For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

10 మంది కొత్త త‌రం కోటీశ్వ‌రులు

దేశంలో చాలా సార్లు వ్యాపార వ‌ర్గాల్లో వార‌స‌త్వం కొన‌సాగుతూ విజ‌యాలు సాధిస్తుండ‌ట‌మే ఇందుకు కార‌ణం. 10 మంది కొత్త త‌రం కోటీశ్వ‌రులు విభిన్న పంథాలో సాగుతున్నారు.ఇక్క‌డ న‌యా త‌రం కోటీశ్వ‌రుల గురించి

|

పాత‌త‌రంలో క‌ష్టంతో బిలియ‌నీర్ల‌య్యేవారు. ఇప్పుడు ఇష్టంతో, ఆలోచ‌న‌ల‌తో, మేథ‌స్సుతో ధ‌న‌వంతుల‌వుతున్నారు. వీరంతా యువ కోటీశ్వ‌రులు. ఎక్కువ మంది కుటుంబ వ్యాపారానికి సంబంధించిన వారు లేదా కంపెనీల బోర్డ్ మెంబ‌ర్ల‌లో స‌భ్యులుగా ప్ర‌స్థానం ప్రారంభిస్తున్నారు.

దేశంలో చాలా సార్లు వ్యాపార వ‌ర్గాల్లో వార‌స‌త్వం కొన‌సాగుతూ విజ‌యాలు సాధిస్తుండ‌ట‌మే ఇందుకు కార‌ణం. 10 మంది కొత్త త‌రం కోటీశ్వ‌రులు విభిన్న పంథాలో సాగుతున్నారు.
ఇక్క‌డ న‌యా త‌రం కోటీశ్వ‌రుల గురించి చ‌ద‌వండి.

 ఇషా అంబానీ, ఆకాశ్ అంబానీ

ఇషా అంబానీ, ఆకాశ్ అంబానీ

దేశంలో అతిపెద్ద ధ‌న‌వంతుడైన ముకేశ్ అంబానీ పిల్ల‌లు ఇషా అంబానీ, ఆకాశ్ అంబానీ. 2014లో రిల‌య‌న్స్ కొత్త వ్యాపారాలైన రిల‌య‌న్స్ జియో ఇన్ఫోకామ్, రిల‌య‌న్స్ రిటైల్ వెంచ‌ర్స్‌ల‌లో ఇద్ద‌రినీ బోర్డు మెంబ‌ర్లుగా నియ‌మించారు.

ఇందులో చేరేముందు ఇషా మెకెన్సీ& కంపెనీలో బిజినెస్ అన‌లిస్ట్‌గా ఉద్యోగం చేయ‌గా, ఆకాశ్ బ్రౌన్ విశ్వ‌విద్యాల‌యం నుంచి అండ‌ర్ గ్రాడ్యుయేట్ ప‌ట్టా పొందాడు.

 క‌విన్ భార‌తి మిట్ట‌ల్‌

క‌విన్ భార‌తి మిట్ట‌ల్‌

భార‌తి ఎంట‌ర్‌ప్రైజెస్ వ్య‌వ‌స్థాప‌క ఛైర్మ‌న్ సునీల్ మిట్ట‌ల్ త‌న‌యుడు క‌విన్ భార‌తి మిట్ట‌ల్‌. లండ‌న్ ఇంపిరీయ‌ల్ కాలేజీ నుంచి డిగ్రీ పూర్తిచేశాడు. 2009లో ఎల‌క్ట్రిక‌ల్ ఇంజనీరింగ్, మేనేజ్‌మెంట్ విభాగంలో మాస్ట‌ర్స్ చేశాడు. భార‌త‌దేశం సొంతమైన హైక్ మెసెంజ‌ర్‌ను స్థాపించాడు.

అలోక్ సంఘ్వీ

అలోక్ సంఘ్వీ

మీడియాకు దూరంగా ఉండే అలోక్ సంఘ్వీ చాలా త‌క్కువ‌గా బ‌య‌ట క‌నిపిస్తాడు. మిచిగ‌న్ విశ్వ‌విద్యాల‌యం నుంచి మాలిక్యుల‌ర్ బ‌యాల‌జీలో గ్రాడ్యుయేష‌న్ పూర్త‌యింది. మామూలుగా వ్య‌వ‌స్థాప‌క ల‌క్ష‌ణాలు క‌లిగిన ఇత‌డు పీవీ ప‌వ‌ర్ టెక్ ప్రైవేటు లిమిటెడ్‌ను ప్రారంభించాడు. దీని ద్వారా యూర‌ప్‌, ఆసియా, ఆఫ్రికాల్లో ప‌లు చోట్ల సోలార్ పల‌క‌ల‌ను ఇన్‌స్టాల్ చేశారు.

దేశంలో రెండో అతిపెద్ద ధ‌న‌వంతుడైన స‌న్ ఫార్మా వ్య‌వ‌స్థాప‌కుడు దిలీప్ సంఘ్వీ పెద్ద కొడుకు అలోక్ సంఘ్వీ.

 రోషిని నాడ‌ర్‌

రోషిని నాడ‌ర్‌

హెచ్‌సీఎల్ వ్య‌వ‌స్థాప‌కుడు శివ్‌నాడ‌ర్ త‌న‌య రోషిని నాడ‌ర్‌. ప్ర‌స్తుతం ఆమె హెచ్‌సీఎల్ సీఈవోగా వ్య‌వ‌హ‌రిస్తోంది. శాస్త్రీయ సంగీతంలో శిక్ష‌ణ పొందిన రోషిని శికార్ మ‌ల్హోత్రాను పెళ్లి చేసుకున్నారు.

 ఆదిత్య మిట్ట‌ల్‌

ఆదిత్య మిట్ట‌ల్‌

ఉక్కు దిగ్గ‌జం ల‌క్ష్మీ మిట్ట‌ల్ ఆదిత్య మిట్ట‌ల్‌. యూనివ‌ర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియాకు చెందిన వార్ట‌న్ స్కూల్ నుంచి స్ట్రేట‌జిక్ మేజ్‌మెంట్‌, కార్పొరేట్ ఫైనాన్స్ స‌బ్జెక్టుల్లో బ్యాచిల‌ర్ డిగ్రీ పొందాడు.

కంపెనీలో చేర‌క‌ముందు, ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ క్రెడిట్ సూయిజ్ ఫ‌స్ట్ బోస్ట‌న్లో మెర్జ‌ర్స్‌, అక్విజిష‌న్స్(విలీనాలు, స్వాధీనాలు) డిపార్ట్‌మెంట్‌లో ప‌నిచేశాడు. ప్ర‌స్తుతం ఆర్సెల‌ర్ మిట్ట‌ల్ సీఈఓగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

అష్ని బియాని

అష్ని బియాని

ఫ్యూచ‌ర్ రిటైల్ గ్రూప్ వ్య‌వ‌స్థాప‌కులు కిశోర్ బియాని కుమార్తె అష్ని బియాని. ఫ్యూచ‌ర్ గ్రూప్ ఇన్నోవేష‌న్ విభాగంలో త‌న ప్ర‌స్థానాన్ని 22 ఏళ్ల‌కే ప్రారంభించింది.

క్వీన్‌మేరీలో పాఠ‌శాల విద్య‌ను పూర్తి చేసిన ఆమె ముంబ‌యి హెచ్ ఆర్ కళాశాల‌లో చ‌దివింది. త‌ర్వాత టెక్స్‌టైల్ డిజైనింగ్‌, డిజైనింగ్ మేనేజ్‌మెంట్‌లో కోర్సు చేసింది.

రిష‌ద్ ప్రేమ్‌జీ

రిష‌ద్ ప్రేమ్‌జీ

విప్రో లిమిటెడ్‌లో బోర్డు మెంబ‌ర్‌, ఛీప్ స్ట్రేట‌జీ అధికారిగా రిష‌ద్ ప్రేమ్‌జీ విధులు నిర్వ‌హిస్తున్నారు. ఈ స్థానంలో అత‌డు పెట్టుబ‌డిదారుల‌తో సంబంధాలు నెరుపుతూ, కార్పొరేట్ వ్య‌వ‌హారాల‌ను సైతం చూసుకుంటున్నారు. విప్రోలో చేర‌క‌ముందు లండ‌న్ బైన్‌& కంపెనీలో ప‌నిచేశాడు.

జీఈ కంపెనీకి చెందిన ఫైనాన్సియ‌ల్ మేనేజ్‌మెంట్ ప్రోగ్రామ్‌(ఎఫ్ఎమ్‌పీ)లో అత‌డు ప‌ట్ట‌భ‌ద్రుడ‌య్యాడు. త‌ర్వాత జీఈ క్యాపిట‌ల్‌కు చెందిన చాలా వ్యాపారాల్లో(బీమా, క‌న్సూమ‌ర్ లెండింగ్ వంటివి) త‌న ప్ర‌తిభ‌ను నిరూపించుకున్నాడు.

రోహ‌న్ మూర్తి

రోహ‌న్ మూర్తి

ఇండియ‌న్ ఐటీ దిగ్గ‌జ వ్యాపార వేత్త, ఇన్ఫోసిస్ ఎన్.ఆర్‌. నారాయ‌ణ మూర్తి త‌న‌యుడు రోహ‌న్ మూర్తి. రోహ‌న్ హార్వ‌ర్డ్ నుంచి కంప్యూట‌ర్ సైన్స్‌లో పీహెచ్‌డీ సాధించాడు.

ఇన్ఫోసిస్ ఛైర్మ‌న్ కార్యాల‌యంలో 2013లో ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్‌గా నియ‌మితుల‌య్యారు. జూన్ 14,2014లో నారాయ‌ణ మూర్తి కంపెనీ నుంచి త‌ప్పుకున్న‌ప్పుడు రోహ‌న్ సైతం కంపెనీని వ‌దిలేశాడు.

అన‌న్య శ్రీ బిర్లా

అన‌న్య శ్రీ బిర్లా

బిజినెస్ టైకూన్ కుమార మంగ‌ళం బిర్లా కూతురు అన‌న్య శ్రీ బిర్లా. సామాజిక వ్యాపార కోణం క‌లిగిన ఈమె స్వ‌తంత్ర మైక్రోఫిన్ అనే సూక్ష్మ రుణ సంస్థ‌ను ప్రారంభించారు. దీని ద్వారా గ్రామీణ రుణ గ్ర‌హీత‌ల‌కు తోడ్పాటు నందిస్తూ వారు త‌మ సొంత వ్యాపారాలు స్థాపించేలా ప్రోత్స‌హిస్తున్నారు.

 ఆనంద్ పిర‌మిల్

ఆనంద్ పిర‌మిల్

పిర‌మిల్ వ్య‌వ‌స్థాప‌కులైన అజ‌య్ పిర‌మిల్ కొడుకు ఆనంద్ పిర‌మిల్‌. ఈ కుటుంబం పేరున్న వ్యాపార‌వేత్త‌లో ఉండ‌ట‌మే కాక సామాజిక దృక్ప‌థంతో ముందుకెళుతోంది.

పిర‌మిల్ గ్రూప్‌కే చెందిన పిర‌మిల్ రిటైల్ విబాగానికి ఆనంద్ నేతృత్వం వ‌హిస్తున్నారు. ముంబ‌యిలోని ప్ర‌ధాన ప్రాంతాల్లో సంస్థ‌కు 10 ల‌క్ష‌ల చ‌ద‌ర‌పు అడుగులకు పైగా వాణిజ్య, నివాస స్థ‌లాలున్న‌ట్లు తెలుస్తోంది.

Read more about: business billionaire rich
English summary

10 మంది కొత్త త‌రం కోటీశ్వ‌రులు | 10 New Generation Tycoons On The Way

They are young, aspirational and plan to scale newer heights. Most of the young generation kids from the list are part of family business or Board members of the company. In India, as most of the time business is dominated by the family hierarchy. Here are 10 new generation tycoons, that plan to make a mark.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X