For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అమెజాన్ స‌రికొత్త వ్యూహం

|

ఈ కామ‌ర్స్ మార్కెటింగ్ దిగ్గ‌జం అమెజాన్ ఎప్ప‌టిక‌ప్పుడు వ్యూహాల‌ను మారుస్తోంది. సీజ‌న్ల వారీ అమ్మ‌కాల ఆఫ‌ర్ల‌తో పాటు వినియోగ‌దారుల‌కు చేరువ‌య్యేందుకు కొత్త స‌దుపాయాన్ని ప్ర‌వేశ‌పెట్టింది. ఆ సంస్థ ప్రైమ్ మెంబర్ షిప్ ప్రోగ్రాంను మంగళవారం ప్రకటించింది. దేశంలో 100కు పైగా నగరాల్లో తన సేవలు అందిస్తున్న అమెజాన్ ఈ సేవ‌ను ప్ర‌వేశ‌పెడుతోంది. ఈ సేవ‌ల‌ను పొందాల‌నుకునే వారు సంవ‌త్స‌రానికి రూ. 499 చెల్లించాల్సి ఉంటుంది. దీని ద్వారా ఆర్డర్ చేసిన రెండు మూడురోజుల్లోనే ఆయా ఉత్పత్తులు వినియోగదారుల చెంత చేరనున్నాయి. ప్రైమ్ సేవ‌ల‌ను మొద‌ట ట్ర‌య‌ల్ పీరియ‌డ్‌లో ఉచితంగా అందించ‌నున్నారు.

అంతేకాదు ప్రైమ్ సభ్యులకు అదనంగా ప్రత్యేక అవకాశాలు,స్పెషల్ డీల్స్ ను అందించనున్నట్టు ఒక ప్రకనటలో తెలిపింది. మినిమం కొనుగోలు నిబంధన లేకుండా ఈ అవకాశాన్ని ప్రైమ్ మెంబర్స్ అప‌రిమిత వేగంతో డెలివ‌రీలు పొందే అవకాశాన్ని వినియోగించుకోవచ్చని తెలిపింది.

 అమెజాన్ స‌రికొత్త వ్యూహం

ఇది తమ వ్యాపార వృద్ధి మరింత తోడ్పాటు అందిస్తుందని అమెజాన్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ అమిత్ అగర్వాల్ పేర్కొన్నారు. దేశ వ్యాప్తంగా ఉన్న తమ వినియోగదారులకు అన్ లిమిటెడ్ ఉచిత సేవ‌ల‌తోపాటు ప్రైమ్ డెలీవరీని అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు ప్రకటించారు. సభ్యత్వం పొందిన తమ సభ్యులు 20 నగరాల్లో 10,000 పైగా ఉత్పత్తులపై రూ .50 పైగా రాయితీతో అదే రోజు, ఉదయం లేదా షెడ్యూల్ డెలివరీని ఎంచుకోవచ్చని ప్రకటించింది.

Read more about: amazon అమెజాన్
English summary

అమెజాన్ స‌రికొత్త వ్యూహం | Amazon launches Prime membership in 100 cities

E-commerce company Amazon India introduced a new facility called Amazon prime membership program in more than 100 cities,offering free one-day and two-day delivery on lakhs of products on its platform.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X