For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వేత‌నంపై ప‌న్ను ఆదా కోసం 8 మార్గాలు

మీరు మీ స‌హోద్యోగుల‌తో పోలిస్తే ఎక్కువ ప‌న్ను క‌డుతున్నార‌ని భావిస్తున్నారా? ప‌న్ను ఆదా చేసే మార్గాల గురించి ఆలోచిస్తున్నారా? ఉద్యోగంలో చేరినప్ప‌టి నుంచి ఇప్ప‌టిదాకా స‌రైన ట్యాక్స్ ప్లానింగ్ చేయ‌లేదా?

|

మీరు మీ స‌హోద్యోగుల‌తో పోలిస్తే ఎక్కువ ప‌న్ను క‌డుతున్నార‌ని భావిస్తున్నారా? ప‌న్ను ఆదా చేసే మార్గాల గురించి ఆలోచిస్తున్నారా? ఉద్యోగంలో చేరినప్ప‌టి నుంచి ఇప్ప‌టిదాకా స‌రైన ట్యాక్స్ ప్లానింగ్ చేయ‌లేదా? ప‌న్ను ఆదాకు మార్గాలు తెలుసుకోవాల‌నుకుంటున్నారా? అయితే ఈ క‌థ‌నం మీ కోస‌మే. వేత‌నంపై ప‌న్ను ఆదా కోసం 8 ఉత్త‌మ మార్గాలను ఇక్క‌డ చద‌వండి.

మీల్ వోచ‌ర్స్‌

మీల్ వోచ‌ర్స్‌

కంపెనీ మీల్ వోచ‌ర్స్ / ఫుడ్ కూప‌న్స్ అందిస్తూ ఉంటే అవి తీసుకోండి. వీటికి ఏడాది కాలంలో రూ. 60 వేల వ‌ర‌కూ ప‌న్ను మిన‌హాయించుకునే అవ‌కాశం ఉంది.

ప్రయాణ ఖర్చులకోసం భత్యం(క‌న్వేయ‌న్స్ అల‌వెన్సు)

ప్రయాణ ఖర్చులకోసం భత్యం(క‌న్వేయ‌న్స్ అల‌వెన్సు)

మీ ఉద్యోగ బాధ్య‌తల్లో భాగంగా ప్ర‌యాణాలు చేస్తున్నారా? ఇంటికి, కార్యాల‌యానికి వ్యక్తిగ‌త‌, ప్ర‌జా ర‌వాణాను ఉప‌యోగిస్తుంటే వేత‌నంలో క‌న్వేయ‌న్స్ అల‌వెన్సు ఉండేలా చూసుకోండి.

నెల‌కు రూ. 1600 వ‌ర‌కూ క‌న్వేయ‌న్స్ అలెవ‌న్సు ప‌న్ను మిన‌హాయింపు క‌లిగి ఉంటుంది. ఏడాదికి రూ. 19,200 వ‌ర‌కూ ప‌న్ను మిన‌హాయింపు పొంద‌వ‌చ్చు. 10 శాతం ప‌న్ను జోన్‌లో ఉన్నవారు దాదాపు రూ. 2 వేల వ‌ర‌కూ, అధిక ప‌న్ను జోన్‌లో ఉన్నవారు రూ. 3840 వ‌ర‌కూ ఈ రూపంలో ఆదా చేసుకోవ‌చ్చు.

అల‌వెన్సు

అల‌వెన్సు

వేరే ఇత‌ర అల‌వెన్సుల ద్వారా సైతం ప‌న్ను మిన‌హాయింపుల‌ను పొంద‌వ‌చ్చు. ఉదాహర‌ణ‌కు క‌నీసం రూ. 500 పైబ‌డి టెలిఫోన్, మొబైల్ బిల్లు ఉంటే దానిని మొత్తం వేత‌నం రూపంలో తీసుకోకుండా అల‌వెన్సు రూపంలో పొందాలి. అలా కొన్ని అల‌వెన్సులు ప‌న్ను మిన‌హాయింపుకు అర్హ‌త క‌లిగి ఉన్నాయి. కంపెనీ హెచ్ ఆర్‌, అడ్మినిస్ట్రేష‌న్‌ను సంప్ర‌దించి వీటి గురించి తెలుసుకోవ‌చ్చు.

ఎల్‌టీఏ

ఎల్‌టీఏ

కాస్త అధిక ప‌న్ను జోన్‌లో ఉన్న‌వారికి కంపెనీ ఎల్‌టీఏ అందించ‌కపోతే మీరు అడిగి ఎల్‌టీఏ తీసుకోండి. ప్ర‌తి రెండేళ్లకోసారి ఎల్‌టీఏకు ప‌న్ను మిన‌హాయింపు పొంద‌వ‌చ్చు. అయితే దీనికి బిల్లులు స‌మ‌ర్పించాలి. ఎల్‌టీఏ అంటే లీవ్ ట్రావెల్ అల‌వెన్సు.

పీపీఎఫ్ ఖాతా కేటాయింపు పెంపు

పీపీఎఫ్ ఖాతా కేటాయింపు పెంపు

ఆదాయ‌పు ప‌న్ను చ‌ట్టం సెక్ష‌న్ 80 సీ కింద పీపీఎఫ్ ప‌న్ను మిన‌హాయింపుల‌కు అర్హ‌త క‌లిగి ఉంది. పీపీఎఫ్ కోసం చేసే కేటాయింపుల‌ను పెంచుకోవ‌డం ద్వారా సైతం ప‌న్ను మిన‌హాయింపుల‌ను పొంద‌వ‌చ్చు.

మెడిక‌ల్ బిల్లులు

మెడిక‌ల్ బిల్లులు

మెడిక‌ల్ బిల్లులు స‌మ‌ర్పించి సైతం ప‌న్ను మిన‌హాయింపులు పొందవ‌చ్చు. ఈ రూపంలో రూ. 15 వేల వ‌ర‌కూ ఆదా చేసుకోవ‌చ్చు. అయితే ఈ ఖ‌ర్చును మీకు మీరుగా కానీ లేదా మీపై ఆధార‌ప‌డిన వారి మీద కానీ వెచ్చించి ఉండాలి. లేక‌పోతే ప‌న్ను మిన‌హాయింపును పొంద‌లేరు.

పీపీఎఫ్‌లో ఇప్పుడు పెట్టుబ‌డి పెట్టేందుకు 5 కార‌ణాలుపీపీఎఫ్‌లో ఇప్పుడు పెట్టుబ‌డి పెట్టేందుకు 5 కార‌ణాలు

ఇత‌రాలు

ఇత‌రాలు

80సీ మార్గాన్ని స‌ద్వినియోగం చేసుకునే ప్ర‌య‌త్నం చేయాలి. ఎల్ఐసీ, పీపీఎఫ్‌, ఈపీఎఫ్, గృహ రుణం అస‌లు వంటి వాటి ద్వారా ప‌న్ను మిన‌హాయింపుల‌కు గ‌రిష్ట ప్ర‌యోజ‌నాల‌ను పొందాలి. 80 సీ ద్వారా మొత్తం రూ. 1ల‌క్ష యాభై వేల వ‌ర‌కూ ప్ర‌యోజ‌నాల‌ను వినియోగించుకోవ‌చ్చు.

పన్ను ఆదా ఇలా: సెక్షన్ 80సి, 80డిపన్ను ఆదా ఇలా: సెక్షన్ 80సి, 80డి

10 శాతం ప‌న్ను ప‌రిధిలో ఉంటే రూ. 15వేలు, 20 శాతం ప‌న్ను ప‌రిధిలో ఉంటే రూ. 30 వేలు, అంత‌క‌న్నా ఎక్కువ ప‌న్ను పరిధిలో ఉంటే రూ. 45 వేల వ‌ర‌కూ ఆదా చేసుకోవ‌చ్చు.

రుజువుల మాటేమిటి?

రుజువుల మాటేమిటి?

క్లెయిం చేసుకోవ‌డం బాగానే ఉంటుంది. మ‌రి రుజువుల మాటేమిటి? వీలైనంత తొంద‌ర‌గా అవ‌స‌ర‌మైన ప‌త్రాల‌ను సిద్దం చేసుకోవాలి. ఆదాయ‌పు ప‌న్ను శాఖ అడిగిన వాటిన‌న్నింటినీ స‌బ్‌మిట్ చేయ‌డం ద్వారా వేత‌నంపై టీడీఎస్ లేకుండా చేసుకోవ‌చ్చు.

English summary

వేత‌నంపై ప‌న్ను ఆదా కోసం 8 మార్గాలు | 8 Best Ways To Save Tax On Your Salary

If you are getting a salary, there are various ways in which you can save money from it. Take a look at 8 smart ways to save tax on your salary.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X