For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

టాప్ 10లో ముగ్గురు: అత్యధిక వేతన సీఈఓల జాబితా

By Nageswara Rao
|

ప్రపంచంలోనే అత్యధిక వేతనాలు అందుకుంటున్న కంపెనీల చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్ల (సీఈఓ) జాబితాలో భారత్ సంతతికి చెందిన ముగ్గురికి స్థానం లభించింది. 2015లో సగటున 14.5మిలియన్ డాలర్ల (సుమారు రూ.96 కోట్లు) వేతనం లభించిన సీఈఓల పేర్లతో ఈక్విలార్‌ అనే సంస్థ ఈ జాబితాను రూపొందించింది.

గతేడాది కంటే వీరి వేతనం 3 శాతం పెరిగిందని సంస్థ తెలిపింది. పెప్సికో సీఈఓ ఇంద్రా నూయి, లాండెల్‌ బాసెల్‌కు చెందిన భావేశ్‌ పటేల్‌ ఈ జాబితాలోని తొలి 10 మందిలో నిలిచారు.
టాప్‌ 10 సీఈఓల్లో రసాయనాల కంపెనీ అయిన లాండెల్‌ బాసెల్‌ ఇండస్ట్రీస్‌ సీఈఓ అయిన భావేశ్‌ పటేల్‌ 24.5 మిలియన్‌ డాలర్ల (రూ.160 కోట్లకు పైగా) వేతనం అందుకుని 6వ స్థానంలో నిలిచారు.

ఇంద్రా నూయి

ఇంద్రా నూయి

22.2 మి.డాలర్ల (రూ.145 కోట్లకు పైగా) వేతనంతో ఇంద్రా నూయి 8వ స్థానం పొందారు. ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌ సిఇఒ సత్య నాదెళ్ల 1.83 కోట్ల డాలర్ల వేతనంతో 26వ స్థానంలో నిలిచారు. ఈ జాబితాలో అగ్రస్థానం ఒరాకిల్‌ కార్పొరేషన్‌కు చెందిన మార్క్‌ వీ హర్‌, సాఫా ఏ కాట్‌కు దక్కింది. వీరికి 53.2 మిలియన్‌ డాలర్లు (రూ.350 కోట్లకు పైగా) వేతనం లభించింది.

సిఇఒ రాబర్ట్‌

సిఇఒ రాబర్ట్‌

టాప్‌ 10 జాబితాలో వాల్ట్‌డిస్నీ సిఇఒ రాబర్ట్‌ (4.53 కోట్ల డాలర్లు), హనీవెల్‌ ఇంటర్నేషనల్‌కు చెందిన డేవిడ్‌ ఎం కోట్‌ (3.31 కోట్ల డాలర్లు), జనరల్‌ ఎలక్ర్టిక్‌కు చెందిన జఫ్రీ ఆర్‌ ఇమ్మెల్ట్‌ (2.64 కోట్ల డాలర్లు), ఎటి అండ్‌ టి చీఫ్‌ రాండల్‌ ఎల్‌ స్టీఫెన్‌సన్‌ (2.24 కోట్ల డాలర్లు) ఉన్నారు. కంపెనీలు సమర్పించిన వార్షిక నివేదికల ఆధారంగా ఈ జాబితాను రూపొందించారు.

మహిళా సీఈఓకు

మహిళా సీఈఓకు

జాబితాలో ఎనిమిది మంది మహిళా సీఈఓకు చోటు లభించింది. 2015 ఆర్థిక సంవత్సరంలో 100 మంది సీఈఓల సగటు వేతనం 1.45 కోట్ల డాలర్లుగా ఉంది. ఆదాయ పరంగా యాపిల్‌ అగ్రస్థానంలో నిలిచింది. 2015 సంవత్సరంలో ఈ కంపెనీ రాబడి 23,370 కోట్ల డాలర్లుగా ఉంది.

టిమ్‌ కుక్‌కు

టిమ్‌ కుక్‌కు

బెర్క్‌షైర్‌ హాత్‌వే 210.8 బిలియన్ డాలర్ల ఆదాయంతో ఆ తర్వాతి స్థానంలో నిలిచింది. యాపిల్‌ సీఈఓ టిమ్‌ కుక్‌కు 10.3 మి.డాలర్లు, బెర్క్‌షైర్‌కు చెందిన వారెన్‌ బఫెట్‌కు 4,70,244 డాలర్ల వేతనం మాత్రమే లభించింది. ప్రముఖ ఇన్వెస్టర్‌ వారెన్‌ బఫెట్‌ వేతనం అతి తక్కువగా 4,70,244 డాలర్లు ఉంది.

English summary

టాప్ 10లో ముగ్గురు: అత్యధిక వేతన సీఈఓల జాబితా | Indra Nooyi, Satya Nadella, Bhavesh Patel among highest paid CEOs in the world

As many as three Indian origin persons have been named among 100 highest-paid CEOs globally with PepsiCo's Indra Nooyi and LyondellBasell's Bhavesh Patel making it to the top ten list compiled by Equilar.
Story first published: Friday, April 29, 2016, 15:56 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X