For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఎల్ఐసీ ప్రీమియంను చెల్లించేందుకు ఉన్న 8 మార్గాలు

|

ఎల్ఐసీ ప్రీమియం చెల్లించాలంటే మొద‌ట్లో ఎల్ఐసీ కార్యాల‌యానికి వెళ్లి స‌మ‌యం వెచ్చిస్తేనే ప‌న‌య్యేది. ఇప్పుడు ఆ వ‌రుస‌లో నిలుచునే ప‌నే లేదు. ఆన్‌లైన్ రాక‌తో అంతా సుల‌భం అయిపోయింది. దేశంలో అత్య‌ధిక ప్ర‌జ‌ల అభిమానాన్ని చూర‌గొన్న ఎల్ఐసీ జీవిత బీమా పాల‌సీల‌కు కేరాఫ్‌గా నిలుస్తోంది. క్లెయింల విష‌యంలో సైతం ఎల్ఐసీ అగ్ర స్థానంలో కొన‌సాగుతోంది. ప్ర‌తి వ్య‌క్తి అవ‌స‌రాల‌కు ఆధారంగా ర‌క‌ర‌కాల పాల‌సీల‌ను కంపెనీ ప్ర‌వేశ‌పెడుతోంది. సీనియ‌ర్ సిటిజ‌న్స్‌, పిల్ల‌ల కోసం ప్ర‌త్యేక‌మైన పాల‌సీల‌ను ఎల్ఐసీ తీసుకువ‌స్తోంది. చాలా మంది ఇళ్ల‌ల్లో క‌నీసం ఒక ఎల్ఐసీ పాల‌సీ అయినా ఉంటోంది. ఈ క్ర‌మంలో పాల‌సీ ప్రీమియం చెల్లించేందుకు ఉన్న మార్గాల‌ను తెలుసుకుంటే ఉప‌యోగ‌క‌రం. ఈ కింది 8 మార్గాల్లో ఎల్ఐసీ ప్రీమియంల‌ను చెల్లించ‌వ‌చ్చు.

1. ఎల్ఐసీ మొబైల్ యాప్‌

1. ఎల్ఐసీ మొబైల్ యాప్‌

పాల‌సీదార్లు ఎల్ఐసీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవ‌డం ద్వారా నేరుగా యాప్‌లోనే చెల్లింపులు చేయ‌వ‌చ్చు. బ్రౌజ‌ర్ ఆధారంగా వ‌ర్ష‌న్లు ఉన్నాయి. అదే విధంగా ప్లాన్ల‌ను చెక్ చేసుకోవ‌డంతో పాటు, ప్రీమియంల‌ను సైతం లెక్కించుకోవ‌చ్చు.

2. ఈసీఎస్‌

2. ఈసీఎస్‌

ఈసీఎస్ మ్యాండేట్ స‌మ‌ర్పించి సైతం పాల‌సీ ప్రీమియంను చెల్లించ‌వ‌చ్చు. ఇందుకోసం ఎల్ఐసీ కార్యాల‌యం లేదా బ్యాంకు కార్యాల‌యాల వ‌ద్ద ఈసీఎస్ మ్యాండేట్‌ను తీసుకుని పూరించి ఇవ్వాలి. ఒక‌సారి ఈసీఎస్ సౌక‌ర్యం మొద‌లైతే మ‌ళ్లీ మీరు ఈసీఎస్‌ను ర‌ద్దు చేసేవ‌ర‌కూ మీ ఖాతా నుంచి నేరుగా ప్రీమియం మిన‌హాయిస్తూ ఉంటారు.

3. ఏటీఎమ్‌

3. ఏటీఎమ్‌

యాక్సిస్‌, కార్పొరేష‌న్ బ్యాంకు స‌హా కొన్ని బ్యాంకులు ఏటీఎమ్ ద్వారా సైతం ప్రీమియంను చెల్లించే స‌దుపాయాన్ని ప్రారంభించాయి. ఇందుకోసం మొద‌టిసారి న‌మోదు చేసుకోవాలి. సంబంధిత బ్యాంకును సంప్ర‌దించి దీని గురించి తెలుసుకోవ‌చ్చు.

4. ప్రీమియం పాయింట్ అండ్ లైఫ్ ప్ల‌స్ కేంద్రాలు

4. ప్రీమియం పాయింట్ అండ్ లైఫ్ ప్ల‌స్ కేంద్రాలు

చెల్లింపుల‌ను ఆన్‌లైన్‌లో చేయ‌లేని వారి కోసం కొన్ని చోట్ల ప్రీమియం చెల్లింపు కేంద్రాల‌ను ఏర్పాటు చేశారు. పాల‌సీదార్లు ఇక్క‌డకు వెళ్లి న‌గ‌దు లేదా చెక్కు రూపంలో చెల్లింపుల‌ను చేయ‌వ‌చ్చు.

5. నెట్ బ్యాంకింగ్‌

5. నెట్ బ్యాంకింగ్‌

నెట్ బ్యాంకింగ్ ద్వారా సైతం ప్రీమియంను క్ష‌ణాల్లో చెల్లించవ‌చ్చు. అయితే పాల‌సీ తీసుకునేట‌ప్పుడు ఆ సౌక‌ర్యానికి న‌మోదు చేసుకున్న‌వారికి మాత్ర‌మే ఈ మార్గంలో చెల్లించే అవ‌కాశ‌మిస్తున్నారు. ప్ర‌స్తుతం ఎల్ఐసీ వెబ్‌సైట్‌లో న‌మోదు చేసుకోని వారికి సైతం చెల్లించే స‌దుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు.

ఎల్ఐసీ ప్రీమియం ఆన్‌లైన్ చెల్లింపు

6. బిల్‌పే లేదా ఈబీపీపీ

6. బిల్‌పే లేదా ఈబీపీపీ

అన్ని బ్యాంకులు ఈ స‌దుపాయాన్ని క‌ల్పించ‌డం లేదు. కార్పొరేష‌న్ బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంకు, సిటీ బ్యాంకు, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, యాక్సిస్ బ్యాంకు, ఫెడ‌ర‌ల్ బ్యాంకు వంటి మొద‌లైన బ్యాంకులు ఆన్‌లైన్‌లో న‌మోదు చేసుకున్న వారికి ఈ ప‌ద్ద‌తిలో చెల్లింపులు చేసేందుకు వీలు క‌ల్పిస్తున్నాయి. బ్యాంకు లేదా ఎల్ఐసీ కార్యాల‌యంలో ఒక ఫారంను పూరించి ఈ సౌక‌ర్యం కోసం అభ్య‌ర్థించ‌వ‌చ్చు.

7. సీనియ‌ర్ బిజినెస్ అసోసియేట్

7. సీనియ‌ర్ బిజినెస్ అసోసియేట్

కొంత మంది సీనియ‌ర్ డెవ‌లెప్‌మెంట్ ఆఫీస‌ర్ల‌కు ప్రీమియం క‌ట్టించుకునేందుకు అనుమ‌తించారు. వీరి వ‌ద్ద న‌గ‌దు లేదా చెక్కు రూపంలో ప్రీమియంను చెల్లించ‌వ‌చ్చు. అవుట్‌స్టేష‌న్ చెక్కుల‌ను అందించేందుకు వీలు కాదు.

8. ఫ్రాంచైజీస్‌

8. ఫ్రాంచైజీస్‌

ఏపీఆన్‌లైన్‌, ఎంపీ ఆన్‌లైన్, సువిధ లేదా వినియోగ‌దారు సేవా కేంద్రాల‌కు వెళ్లి సైతం ప్రీమియంను సులువుగా చెల్లించ‌వ‌చ్చు. ఇక్క‌డ చెల్లింపుల‌ను న‌గ‌దు రూపంలో అనుమ‌తిస్తారు. చెల్లింపు తేదీకి 30 రోజుల ముందు నుంచి గ‌డువు తేదీ వ‌ర‌కూ మాత్ర‌మే చెల్లింపుల‌కు అవ‌కాశం క‌ల్పిస్తారు.

English summary

ఎల్ఐసీ ప్రీమియంను చెల్లించేందుకు ఉన్న 8 మార్గాలు | Ways to pay LIC premium

No more standing in que or dropping check to make LIC premium payments. Life Insurance Corporation of India is one of the oldest insurance company in India and also the most trusted among investors
Story first published: Friday, August 19, 2016, 10:47 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X