For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బీమా పాలసీల‌ను ఎల‌క్ట్రానిక్ రూపంలోకి ఎందుకు మార్చుకోవాలంటే?

|

ఇల్లు మారేట‌ప్పుడు, ప్ర‌యాణాల్లో ముఖ్య‌మైన ప‌త్రాల‌ను ఎవ‌రైనా పోగొట్టుకున్న సంఘ‌ట‌న‌ల‌ను వింటూ ఉంటాం. అలాంటి స‌మ‌యాల్లో బీమా పాల‌సీ ప‌త్రం పోతే మ‌ళ్లీ ప్ర‌యాస ప‌డాల్సి వ‌స్తుంది. పాల‌సీ తీసుకునే ఉద్దేశం వార‌సుల‌కు ఆర్థిక ఇబ్బందులు రాకూడ‌ద‌ని. పాల‌సీ ప‌త్రం లేక‌పోతే క్లెయింకు ఇబ్బందులు త‌ప్ప‌వు. అందుకే ఎల‌క్ట్రానిక్ రూపంలో పాల‌సీని మార్చుకుంటే ఈ బాధ‌ల‌న్నీ ఉండ‌వు. ఇక్క‌డ ఎల‌క్ట్రానిక్ రూపంలో అంటే డీమ్యాట్ అని భావించాలి.

 పాల‌సీ దొంగ‌త‌నం:

పాల‌సీ దొంగ‌త‌నం:

పాల‌సీ ప‌త్రాన్ని ఎవ‌రైనా దొంగ‌త‌నం చేసే అవ‌కాశం ఉంది. డూప్లికేట్ పాల‌సీ పొందాలంటే ఒక ప‌ద్ద‌తి ఉంటుంది. అందుకోసం మొద‌ట పోలీసుల‌కు ఫిర్యాదు చేయాలి.

అదే పాల‌సీని ఎల‌క్ట్రానిక్ రూపంలో ఉంచుకుంటే ఈ ఇబ్బంది ఉండ‌దు.

పోగొట్టుకోవ‌డం:

పోగొట్టుకోవ‌డం:

పాల‌సీ ప‌త్రం పాత‌దై చిరిగిపోవ‌డం, నీళ్ల‌లో ప‌డి త‌డిచిపోవ‌డం వంటి అవ‌కాశాల‌ను కొట్టిపారేయ‌లేం. ఒక్కోసారి ఎక్క‌డో పెట్టామో గుర్తు ఉండ‌క పాల‌సీ ప‌త్రం పోయింద‌ని కంగారు ప‌డుతుంటాం. ఎల‌క్ట్రానిక్ రూపంలో ఉన్న వాటికి భ‌ద్ర‌త ఉంటుంది.

 ఉచితం :

ఉచితం :

ఇన్సూరెన్స్ రిపాజిట‌రీలైన క‌ర్వీ, సీఎస్‌డీఎల్‌, క్యామ్స్ వంటి సంస్థ‌లు ఎల‌క్ట్రానిక్ రూపంలో భ‌ద్ర‌ప‌రుచుకునే సౌక‌ర్యాన్ని ఉచితంగా అంద‌జేస్తున్నాయి.

 సుల‌భత‌ర‌ విధానం:

సుల‌భత‌ర‌ విధానం:

పాల‌సీని తీసుకునేట‌ప్పుడు ఎంచుకునే ఆప్ష‌న్‌లో డీమ్యాట్ ఫార్మ‌ట్‌ను ఎంచుకోవాలి. డాక్యుమెంట్లు, పాల‌సీ కొనుగోలు విధానం అన్నీ మామూలుగానే చేయాలి. కాక‌పోతే మీ స‌ర్టిఫికెట్ ఎల‌క్ట్రానిక్ రూపంలో పొందే వీలుంటుంది.

 ఎక్కువ పాల‌సీల‌ను భ‌ద్ర‌ప‌ర‌చ‌వ‌చ్చు:

ఎక్కువ పాల‌సీల‌ను భ‌ద్ర‌ప‌ర‌చ‌వ‌చ్చు:

ఈ విధంగా ఎల‌క్ట్రానిక్ రూపంలో ఎక్కువ పాల‌సీల‌ను భ‌ద్ర‌ప‌రుచుకునే స‌దుపాయం ఉంటుంది. దీంతో ఏ ఏ పాల‌సీలు కొన్నామో గుర్తుంచుకుంటే వాటి నంబ‌ర్ల‌ను ఆన్‌లైన్‌లోనే చూసుకోవ‌చ్చు. అన్ని పాల‌సీల‌ను ఎప్పుడు కావాలంటే అప్పుడు చూసే వీలుంటుంది.

పాల‌సీ కేర్‌టేక‌ర్‌ను నియ‌మించుకునే వీలు:

పాల‌సీ కేర్‌టేక‌ర్‌ను నియ‌మించుకునే వీలు:

మీ పాల‌సీల‌కు సంబంధించి కేర్ టేక‌ర్‌ను నియ‌మించుకోవ‌చ్చు. ఒక‌వేళ పాల‌సీదారు మ‌ర‌ణిస్తే కేర్‌టేక‌ర్ నామినీకి విష‌యాన్ని చేర‌వేస్తారు. నామినీలు క్లెయిం చేసుకోవ‌చ్చు. ఒక్కోసారి పాల‌సీల‌ను ఎవ‌రూ క్లెయిం చేసేవారు లేర‌ని చెబుతున్న సంఘ‌ట‌న‌లు ఆశ్చ‌ర్యాన్ని క‌లిగిస్తాయి. అందువ‌ల్లే ఈ విధానాన్ని ఉప‌యోగించి ఆ ప్ర‌మాదం నుండి బ‌య‌ట‌ప‌డండి.

 పాల‌సీ మెచ్యూర్ అయితే గుర్తు చేస్తారు

పాల‌సీ మెచ్యూర్ అయితే గుర్తు చేస్తారు

పాల‌సీల తేదీ ముగిసేట‌ప్పుడు ఆన్‌లైన్‌లో మీకు తెలియ‌ప‌రుస్తారు. దీంతో సౌక‌ర్య‌వంతంగా, సులువుగా ఉంటుంది.

 నెట్ సౌక‌ర్యం ఉంటే ఎక్క‌డైనా:

నెట్ సౌక‌ర్యం ఉంటే ఎక్క‌డైనా:

మీరు డెస్క్‌టాప్‌; ల‌్యాప్‌ట్యాప్‌; ట‌్యాబ్‌, మొబైల్ వంటి సాధనాల్లో ఇంట‌ర్నెట్ సౌక‌ర్యం ఉంటే పాల‌సీల‌ను చెక్ చేసుకోవ‌చ్చు.

 4 రిపాజిట‌రీలు:

4 రిపాజిట‌రీలు:

దేశ‌వ్యాప్తంగా క్యామ్స్‌(CAMS), క‌ర్వీ, ఎన్ఐఆర్‌(నేష‌న‌ల్ ఇన్సూరెన్స్ రిపాజిట‌రీ), సెంట్ర‌ల్ డిపాజిట‌రీల్లో పాల‌సీల‌ను ఆన్‌లైన్ రూపంలో భ‌ద్ర‌ప‌రుచుకునేందుకు అవకాశం ఉంది.

పాల‌సీదారులు నేరుగా బీమా కంపెనీని లేదా ఈ రిపాజిట‌రీల‌ను సంప్ర‌దించ‌డం ద్వారా పాల‌సీల‌ను ఎల‌క్ట్రానిక్ రూపంలో మార్చుకోవ‌చ్చు. ఇప్ప‌టికే ఉన్న పాల‌సీల‌ను సైతం మార్చుకోవ‌చ్చు. బీమా కంపెనీని సంప్ర‌దించి ఈ-ఇన్సూరెన్స్ ఖాతా గురించి అడ‌గండి.

ఎల్ఐసీ పాలసీదారులు తెలుసుకోవాల్సిన ప‌ది విష‌యాలుఎల్ఐసీ పాలసీదారులు తెలుసుకోవాల్సిన ప‌ది విష‌యాలు

English summary

బీమా పాలసీల‌ను ఎల‌క్ట్రానిక్ రూపంలోకి ఎందుకు మార్చుకోవాలంటే? | 9 Reasons To Convert Life Insurance Policies To Demat Immediately

How many times have we heard of insurance policies getting lost, stolen or simply the legal heir is not aware of the policy. What this means is also the good intentions of the policy holder to leave some money for his near and dear ones is defeated. It is therefore very useful to maintain life insurance polic
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X