For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పాన్ కార్డును గురించిన 6 ముఖ్య‌ విష‌యాలు

ఆదాయ‌పు ప‌న్ను రిట‌ర్నులు స‌మ‌ర్పించేట‌ప్పుడు, ఆ శాఖ‌కు చెందిన ఏ అధికారితోనైనా జ‌రిపే ఉత్త‌ర ప్ర‌త్యుత్తరాల‌లో పాన్‌ను పేర్కొన‌డం త‌ప్ప‌నిసరి. అయినా స‌రే చాలా మంది పాన్ కార్డు తీసుకోకుండా ఇబ్బందులు ప‌

|

ఆదాయ‌పు ప‌న్ను శాఖ ప్ర‌తి ఒక్క‌రికీ కేటాయించే శాశ్వ‌త ఖాతా సంఖ్య‌ను పాన్(ప‌ర్మినెంట్ అకౌంట్ నంబ‌రు) అంటారు. అంకెలు, అక్ష‌రాలు క‌ల‌గ‌లిపి ఉండే ప‌ది స్థానాల సంఖ్య ఇది. ఆదాయ‌పు ప‌న్ను రిట‌ర్నులు స‌మ‌ర్పించేట‌ప్పుడు, ఆ శాఖ‌కు చెందిన ఏ అధికారితోనైనా జ‌రిపే ఉత్త‌ర ప్ర‌త్యుత్తరాల‌లో పాన్‌ను పేర్కొన‌డం త‌ప్ప‌నిసరి. అయినా స‌రే చాలా మంది పాన్ కార్డు తీసుకోకుండా ఇబ్బందులు ప‌డుతుంటారు. మ‌రికొంత మంది ఎక్క‌డ పాన్ కార్డు నంబ‌రు ఇవ్వాలి, ఎక్క‌డ వ‌ద్దు అనే విష‌యంలో తిక‌మ‌క ప‌డుతూ ఉంటారు. ఈ క్ర‌మంలో పాన్ కార్డును గురించిన ఐదు ముఖ్య విష‌యాల‌ను తెలుసుకుందాం.

 పాన్ కార్డు ఎప్పుడు అవ‌స‌రం?

పాన్ కార్డు ఎప్పుడు అవ‌స‌రం?

* రూ. 50 వేల పైబ‌డి బ్యాంకు డిపాజిట్ల కోసం

* బ్యాంకు ఖాతా తెరిచేందుకు

* డీమ్యాట్, ట్రేడింగ్ ఖాతాలు తెర‌వ‌డానికి

* చెక్కులు, డీడీల విష‌యంలో లావాదేవీ రూ. 50 వేల‌ను మించితే

* స్థిరాస్తి, వాహ‌నాల కొనుగోలు, అమ్మ‌కాలు జ‌రిపేటప్పుడు

* హోట‌ళ్లు, విలాసాలు, ప్ర‌యాణ ఖ‌ర్చులు వంటి వాటి కోసం రూ. 25 వేల కంటే న‌గ‌దు చెల్లింపులు చేసే విష‌యంలో

* ఆదాయ‌పు ప‌న్ను రిట‌ర్నులు స‌మ‌ర్పించేట‌ప్పుడు.

ఎవ‌రెవ‌రికి త‌ప్ప‌నిస‌రిగా పాన్ ఉండాలి?

ఎవ‌రెవ‌రికి త‌ప్ప‌నిస‌రిగా పాన్ ఉండాలి?

* ప్ర‌స్తుతం ఆదాయం ప‌న్ను చెల్లించ‌వ‌ల‌సిన వారికి, చెల్లించేవారంద‌రికీ, ఇత‌రుల త‌ర‌పున ఆదాయ‌పు ప‌న్ను రిట‌ర్నులు

దాఖాలు చేయాల్సిన వారికి

* విధిగా పాన్ నంబ‌రు న‌మోదు చేయాల్సిన లావాదేవీల‌లో కొత్త‌గా ప్ర‌వేశించాల‌నుకునే వారికి

పాన్ కోసం ఎక్క‌డ ద‌ర‌ఖాస్తు చేయాలి?

పాన్ కోసం ఎక్క‌డ ద‌ర‌ఖాస్తు చేయాలి?

పాన్‌కు సంబంధించిన సేవ‌ల‌ను మెరుగుప‌ర‌చ‌డం కోసం, ఆదాయ‌పు ప‌న్ను శాఖ కార్యాల‌యం ఉన్న ప్ర‌తి ప‌ట్ట‌ణంలో ఐటీ పాన్ సేవా కేంద్రాల‌ను ఏర్పాటు చేయ‌డానికి యుటిఐ ఇన్వెస్ట‌ర్ స‌ర్వీసెస్ లిమిటెడ్‌(యుటిఐఐఎస్ఎల్‌) సంస్థ‌కు ఆ శాఖ అనుమ‌తించింది. పెద్ద న‌గ‌రాల‌లో పాన్ ద‌ర‌ఖాస్తుదారుల సౌక‌ర్యాల కోసం, యుటిఐఐఎస్ఎల్ ఒక‌టి కంటే ఎక్కువ ఐటీ పాన్ స‌ర్వీస్ సెంట‌ర్ల‌ను ఏర్పాటు చేసింది. వీటితో పాటు టిన్ ఫెసిలిటేష‌న్ కేంద్రాలు కూడా ఉంటాయి. వీట‌న్నింటిలో పాన్ ద‌ర‌ఖాస్తుల‌ను స‌మ‌ర్పించ‌వ‌చ్చు.

పాన్ కోసం అవ‌స‌ర‌మ‌య్యేవి

పాన్ కోసం అవ‌స‌ర‌మ‌య్యేవి

ఒక పాస్‌పోర్టు సైజ్ క‌ల‌ర్ ఫోటో

రూ.107 డిమాండ్ డ్రాఫ్ట్

వ్య‌క్తిగ‌త గుర్తింపు ప‌త్రం జిరాక్స్‌

చిరునామా గుర్తింపు ప‌త్రం జిరాక్స్‌

 వ్య‌క్తిగ‌త గుర్తింపు కోసం

వ్య‌క్తిగ‌త గుర్తింపు కోసం

స్కూల్ లీవింగ్ స‌ర్టిఫికెట్‌(టీసీ)

ప‌దో త‌ర‌గ‌తి మార్కుల జాబితా

గుర్తింపు పొందిన విద్యా సంస్థ‌ల డిగ్రీ మార్కుల జాబితా

డిపాజిట‌రీ ఖాతా స్టేట్‌మెంట్

క్రెడిట్‌కార్డు స్టేట్‌మెంట్

బ్యాంకు ఖాతా స్టేట్‌మెంట్ లేదా పాస్‌బుక్

నీటి బిల్లు(వాట‌ర్ బిల్లు)

రేష‌న్ కార్డు

ప్రాప‌ర్టీ ట్యాక్స్ అసెస్‌మెంట్ ఆర్డ‌ర్‌

పాస్‌పోర్టు

ఓట‌రు గుర్తింపు ప‌త్రం

డ్రైవింగ్ లెసెన్సు

ఎంఎల్ఏ లేదా ఎంపీ లేదా మున్సిప‌ల్ కౌన్సిల‌ర్ లేదా గెజిడెడ్ ఆఫీస‌ర్ సంత‌కం చేసి ఇచ్చే గుర్తింపు రుజువు

ఆధార్ కార్డులో త‌ప్పులున్నాయా? అయితే స‌వ‌రించుకోండిలా....ఆధార్ కార్డులో త‌ప్పులున్నాయా? అయితే స‌వ‌రించుకోండిలా....

చిరునామా గుర్తింపు కోసం

చిరునామా గుర్తింపు కోసం

దంప‌తులిద్ద‌రూ ఉద్యోగాలు చేస్తుంటే సంపాద‌న మార్గాలివే... దంప‌తులిద్ద‌రూ ఉద్యోగాలు చేస్తుంటే సంపాద‌న మార్గాలివే...

విద్యుత్ బిల్లు

టెలిఫోన్ బిల్లు

డిపాజిట‌రీ ఖాతా స్టేట్‌మెంట్

క్రెడిట్ కార్డు స్టేట్‌మెంట్

బ్యాంకు ఖాతా స్టేట్‌మెంట్ లేదా పాస్‌బుక్‌

రెంట్ రిసిప్ట్‌(అద్దె చెల్లించిన ర‌సీదు)

ఎంప్లాయిర్ స‌ర్టిఫికెట్

పాస్‌పోర్టు

ఓట‌రు గుర్తింపు ప‌త్రం

ప్రాప‌ర్టీ ట్యాక్స్ అసెస్‌మెంట్ ఆర్డ‌ర్‌

డ్రైవింగ్ లైసెన్స్‌

రేష‌న్ కార్డు

ఎంఎల్ఏ లేదా ఎంపీ లేదా మున్సిప‌ల్ కౌన్సిల‌ర్ లేదా గెజిడెడ్ ఆఫీస‌ర్ సంత‌కం చేసి ఇచ్చే గుర్తింపు రుజువు

పీఎఫ్ ఖాతా వ‌ల్ల ఈ ప్ర‌యోజ‌నాలు పొంద‌వ‌చ్చా?పీఎఫ్ ఖాతా వ‌ల్ల ఈ ప్ర‌యోజ‌నాలు పొంద‌వ‌చ్చా?

English summary

పాన్ కార్డును గురించిన 6 ముఖ్య‌ విష‌యాలు | 6 Things To know About PAN Card

Permanent Account Number (PAN) Card is a photo Identity Card that carries 10 digits alphanumeric Unique Number for every card holder. It is issued by Ministry of Finance (Government of India) and it can be used as Photo Identity for opening Bank Account, during travel in train with e-ticket and other purposes also.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X