For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పాకిస్థాన్ మొత్తం కార్ల ఉత్ప‌త్తి క‌న్నా భార‌త్ కార్ల ఎగుమ‌తులు 4 రెట్లు

|

పాకిస్తాన్ ఆటోమోటివ్ మ్యాన్యుఫ్యాక్చ‌ర్స్ అసోషియేష‌న్ చెబుతున్న దాని ప్ర‌కారం ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాలు వెల్ల‌డ‌య్యాయి. పాకిస్తాన్ సంబంధిత వాహ‌న గణాంకాల‌ను చూస్తే భార‌త్‌లో ఉత్ప‌త్త‌యి ఎగుమ‌త‌మ‌వుతున్న కార్ల సంఖ్య మొత్తం పాకిస్తాన్‌లో ఉత్ప‌త్త‌యి అమ్ముడ‌వుతున్న దానికంటే నాలుగు రెట్లుగా ఉన్నాయి. ద‌క్షిణాసియాలో రెండు ప్ర‌ధాన దేశాల్లో ఉన్న వ్య‌త్యాసం ఈ విధంగా ఉంది.

2014-15లో భార‌త‌దేశ వ్యాప్తంగా 23.56 ల‌క్ష‌ల ప్యాసెంజ‌ర్ కార్లు అమ్ముడ‌వ‌గా, పాకిస్తాన్‌లో అదే కాలంలో అమ్మ‌కాలు 1.52 ల‌క్ష‌లుగా ఉన్నాయి. ఇదే ఇలా ఉంటే భార‌త ఎగుమతులు చూస్తే ఇంకా ఆశ్చ‌ర్యంగా ఉన్నాయి. 2014-15లో ఏడాది కాలంలోనే మ‌న దేశం 5.74 ల‌క్ష‌ల కార్ల‌ను ఎగుమ‌తి చేసింది. ఈ సంఖ్య‌ పాకిస్తాన్లో ఉత్ప‌త్త‌యి, అమ్ముడ‌యిన దాని కంటే నాలుగు రెట్లుగా ఉంది.

పాకిస్థాన్ మొత్తం కార్ల ఉత్ప‌త్తి క‌న్నా భార‌త్ ఎగుమ‌తులు

మ‌ధ్య ఆసియాకు ముఖ ద్వారంగా నిలుస్తున్న పాకిస్తాన్‌లో దేశీయ కార్ల త‌యారీ కంపెనీ ఒక్క‌టీ లేదు. మ‌రో ప‌క్క ఇక్క‌డ చూస్తే భార‌త‌దేశంలో త‌యార‌యి విదేశాల‌కు విప‌రీతంగా కార్ల‌ను ఎగుమ‌తులు చేస్తున్న దేశీయ కంపెనీలు ఉన్నాయి. టాటా, మ‌హీంద్రా, అశోక్ లేలాండ్‌, హీరో గ్రూప్ వీటికి ఉదాహ‌ర‌ణ. ఇవ‌న్నీ అంత‌ర్జాతీయంగా పేరు సంపాదించాయి. విదేశీ కంపెనీలైన జేఎల్ఆర్‌, ఎస్ఎస్‌యాంగ్ మోటార్ల కంపెనీల‌ను టాటా, మ‌హీంద్రా అండ్ మ‌హీంద్రా చేజిక్కుంచుకోవ‌డంతో దేశీయ వాహ‌న త‌యారీ కంపెనీల‌కు మ‌రింత ఊపు ల‌భించింది.

English summary

పాకిస్థాన్ మొత్తం కార్ల ఉత్ప‌త్తి క‌న్నా భార‌త్ కార్ల ఎగుమ‌తులు 4 రెట్లు | Indian car exports alone is four times more than Pakistan's total car production

Data accessed from the Pakistan Automotive Manufacturers' Association reveals an embarrassing statistic for the automotive industry in Pakistan.The latest numbers from Pakistan, when compared with those of India, show that the export of cars produced in India is four times that of the total vehicles produced and sold in Pakistan. Such is the disparity between the two economies.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X