For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

జీఎస్‌టీ అమ‌లు వల్ల ఏపీకి రూ. 4700 కోట్ల న‌ష్టం

|

జీఎస్‌టీ అమ‌లు చేయ‌డం వ‌ల్ల ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రానికి ఏటా రూ. 4700 కోట్ల న‌ష్టం వాటిల్లుతుంద‌ని ఆర్థిక మంత్రి య‌న‌మ‌ల రామ‌కృష్ణుడు మీడియాకు వెల్ల‌డించారు. ఈ మేర‌కు కేంద్ర ప్ర‌భుత్వం రూ. 23,500 కోట్ల‌ను న‌ష్ట‌ప‌రిహారం కింద చెల్లించాల్సి ఉంటుంద‌ని ఆయ‌న తెలిపారు. జీఎస్‌టీ వ‌ల్ల రాష్ట్ర ప్ర‌భుత్వాల‌కు జ‌రిగే అన్యాయానికి కేంద్రం బాధ్య‌త వ‌హించాల్సి ఉంటుంద‌న్నారు.

జీఎస్‌టీ కౌన్సిల్ విష‌య‌మై కేంద్రం గురించి ప‌లు వ్యాఖ్య‌లు చేశారు. జీఎస్‌టీ కౌన్సిల్‌లో కేంద్ర ఆర్థిక మంత్రి ఆధ్వ‌ర్యంలో రాష్ట్ర ప్ర‌భుత్వాల‌కు స‌భ్య‌త్వం ఉన్న‌ప్ప‌టికీ కేంద్ర ఆధిప‌త్యాన్ని వీటో చేయ‌డానికి ఉండ‌ద‌ని య‌న‌మ‌ల అన్నారు. విభ‌జ‌న నేప‌థ్యంలో రాష్ట్రం గురించి కేంద్రం ప‌ట్టించుకోవాల్సి ఉంద‌ని, జీఎస్‌టీ అమ‌లుకు సంబంధించి ఎటువంటి స‌మ‌స్య‌లు ఉన్నా కేంద్రం వాటిని తీర్చాలని కోరారు.

జీఎస్‌టీ అమ‌లు వల్ల ఏపీకి రూ. 4700 కోట్ల న‌ష్టం

అయితే రాజ్యాంగ స‌వ‌ర‌ణ బిల్లును ఆయ‌న స్వాగ‌తించారు. దేశ విశాల ప్ర‌యోజ‌నాల కోసం తెలుగుదేశం పార్టీతో పాటు చాలా పార్టీలు దానికి మ‌ద్ద‌తుగా నిలిచాయ‌న్నారు. టీడీపీ ఎప్పుడూ ప‌న్ను సంస్క‌ర‌ణ‌కు మ‌ద్ద‌తు తెలిపింద‌ని చెప్పుకొచ్చారు. ఏక‌రీతి ప‌న్ను వ్య‌వ‌స్థ కేంద్రం, రాష్ట్రాల‌కు మంచిదేన‌న్నారు. జీఎస్‌టీ అమ‌లు వ‌ల్ల వ‌స్తువుల‌పై ప‌న్ను త‌గ్గి, సేవ‌ల‌పై ప‌న్ను పెర‌గ‌గ‌ల‌ద‌ని ఆయ‌న భావిస్తున్న‌ట్లు చెప్పారు.

Read more about: gst జీఎస్‌టీ
English summary

జీఎస్‌టీ అమ‌లు వల్ల ఏపీకి రూ. 4700 కోట్ల న‌ష్టం | Andhra loss 4700 crore because of GST

Andhra Pradesh will suffer a loss of Rs 4,700 crore every year on account of implementation of Goods and Services (GST) tax, state Finance Minister Y. Ramakrishnudu said on Thursday. He said the central government should compensate the state to the tune of Rs 23,500 crore for five years, adding it was the central government's responsibility to ensure that injustice was not done to states due to the GST.
Story first published: Friday, August 5, 2016, 12:41 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X