For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

స్థిరాస్తి పెట్టుబ‌డికి ఇది స‌రైన స‌మ‌యమేనా?

రియ‌ల్ ఎస్టేట్‌ ఎప్పటికైనా విలువ పెరుగుతుందే తప్ప తగ్గనే తగ్గదు. ఇలాంటి సానుకూలాంశాల కారణంగా చాలామంది స్థిరాస్తి రంగంలో పెట్టుబడులు పెడతారు. స్థిరాస్తుల్లో పెట్టుబ‌డులు పెట్ట‌డాన్ని సుర‌క్షిత‌మైన‌దిగా

|

రియ‌ల్ ఎస్టేట్‌ ఎప్పటికైనా విలువ పెరుగుతుందే తప్ప తగ్గనే తగ్గదు. ఇలాంటి సానుకూలాంశాల కారణంగా చాలామంది స్థిరాస్తి రంగంలో పెట్టుబడులు పెడతారు. స్థిరాస్తుల్లో పెట్టుబ‌డులు పెట్ట‌డాన్ని సుర‌క్షిత‌మైన‌దిగా చాలా మంది భార‌తీయులుగా భావ‌న‌. మార్కెట్లు హెచ్చుతగ్గుల ప్ర‌భావం స్వ‌ల్ప‌కాలంలో ఉన్నా దీర్ఘ‌కాలంలో స్థిరాస్తి మంచి రాబ‌డుల‌నిస్తుంద‌ని చాలా మంది న‌మ్మ‌కం. 1988 నుంచి 1994 మ‌ధ్య స్థిరాస్తి మార్కెట్ పుంజుకుంది. ఆ రెండు సంవ‌త్స‌రాల మ‌ధ్య ధ‌ర‌లు 10 శాతం పెరిగాయి. 1994 నుంచి 2002 వ‌ర‌కూ మార్కెట్ కాస్త స్త‌బ్దుగానే న‌డిచింది. 2002 నుంచి 2013 వ‌ర‌కూ స్థిరాస్తి మార్కెట్లు పైకి లేవ‌డంతో అంద‌రూ పెట్టుబ‌డులు పెట్టేందుకు ఆస‌క్తి క‌న‌బ‌రిచారు. ఈ నేప‌థ్యంలో ప్ర‌స్తుతం మార్కెట్ల ప‌రిస్థితుల్లో పెట్టుబ‌డి పెట్టాలో వ‌ద్దో చూద్దాం. దీనికి సంబంధించి ప‌లు కార‌ణాల‌ను ఎక‌న‌మిక్ టైమ్స్ విశ్లేషించింది.

నివాస గృహాల అధిక ధ‌ర‌లు

నివాస గృహాల అధిక ధ‌ర‌లు

నివాస గృహాల‌కు సంబంధించి కొనుగోలు దార్లు ఆస‌క్తి చూప‌డం లేదు. స‌గ‌టు వినియోగ‌దారుడి ఆదాయం కంటే ఇళ్ల ధ‌ర‌లు ఎక్కువ‌గా ఉండ‌ట‌మే ఇందుకు కార‌ణం.

 అమ్మ‌కానికి సిద్దంగా ఉన్న గృహాలు

అమ్మ‌కానికి సిద్దంగా ఉన్న గృహాలు

అమ్ముడుపోని గృహాల విస్తీర్ణం 8 న‌గ‌రాల్లో చూస్తే మొత్తం 1171 మిలియ‌న్ చ‌ద‌ర‌పు అడుగులుగా ఉంది. ఇది గ‌తేడాది కంటే 22 శాతం పెరుగుద‌ల‌ను చూపించింది. ప్రస్తుతం ఉన్న ప‌రిస్థితి ఇలాగే కొన‌సాగితే అమ్మ‌కానికి సిద్దంగా ఉన్న ఆయా గృహాలు అమ్ముడ‌య్యేందుకు 3 ఏళ్ల స‌మ‌యం ప‌డుతుంది.

అద్దె రూపంలో లాభిస్తే

అద్దె రూపంలో లాభిస్తే

నివాస గృహానికి తీసుకున్న రుణానికి చెల్లించే ఈఎమ్ఐ క‌న్నా ఎక్కువ అద్దే ల‌భించేట్ల‌యితే చాలా మంది అద్దెకు ఇచ్చే ఉద్దేశంతో ఇళ్లు కొనేందుకు సిద్దంగా ఉన్నారు. దీని వ‌ల్ల పెట్టుబ‌డికి డిమాండ్ పెరుగుతుంది. మూల‌ధ‌నం స‌మ‌కూర్చిన రీతిలో అద్దెలు పెర‌గ‌డం లేదు. గృహ రుణం బేస్ రేటు 9.5 శాతం పైగా ఉండ‌గా అద్దె రూపంలో ల‌భించే రాబ‌డి 2 నుంచి 4 శాతం త‌గ్గింది.

ధ‌ర‌ల ఒత్తిళ్లు

ధ‌ర‌ల ఒత్తిళ్లు

గ‌త కొన్నేళ్ల‌లో నిర్మాణ ధ‌ర‌లు బాగా పెరిగాయి. స్థిరాస్తి నియంత్ర‌ణ బిల్లుతో అనుమ‌తి తెచ్చుకునేందుకు అయ్యే ఖ‌ర్చు సైతం పెరిగే అవ‌కాశం ఉంది. అయితే స్థిరాస్తి వ్యాపారంలో ఉన్న బ‌డా సంస్థ‌లు ధ‌ర‌లు పెంచ‌వు. ధ‌ర‌లు పెంచేందుకు బ‌దులు అమ్మే గృహాల సంఖ్య పెరిగేందుకు ప్ర‌య‌త్నిస్తాయి.

 కొత్త పెట్టుబ‌డిదారులు

కొత్త పెట్టుబ‌డిదారులు

ఈ ప‌రిస్థితుల్లో కొత్త వాళ్లు ఏం చేయాలి? ఇది ఎలాంటి స్థిరాస్తి కొనుగోలు చేయాల‌నుకునే దానిపై ఆధార‌పడి ఉంటుంది. సొంత ఇంటి కొనుగోలు కోసం చూసేవారికైతే ఇది స‌రైన స‌మ‌యం అనే చెప్పాలి. పెట్టుబ‌డి కోణంతో ఇల్లు కొనుగోలు చేయాల‌నుకునే వారైతే కొద్ది సంవ‌త్స‌రాలు వేచిచూడ‌ట‌మే ఉత్త‌మం. ఎందుకంటే గతంలో లాగా స్థిరాస్తిపై పెట్టే పెట్టుబ‌డులు రాబ‌డినిస్తాయ‌ని చెప్ప‌లేమ‌ని శాంక్ట‌మ్ వెల్త్ మేనేజ్‌మెంట్ సీఐవో సునీల్ శ‌ర్మ చెప్పారు.

English summary

స్థిరాస్తి పెట్టుబ‌డికి ఇది స‌రైన స‌మ‌యమేనా? | Is it The Right Time to keep Invest in Real Estate

Real estate is safest investment as believed by many Indians. But it has also highs and lows. For investment purpose if one has long term plans then it is right thing to do invest in properties. Any way buying a home is long term dream for many. Be careful while buy a home for living
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X