For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

క్ర‌మమైన ఆదాయానికి 10 ర‌కాల పెట్టుబ‌డులు

నెల‌వారీ వేత‌నం వ‌చ్చే వారు కాకుండా మిగిలిన వారు ఖ‌ర్చుల గురించి ప్ర‌ణాళిక‌తో వ్య‌వ‌హ‌రించ‌డం కొంచెం క‌ష్టం. కొన్ని క‌చ్చిత‌మైన తేదీల్లో చెల్లించాల్సిన వాటిని గురించి క్ర‌మ‌మైన ఆదాయం ఉండ‌టం ఎవ‌రికైనా

|

నెల‌వారీ వేత‌నం వ‌చ్చే వారు కాకుండా మిగిలిన వారు ఖ‌ర్చుల గురించి ప్ర‌ణాళిక‌తో వ్య‌వ‌హ‌రించ‌డం కొంచెం క‌ష్టం. కొన్ని క‌చ్చిత‌మైన తేదీల్లో చెల్లించాల్సిన వాటిని గురించి క్ర‌మ‌మైన ఆదాయం ఉండ‌టం ఎవ‌రికైనా ముఖ్య‌మే. స్వ‌యం ఉపాధి, వ్యాపార వ‌ర్గాల వారు ఈ విధ‌మైన ఆదాయం రాబ‌ట్టుకోవ‌డం కొంచెం క‌ష్ట‌మే.
వేత‌న జీవులైనా స‌రే స‌రిగా నిర్వ‌హించుకోక‌పోతే ఆర్థిక ప్ర‌ణాళిక క‌ష్ట‌మే. ప్ర‌స్తుతం ఎక్కువ మంది ప్రైవేటు ఉద్యోగాల‌కు మొగ్గుచూపుతూ ఉన్న‌తి కోసం ఉద్యోగాలు త్వ‌ర‌త్వ‌ర‌గా మారుతున్న ఈ రోజుల్లో పొదుపు, పెట్టుబ‌డులు ప్ర‌తి ఒక్క‌రికీ ముఖ్య‌మైపోయాయి.
ఈ క్ర‌మంలో నెల‌వారీ క్ర‌మ‌మైన ఆదాయాన్ని పొందేందుకు ప‌నికొచ్చే 10 ఉత్త‌మ పెట్టుబ‌డి మార్గాలు

1. మ్యూచువ‌ల్ ఫండ్స్ మంత్లీ ఇన్‌క‌మ్ ప్లాన్‌

1. మ్యూచువ‌ల్ ఫండ్స్ మంత్లీ ఇన్‌క‌మ్ ప్లాన్‌

పెట్టుబ‌డిదారుల సౌల‌భ్యం కోసం మ్యూచువ‌ల్ ఫండ్ సంస్థ‌లు నెల‌వారీ ఆదాయాన్ని ఇచ్చే విధంగా మంత్లీ ఇన్‌క‌మ్ ప్లాన్ల‌ను ప్ర‌వేశ‌పెడుతున్నాయి. క్ర‌మంగా ఆదాయం కావాల‌నుకునే వారికి ఈ మార్గం ఉత్త‌మం. రాబ‌డులు, భ‌ద్ర‌త అంశాల‌ను దృష్టిలో పెట్టుకుని చూసిన‌ప్పుడు హైబ్రిడ్ ఫండ్లు, డెట్ ఫండ్లు వంటి వివిధ రకాల ప్లాన్లు ఉన్నాయి.

2. సీనియ‌ర్ సిటిజ‌న్ సేవింగ్ స్కీమ్స్‌

2. సీనియ‌ర్ సిటిజ‌న్ సేవింగ్ స్కీమ్స్‌

పోస్టాఫీసుల‌తో పాటు కొన్ని బ్యాంకులు సీనియ‌ర్ సిటిజ‌న్స్ కోసం ప్ర‌త్యేక ప‌థ‌కాల‌ను ప్ర‌వేశ‌పెడుతున్నాయి. మెచ్యూరిటీ కాల‌ప‌రిమితి 5 ఏళ్లుగాను, వ‌డ్డీలు 8.5 నుంచి 9 శాతం మ‌ధ్య ఉంటున్నాయి. ఈ ర‌క‌మైన పెట్టుబ‌డులు చేయాల‌నుకునేవారు త‌మ పేరు మీద ఒక ఖాతాను లేదా జీవిత భాగ‌స్వామితో క‌లిసి మ‌రో ఖాతాను తెర‌వ‌డానికి ఆస్కారం ఉంది.

3. బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్లు

3. బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్లు

త‌క్కువ రిస్క్ తీసుకోవాల‌ని భావించేవారు ఎక్కువ వ‌డ్డీ వ‌చ్చే ఫిక్స్‌డ్ డిపాజిట్ల‌లో పెట్టుబ‌డులు పెట్ట‌డానికి ప్ర‌య‌త్నించ‌వ‌చ్చు. అలాగే నెల‌వారీ వ‌డ్డీ చెల్లించే ఆప్ష‌న్‌ను ఎంచుకోవాలి. మ‌న అనుకూల‌త‌ను బ‌ట్టి నెల‌వారీ, త్రైమాసికానికి ఒక‌సారి, లేదా వ‌డ్డీని సైతం తిరిగి పెట్టుబ‌డి పెట్టే ఆప్ష‌న్ల‌ను ఎంచుకోవ‌చ్చు.

 4.మ్యూచువ‌ల్ ఫండ్స్ నుంచి సిస్ట‌మ్యాటిక్ విత్‌డ్రాయ‌ల్ ప్లాన్‌

4.మ్యూచువ‌ల్ ఫండ్స్ నుంచి సిస్ట‌మ్యాటిక్ విత్‌డ్రాయ‌ల్ ప్లాన్‌

తాము పెట్టుబ‌డి పెట్టిన ప‌థ‌కాల నుంచి వ్య‌క్తులెవ‌రైనా నిర్ణీత మొత్తాల‌ను లేదా త‌మ‌కు కావాల్సినంత డ‌బ్బును విత్ డ్రా చేసుకునేందుకు వీలుగా సిస్ట‌మ్యాటిక్ విత్‌డ్రాయ‌ల్ ప్లాన్లు అవ‌కాశం క‌ల్పిస్తాయి. నెల‌వారీ, త్రైమాసికానికి ఒక‌సారి, ఆరు నెల‌ల‌కోసారి, సంవ‌త్సరానికి ఒక‌సారి తీసుకునే ఆప్ష‌న్లు ఉంటాయి.

5. మ్యూచువ‌ల్ ఫండ్స్ డివిడెండ్లు

5. మ్యూచువ‌ల్ ఫండ్స్ డివిడెండ్లు

క్ర‌మంగా డివిడెండ్ల‌ను ప్ర‌క‌టించే మ్యూచువ‌ల్ ఫండ్ల‌లో సైతం పెట్టుబ‌డి పెట్టొచ్చు. చాలా ఈక్విటీ ఫండ్లు క్ర‌మంగా డివిడెండ్ల‌ను ప్ర‌క‌టిస్తూ ఉంటాయి. అయితే ఎక్కువ‌గా ఇవి సంవ‌త్స‌రానికి ఒక‌సారి డివిడెండ్ల‌ను జారీ చేస్తాయి. ఎక్కువ రాబ‌డులు రాబ‌డులు రావాల‌నుకుని, రిస్క్ తీసుకునేందుకు సిద్దంగా ఉంటే ఈక్విటీ ఫండ్లు బాగా ఉంటాయి. ఈక్విటీ మ్యూచువ‌ల్ ఫండ్లు ఏడాదికి ఒక‌సారి డివిడెండ్ల‌ను ప్ర‌క‌టిస్తాయి. అయితే క్ర‌మంగా ఆదాయాన్ని మాత్రం అందుకోవ‌చ్చు. ఫండ్ల‌ను ఎంచుకునేట‌ప్పుడు చాలా జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హరించాలి.

 మంత్లీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు

మంత్లీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు

చాలా మంది పెట్టుబ‌డిదార్లు నెల‌వారీ ఆదాయం వ‌చ్చేందుకు మొగ్గుచూపుతారు. ప‌ద‌వీ విర‌మ‌ణ చేసిన వారు ఈ కోవ‌లో ఎక్కువ‌గా ఉంటారు. అయితే నెల‌వారీ ఉత్త‌మ వ‌డ్డీ రేట్లు అందించే మంచి ఫిక్స్‌డ్ డిపాజిట్ల కోసం అంద‌రూ వెతుకుతుంటారు. నెల‌వారీ ఫిక్స్‌డ్ డిపాజిట్ల కోసం చూసేట‌ప్పుడు వాటిపై వ‌చ్చే వ‌డ్డీకి ఒక ప‌రిమితి త‌ర్వాత ప‌న్ను ఉంటుంద‌ని గుర్తుంచుకోవాలి. కంపెనీ ఫిక్స్‌డ్ డిపాజిట్ల విషయంలో వ‌డ్డీ ఆదాయం రూ. 5 వేల‌కు మించితే టీడీఎస్ మిన‌హాయిస్తారు. బ్యాంకు డిపాజిట్ల‌కు వ‌చ్చే వ‌డ్డీ రూ. 10 వేలు మించిన‌ప్పుడే టీడీఎస్ మిన‌హాయిస్తారు.

7. స్థిరాస్తి

7. స్థిరాస్తి

డ‌బ్బు ఎక్కువ‌గా ఉంది అనుకున్న‌ప్పుడు చాలా మంది స్థిరాస్తి వైపు మొగ్గుచూపుతారు. దీర్ఘ‌కాలాన్ని దృష్టిలో పెట్టుకుని చూస్తే ఇది ఒక విధంగా మంచిదే. దాని ద్వారా అద్దె క‌ట్ట‌కుండా సొంత ఇంట్లో ఉండొచ్చు. లేదా మ‌నం ఆ స్థలం లేదా ఇంటిని వేరేవారికి అద్దెకు ఇవ్వ‌డం ద్వారా క్ర‌మంగా ఆదాయాన్ని రాబ‌ట్టుకోవ‌చ్చు. మామూలుగా అద్దెకు ఇచ్చేట‌ప్పుడు కొంత అడ్వాన్సు తీసుకుంటారు. లీజింగ్ లేదా ఎక్కువ కాలం ఒక‌రికే అద్దెకు ఇస్తున్న‌ప్పుడు తీసుకునే సెక్యూరిటీ డిపాజిట్‌ను సైతం ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయ‌డం సూచ‌నీయం.

 8. పోస్టాఫీసు నెల‌వారీ ఆదాయ ప‌థ‌కం

8. పోస్టాఫీసు నెల‌వారీ ఆదాయ ప‌థ‌కం

ఒక్కో వ్య‌క్తి గ‌రిష్టంగా రూ.4.5 ల‌క్ష‌ల వ‌ర‌కూ పోస్టాఫీసు నెల‌వారీ ఆదాయ ప‌థ‌కంలో పెట్టుబ‌డి పెట్టొచ్చు. అదే ఉమ్మ‌డి ఖాతా అయితే రూ. 9 ల‌క్ష‌ల వ‌ర‌కూ. ఈ ప‌థ‌కంలో పెట్టుబ‌డి కాల‌ప‌రిమితి 5 సంవ‌త్స‌రాలు.

ప్ర‌స్తుతం వార్షిక‌ వ‌డ్డీ 7.80శాతంగా ఉంది. నెల‌వారీ చెల్లింపులు జ‌రుగుతాయి.

9. దీర్ఘకాల ప్ర‌భుత్వ బాండ్లు

9. దీర్ఘకాల ప్ర‌భుత్వ బాండ్లు

బాగా డ‌బ్బు ఉండి రిస్క్ పెట్టుబ‌డులు పెట్ట‌లేని వారికి దీర్ఘ‌కాల బాండ్లు మంచి ఆప్ష‌న్‌. సంవ‌త్స‌రానికి ఈ బాండ్లు సాధార‌ణంగా 8 శాతం వ‌డ్డీనిస్తాయి. ఇవి దీర్ఘ‌కాలం పాటు పెట్టుబ‌డుల‌ను క‌లిగి ఉండి చివ‌ర్లో అస‌లును తిరిగి వెన‌క్కిస్తాయి. ఈ బాండ్ల‌ను సెకండ‌రీ మార్కెట్లో ట్రేడ్ చేయ‌వ‌చ్చు. కాబ‌ట్టి మ‌ధ్య‌లో వ‌ద్ద‌నుకుంటే అమ్మి వేయ‌వ‌చ్చు. మ‌నం నేరుగా ప్ర‌భుత్వ బాండ్ల‌లో పెట్టుబ‌డులు పెట్ట‌లేం. పెద్ద పెద్ద కంపెనీలు ప్ర‌భుత్వ బాండ్ల‌ను కొంటాయి. వాటిల్లో మ‌నం డెట్ ఫండ్ల‌ను కొన‌డం ద్వారా ప‌రోక్షంగా ఇన్వెస్ట్ చేయ‌వ‌చ్చు.

10. బీమా కంపెనీల యాన్యుటీలు

10. బీమా కంపెనీల యాన్యుటీలు

క్ర‌మమైన ఆదాయాన్ని పొందేందుకు ఇన్సూరెన్స్ కంపెనీల యాన్యుటీ ప్లాన్లు మ‌రో మార్గం. అయితే రాబ‌డి వ‌చ్చేందుకు ఇవి కొంత స‌మ‌యం తీసుకుంటాయి. ఈ ప్లాన్ల‌పై వ‌చ్చే రాబ‌డులు మీరు ఎంచుకునే పింఛ‌ను కాల‌ప‌రిమితి, ఉత్ప‌త్తిని ఎంచుకునేట‌ప్పుడు మ‌నం ఎంచుకున్న ఆప్ష‌న్‌ను బ‌ట్టి ఉంటాయి. అయితే ఈ మార్గాన్ని చివ‌రి అవ‌కాశంగానే చూడాలి. మొద‌టే యాన్యుటీల దిశ‌గా ఆలోచించ‌వ‌ద్దు.

Read more about: investments salary
English summary

క్ర‌మమైన ఆదాయానికి 10 ర‌కాల పెట్టుబ‌డులు | 10 best regular income schemes in India

Many self employees, business persons confuse where to invest money. They will suffer because of not having regular income. Everyone have to pay certain bills in the first week of the month itself. To help these kind of people here we have given 10 best regular income schemes
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X