For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రూ. 27 వేల కోట్ల విలువైన ప్రాజెక్టుల‌కు ఆమోదం

|

రోడ్డు, రైల్వే ప్రాజెక్టుల‌కు సంబంధించి కేంద్రం కీల‌క నిర్ణ‌యాలు తీసుకుంది. ఆంధ్ర ప్రదేశ్‌, తెలంగాణతో పాటు తొమ్మిది రాష్ట్రాల్లో రూ.24,000 కోట్ల విలువైన తొమ్మిది రైల్వే ప్రాజెక్టులకు ఆమోద ముద్ర వేసింది.
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో విజ‌య‌వాడ‌-గూడూరు మ‌ధ్య రూ. 3875 కోట్ల వ్య‌యంతో మూడో రైల్వే లైను నిర్మించాల‌ని ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ నేతృత్వంలోని కేంద్ర క్యాబినెట్ స‌బ్ క‌మిటీ నిర్ణ‌యం తీసుకుంది. ఇవ‌న్నీ వ‌చ్చే 4-5ఏళ్లలో పూర్తయ్యే అవ‌కాశం ఉంది. మొత్తం తొమ్మిది రైలు మార్గాల వలన ఆయా మార్గాల్లో ఏటా 150 కోట్ల టన్నుల సరుకుల రవాణా సామర్ధ్యం కొత్త‌గా జ‌త చేరుతుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. నూత‌న‌ రైలు మార్గాలు వ‌స్తే ప్రస్తుత లైన్లపై ఒత్తిడి తగ్గుతుందని భావిస్తున్నారు.

రూ. 27 వేల కోట్ల విలువైన ప్రాజెక్టుల‌కు ఆమోదం

కేంద్ర కేబినెట్ ఆమోదించిన రోడ్డు ప్రాజెక్టులు
దేశంలోని 5 రాష్ట్రాల్లో రూ.6,461 కోట్ల అంచనాతో 1,120 కిలోమీటర్ల జాతీయ రహదార్ల నిర్మాణానికి ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టుల‌న్నీ కర్ణాటక, బిహార్‌, ఒడిశా, రాజస్థాన్‌, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల‌కు చెందిన‌వి. కొచ్చిన్‌ పోర్టు ట్రస్టుకు ఇచ్చేన రుణంపై విధించిన రూ.897 కోట్ల అపరాధ వ‌డ్డీని కేంద్రం మాఫీ చేసింది. భారత-సైప్రస్‌ మధ్య కొత్తగా కుదిరిన ద్వంద్వ పన్నుల నిరోధక ఒప్పందా(డిటిఎఎ)నికి ప‌చ్చ‌జెండా ఊపారు. ఫిజితో విమానయాన సేవల ఒప్పందాలకు ఆమోదం తెలిపారు.

Read more about: railways
English summary

రూ. 27 వేల కోట్ల విలువైన ప్రాజెక్టుల‌కు ఆమోదం | Cabinet nod for Rs.27,000 cr. roads and railways projects

The Centre gave its green signal for investments worth more than Rs.27,000 crore in new highways and railway lines across the country to boost economic growth.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X