For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ప్రధాని పర్యటన: భారత్‌లో అమెజాన్ పెట్టుబడుల వెల్లువ

By Nageshwara Rao
|

న్యూఢిల్లీ: ప్రపంచంలోనే అతిపెద్ద ఆన్‌లైన్ రిటైలర్ దిగ్గజ సంస్ధ అమెజాన్ భారత్ ఈ కామర్స్ రంగంలో అగ్రస్థానాన్ని సొంతం చేసుకునేందుకు భారీ స్థాయిలో పెట్టుబడులు పెడుతోంది. ఆన్‌లైన్ రంగంలో ఫ్లిప్‌కార్ట్‌ పోటీని తట్టుకుంటూనే భారత్‌లో తన కార్యకలాపాలను విస్తరించేందుకు గాను అదనంగా 300 కోట్ల డాలర్లను(దాదాపు రూ.20,169.75 కోట్లు) పెట్టుబడులను పెడుతున్నట్టు అమెజాన్ ప్రకటించింది.

భారత మార్కెట్లోకి ప్రవేశించిన ఏడాది అనంతరం 2014లో 200 కోట్ల డాలర్లను పెట్టుబడులుగా పెడతామని అమెజాన్ వెల్లడించిన సంగతి తెలిసిందే. దీంతో భారత్‌లో మొత్తం 500 కోట్ల డాలర్లను(రూ.30,750కోట్లు) పెట్టుబడులుగా పెడుతున్నట్టు అమెజాన్ వ్యవస్థాపకుడు, సీఈవో జెఫ్ బెజోస్ ప్రకటించారు.

భారత ఈ కామర్స్ రంగంలో నెంబర్ వన్ స్థానాన్ని కైవసం చేసుకునేందుకు గాను ఫ్లిప్‌కార్ట్, స్నాప్‌డీల్ లాంటి వెబ్‌సైట్లతో అమెజాన్ పోటీ పడుతోంది. అమెజాన్ పెట్టనున్న ఈ పెడ్డుబడులను కంపెనీ డిస్కౌంట్లు, ప్రకటనలు, లాజిస్టిక్స్ తదితరాలకు వినియోగించుకోనుంది.

భారత్‌లో అమెజాన్ పెట్టుబడుల వెల్లువ

భారత్‌లో అమెజాన్ పెట్టుబడుల వెల్లువ

ప్రధాని మోడీ అమెరికా పర్యనటలో ఉండగా అమెజాన్ సీఈవో జెఫ్ బెజోస్ ఈ పెట్టుబడుల ప్రకటన చేయడం విశేషం. యుఎస్-ఇండియా బిజినెస్ కౌన్సిల్(యూఎస్ఐబీసీ) గ్లోబల్ లీడర్ షిప్ అవార్డును, సన్ ఫార్మాస్యూటికల్ వ్యవస్థాపకుడు దిలీప్ సంఘ్వీతో కలిసి బెజోస్ ప్రధాని మోడీ చేతుల మీదుగా అందుకున్నారు.

 భారత్‌లో అమెజాన్ పెట్టుబడుల వెల్లువ

భారత్‌లో అమెజాన్ పెట్టుబడుల వెల్లువ

ఈ సందర్భంగా ఆమెజాన్ సీఈఓ బెజోస్ మాట్లాడుతూ భారత ఆర్థికవ్యవస్థలో మరింత వృద్ధిని సాధిస్తామని ఆశాభావం వ్యక్తంచేశారు. భారత్‌ మార్కెట్‌లోకి అమెజాన్ జూన్ 2013న ప్రవేశించింది. గత వారమే అమెజాన్ మూడేళ్ల వార్షికోత్సవాన్ని జరుపుకుంది. కాగా ఫ్లిప్‌కార్ట్ 2007, స్నాప్‌డీల్ 2010లో భారత మార్కెట్లోకి ప్రవేశించాయి.

 భారత్‌లో అమెజాన్ పెట్టుబడుల వెల్లువ

భారత్‌లో అమెజాన్ పెట్టుబడుల వెల్లువ

సరుకు రవాణాలో ఇప్పటికే స్నాప్‌డీల్‌ను అమెజానా దాటేసింది. ఫ్లిప్‌కార్ట్ మార్కెట్‌ షేర్‌కు సమీపంలో ఉంది. కాగా అమెజాన్ భారత మార్కెట్లో 45 వేల ఉద్యోగాలను సృష్టించింది. అతిపెద్ద మార్కెట్ చైనాను సొంతం చేసుకోవాలన్న అమెజాన్‌కు అక్కడి స్థానిక ఈ-కామర్స్ దిగ్గజం అలీబాబాతో గట్టి పోటీనే ఎదురైంది.

భారత్‌లో అమెజాన్ పెట్టుబడుల వెల్లువ

భారత్‌లో అమెజాన్ పెట్టుబడుల వెల్లువ

దీంతో చివరకు ఆలీబాబాతో పోటీని తట్టుకోలేక చైనా మార్కెట్‌ను కోల్పోయింది. ప్రస్తుతం భారత మార్కెట్‌పై పట్టు సాధించేందుకు గాను భారీ ఎత్తున పెట్టుబడులను పెడుతోంది. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో భారత మార్కెట్‌ను గెలవడం కూడా అమెజాన్ కష్టమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

English summary

ప్రధాని పర్యటన: భారత్‌లో అమెజాన్ పెట్టుబడుల వెల్లువ | Amazon increases India investments to $5 billion

Amazon Inc, the world’s largest online retailer, is planning to invest another $3 billion in India in the coming two years. This after the company exhausted its earlier investment pledge of $2 billion.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X