For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ప్ర‌పంచ సంప‌న్నుల హాబీలేంటి?

|

అహ‌ర్నిశలు సంప‌ద పోగేసి బిలియ‌నీర్లు అవుతారు. అయితే దీన్ని నిల‌బెట్టుకోవ‌డానికి ప్ర‌తి నిమిషం అప్ర‌మ‌త్తంగా ఉండాలి. అయితే అలాగ‌ని వారు స‌రాదాల‌కు దూరంగా ఉండ‌రు. వారి హాబీల ద్వారా ప‌నితీరును మెరుగుప‌రుచుకుంటున్న‌వారు ఎంద‌రో ఉన్నారు. అయితే చాలా మంది పుస్త‌కాలు చ‌ద‌వ‌డం ద్వారా ఎక్కువ మంది సంతృప్తిని పొందుతార‌ని భావిస్తారు. అయితే బిలియ‌నీర్ల తీరు ఇందుకు భిన్నంగా ఉంది.
వెల్త్ ఎక్స్ అధ్య‌యనం ప్ర‌కారం గ‌తేడాది బిలియ‌నీర్ల సంఖ్య ప్ర‌పంచ‌వ్యాప్తంగా 2473 కు పెరిగింది. మొత్తం అంద‌రీ సంపద క‌లిపి 7.7ట్రిలియ‌న్స్‌కు పెరిగింది. అధ్య‌య‌నం ప్రకారం మొత్తం ప్ర‌పంచ సంప‌ద‌లో వీరి వ‌ద్దే 3.9 శాతం ఉంది. వీరంద‌రిలోకి ఉన్న ఉమ్మ‌డి ల‌క్ష‌ణం వ్య‌వ‌స్థాప‌క‌త‌. వెల్త్ఎక్స్ విశ్లేష‌ణ ఆధారంగా చూస్తే 87 శాతం మంది వారు సొంత‌గా క‌ష్ట‌ప‌డి సాధించుకున్న సంప‌దే ఎక్కువ‌. అలా సంపాద‌న బాట‌లో ఉన్న వారంతా ఏమి చేస్తారో తెలుసుకోవాలంటే ఈ కింద వివ‌రాల‌ను చ‌ద‌వండి.

 సంప‌న్నుల అభిరుచులు

సంప‌న్నుల అభిరుచులు

ఈ వెల్త్ ఎక్స్ అధ్య‌య‌నంలో కేవ‌లం సంప‌ద గురించే కాకుండా వారి అల‌వాట్లు, హాబీల గురించి సైతం చ‌ర్చించారు. మొత్తానికి అంద‌రిలో ఎక్కువ శాతం మంది స‌మాజ సేవ‌కు మొగ్గుచూపుతున్న‌ట్లు తేలింది. స‌గం కంటే ఎక్కువ శాతం(56%) బిలియ‌నీర్లు సామాజిక సేవా కార్య‌క్ర‌మాల్లో చురుగ్గా పాల్గొంటుండ‌టం మంచి విష‌యం.

 సంప‌న్నుల అభిరుచులు

సంప‌న్నుల అభిరుచులు

బిల్‌గేట్స్‌, వారెన్ బ‌ఫెట్ చేస్తున్న కృషిని గూర్చి ప్ర‌పంచ‌మంతా చర్చిస్తుండ‌టం మూలంగా ఈ సేవ‌లు చేయ‌డానికి ఎక్కువ మంది మొగ్గుచూపుతూ ఉండొచ్చ‌ని అధ్య‌య‌నం పేర్కొంది. ఈ సామాజిక సేవ‌ల‌ను ప‌క్క‌న పెడితే త‌ర్వాతి స్థానాల్లో ట్రావెల్‌, క‌ళ‌లు, ఫ్యాష‌న్‌, స్టైల్ వంటివి ఉన్నాయి.

 సంప‌న్నుల అభిరుచులు

సంప‌న్నుల అభిరుచులు

సామాజిక సేవ‌ల కార్య‌క్ర‌మాల‌కు అత్య‌ధికంగా 56.3 శాతం మొగ్గుచూపుతుండ‌గా, స్కైయింగ్‌కు అతి త‌క్కువ‌గా 7.2 శాతం, దాని త‌ర్వాత స్థానంలో వాచీల కొనుగోలు(7.7%), ఫిషింగ్‌(7.8%) వైపు ఆస‌క్తి క‌లిగి ఉన్న‌ట్లుగా తెలుస్తోంది.

 సంప‌న్నుల అభిరుచులు

సంప‌న్నుల అభిరుచులు

మొత్తం బిలియ‌నీర్లలో ప్ర‌యాణాల‌వైపు 31.0 శాతం, క‌ళ‌ల వైపు 28.7 శాతం మంది మొగ్గుచూపుతుండ‌గా, ఫ్యాష‌న్ అండ్ స్టైల్ అంశంలో సైతం 25.2 శాతం మంది ఆస‌క్తిని క‌న‌బ‌రుస్తున్న‌ట్లు వెల్ల‌డయ్యింది.

 సంప‌న్నుల అభిరుచులు

సంప‌న్నుల అభిరుచులు

రాజ‌కీయాల్లో 22.2%, వైన్‌,స్పిరిట్‌ల్లో 15.9%, బోటింగ్‌లో 14.9%, ఆరోగ్యం, వ్యాయామ కార్య‌క‌లాపాల్లో 14.8%, ఆటోమొబైల్స్‌లో 14.8% మంది త‌మ అభిరుచిని క‌లిగి ఉండ‌గా, వ‌స్తు సేక‌ర‌ణ హాబీగా క‌లిగిన వారు 14.1 శాతం ఉన్న‌ట్లు అధ్య‌య‌నం పేర్కొంది.

 సంప‌న్నుల అభిరుచులు

సంప‌న్నుల అభిరుచులు

ఫుట్‌బాల్ లేదా సాక‌ర్ ఆటను 13.1 శాతం మంది ఆడేందుకు ఇష్ట‌ప‌డుతుండగా, పుస్త‌కాలు చ‌దివేందుకు 12.3% మంది త‌మ ఆస‌క్తిని వెలిబుచ్చుతున్నారు. సాంస్కృతిక కార్య‌క్రమాల వైపు 12.1% మందికి మ‌న‌సు మ‌ళ్ల‌గా, గోల్ప్ క్రీడ ఆడ‌టానికి 11.0% మంది స‌మ‌యం వెచ్చిస్తున్న‌ట్లు తెలుస్తోంది.

 సంప‌న్నుల అభిరుచులు

సంప‌న్నుల అభిరుచులు

హంటింగ్‌(వేట‌) హాబీగా క‌లిగిన వారు 8.8% మంది, ఆభ‌ర‌ణాలపై మోజు 8.1% మంది, ఫిషింగ్ అల‌వాటు ఉన్న‌వారు 7.8% ఉన్న‌ట్లు అధ్య‌య‌నం వెల్ల‌డించింది.

English summary

ప్ర‌పంచ సంప‌న్నుల హాబీలేంటి? | billionaires hobbies in the free time

The global billionaire population last year rose to a record 2,473, according to a study by wealth consulting firm Wealth-X. The combined wealth of the world's billionaires increased to $7.7 trillion, also a record
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X