For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీకు ప‌నికొచ్చే 5 ఉత్త‌మ బ్యాంకింగ్ యాప్‌లు

|

మీ బ్యాంకులు అందిస్తున్న బ్యాంకింగ్ యాప్‌లు తెలుసా? బ్యాంక్ సేవ‌ల కోసం మీరు ఇంకా బ్యాంకుకు, ఏటీఎమ్‌కు వెళ్తున్నారా? అవ‌స‌రం లేదు. దాదాపు అన్ని సేవ‌ల‌ను మొబైల్‌లోనే అందించే విధంగా బ్యాంకులు పోటీ ప‌డుతున్నాయి. ఇంట‌ర్నెట్ సౌక‌ర్యం ఉండి మీ మొబైల్‌లో యాప్‌డౌన్‌లోడ్ చేసుకుంటే చాలు. మీ ప‌ని సులువు అవుతుంది. రీచార్జీల‌కు, బిల్లు చెల్లింపుల‌కు వివిధ యాప్‌ల అవ‌స‌రం దాదాపుగా ఉండ‌దు. రీచార్జీ మొదలుకొని రైలు టిక్కెట్ల బుకింగ్ వ‌ర‌కూ మొబైల్ యాప్‌లోనే చేసుకోవచ్చు. ఈ నేప‌థ్యంలో దేశంలో ఐదు ఉత్త‌మ బ్యాంకింగ్ యాప్‌ల వివ‌రాల‌ను తెలుసుకుందాం. మీరు ఏ బ్యాంక్ వినియోగ‌దార‌డైతే ఈ బ్యాంక్ యాప్‌ల‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. మొబైల్ సంబంధించిన సెక్యూరిటీ జాగ్ర‌త్త‌లు తీసుకోవ‌డంలో మాత్రం మీదే బాధ్య‌త‌.

స్టేట్ బ్యాంక్ ఫ్రీడ‌మ్‌

స్టేట్ బ్యాంక్ ఫ్రీడ‌మ్‌

ఎస్‌బీఐ వినియోగ‌దారుల కోసం విడుద‌ల చేసిన యాప్ స్టేట్ బ్యాంక్ ఫ్రీడ‌మ్‌. ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని న‌మోదు చేసుకుంటే చాలు మీ లావాదేవీలు నిమిషాల్లో జ‌రిగిపోతాయి. నెఫ్ట్‌,ఐఎమ్‌పీఎస్ లావాదేవీలు, చెక్కు పుస్త‌కం అభ్య‌ర్థ‌న‌, బిల్లు చెల్లింపుల వంటివ‌న్నీ ఇందులో చేయ‌వ‌చ్చు. ఈ యాప్‌ను 50 ల‌క్ష‌ల మందికి పైగా డౌన్‌లోడ్ చేసుకున్నారు.

 హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ మొబైల్ అప్లికేష‌న్‌

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ మొబైల్ అప్లికేష‌న్‌

హెచ్‌డీఎఫ్‌సీ మొబైల్ బ్యాంకింగ్ యాప్ ద్వారా ఒక్కొక్క‌రు 60 ర‌కాల లావాదేవీల‌ను జ‌రుపుకోవ‌చ్చు. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ యాప్‌లో మై మెనూ ఫీచ‌ర్ ద్వారా మీకు ఇష్ట‌మైన 10 లావాదేవీల‌ను మెనూగా సెట్ చేసుకోవ‌చ్చు. యాండ్రాయిడ్ ఫోన్ల‌కు హిందీలో మొబైల్ బ్యాంకింగ్ యాప్ క‌లిగిన బ్యాంకు ఇదే. దీనికి 10 ల‌క్ష‌ల‌కు పైబ‌డి వినియోగ‌దారులు ఉన్నారు.

 ఐసీఐసీఐ బ్యాంక్ ఐమొబైల్‌

ఐసీఐసీఐ బ్యాంక్ ఐమొబైల్‌

ఐసీఐసీఐ బ్యాంకుకు చెందిన అధికారిక మొబైల్ యాప్ ఐమొబైల్‌. న‌గ‌దు నిల్వను చూసుకోవ‌డం లేదా చివ‌రి 5 లావాదేవీల వివ‌రాలు, ఫండ్ ట్రాన్స్‌ఫ‌ర్‌, బిల్లు చెల్లింపు, ఫిక్స్‌డ్‌, రిక‌రింగ్ డిపాజిట్లు వంటి వ్య‌వ‌హారాలు ఇందులో చేసుకునే వీలుంది. ఐసీఐసీఐ బ్యాంకుకు సంబంధించిన రుణం వివ‌రాలు, డీమ్యాట్, క్రెడిట్ కార్డు ఖాతాల‌ను అనుసంధానం చేసుకోవ‌చ్చు. ఈ యాప్ రేటింగ్ 4.1గా ఉంది.

 బరోడా ఎమ్‌-క‌నెక్ట్‌

బరోడా ఎమ్‌-క‌నెక్ట్‌

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాకు చెందిన మొబైల్ బ్యాంకింగ్ యాప్ బ‌రోడా ఎమ్-క‌నెక్ట్. 24X7 బ్యాంకింగ్ సేవ‌లు పొందేందుకు వీలుగా భ‌ద్ర‌త‌తో కూడిన యాప్ ఇది. దీని ద్వారా ఖాతా స‌మ‌చారం, న‌గ‌దు బ‌దిలీ, బిల్లు చెల్లింపు, రిచార్జీ, విమాన‌,సినిమా టిక్కెట్ల బుకింగ్ వంటి ఎన్నో ప‌నుల‌ను చేసుకోవ‌చ్చు. ఈ యాప్ రేటింగ్ 4.0గా ఉంది.

న్యూ యాక్సిస్ మొబైల్‌

న్యూ యాక్సిస్ మొబైల్‌

సులువైన‌, యూజ‌ర్ ఫ్రెండ్లీ ఫీచ‌ర్లు క‌లిగిన యాప్ న్యూయాక్సిస్ మొబైల్‌. ఈ యాప్‌తో చివ‌రి 10 లావాదేవీల వివ‌రాలు, ఖాతా స‌మాచారం తెలుసుకోవ‌డంతో పాటు సాధార‌ణ ఇంట‌ర్నెట్ బ్యాంకింగ్‌లో ఉండే చాలా ఆర్థిక వ్య‌వ‌హారాల‌ను జ‌ర‌ప‌వ‌చ్చు. ఏడాదికి సంబంధించిన స్టేట్‌మెంట్‌ను యాప్ ద్వారా తెచ్చుకోవ‌చ్చు. ఈ యాప్ రేటింగ్ 4.1 గా ఉంది.

English summary

మీకు ప‌నికొచ్చే 5 ఉత్త‌మ బ్యాంకింగ్ యాప్‌లు | 5 Best Mobile Banking Apps In India

Mobile banking has eased much of our banking related work which can be done within minutes. Banks are becoming more tech friendly in order to meet the financial requirements of customers. Many banks have come up with their bank apps which help us to make online Transaction, Pay Bills, మీకు ప‌నికొచ్చే 5 ఉత్త‌మ
Story first published: Monday, July 18, 2016, 11:20 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X