన్ 15,100 బిలియ‌న్ డాల‌ర్ల సంప‌ద‌ను క‌లిగి ఉంది. కొనుగోలు శ‌క్తి ఆధారంగా చూస్తే అమ‌రికా, చైనా, భార‌త్‌ల త‌ర్వాత నాలుగో స్థానంలో ఉంది. గ్లోబ‌ల్ కాంపిటీటివ్‌నెస్ రిపోర్టు 2015-16 నివేదిక ప్ర‌కారం బ్రాండ్ ఇండెక్స్‌లో జ‌పాన్ ప్ర‌థ‌మ స్థానంలో ఉంది. జ‌పాన్‌కు ప్ర‌ధాన ఆస్తి ప‌రిశోధ‌న‌, అభివృద్ది. దాదాపు 7 ల‌క్ష‌ల మంది ప‌రిశోధ‌కులు ఆ దేశానికి 130 బిలియ‌న్ డాల‌ర్ల ఆస్తిని స‌మ‌కూరుస్తున్నారంటే ఆ దేశం అందులో ఎంత బ‌లంగా ఉందో అర్థం చేసుకోవ‌చ్చు.

2. చైనా

2. చైనా

గ‌త 15 ఏళ్ల కాలం నుంచి వేగంగా అభివృద్ది చెందుతున్న దేశం చైనా. 17400 బిలియ‌న్ డాల‌ర్ల సంప‌ద‌తో ప్ర‌పంచంలో రెండో సంప‌న్న దేశంగా ఉంది. కొనుగోలు శ‌క్తి(పీపీపీ) ఆధారంగా చూస్తే ప్ర‌పంచంలోనే అతి పెద్ద ఆర్థిక వ్య‌వ‌స్థ చైనా.

1. అమెరికా

1. అమెరికా

50 రాష్ట్రాలు క‌లిగిన అమెరికా ఎప్ప‌టిలాగే ప్ర‌పంచంలోనే సంపన్న దేశంగా నిలిచింది. ఆ దేశ మొత్తం సంప‌ద విలువ 48,900 బిలియ‌న్ డాల‌ర్లు. స‌హ‌జ వ‌న‌రులు బాగా ఉండ‌టంతో పాటు, ఉత్పాద‌కత ఎక్కువ‌గా ఉండ‌ట‌మే దీనికి కార‌ణం.

Read more about: india rich countries
English summary

ప్ర‌పంచంలో ప‌ది సంప‌న్న దేశాలు | India is 7th Richest in the World

India is the seventh wealthiest country in the world. It figures among the 10 wealthiest countries, with a total individual wealth of $ 5,600 billion.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X