For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సరైన ధరకు స్పెక్ట్రమ్‌ పొందలేకపోతే భారత్‌కు గుడ్‌బై

By Nageswara Rao
|

న్యూఢిల్లీ: సరైన రేటుకు స్పెక్ట్రాన్ని పొందలేకపోతే భారత్‌ టెలికాం రంగం నుంచి వైదొలగే అవకాశం ఉందని నార్వే సంస్థ టెలినార్‌ సూచనప్రాయంగా పేర్కొంది. దేశీయ టెలికాం వ్యాపారానికి సంబంధించి 2016 జనవరి-మార్చి త్రైమాసికంలో రూ.2,530 కోట్ల నిర్వహణ నష్టాలు రావడంతో సంస్థ ఈ దిశగా ఆలోచిస్తోందని సమాచారం.

టెలినార్‌ ఆర్థిక ఫలితాలను నార్వేలో సంస్థ అంతర్జాతీయ ముఖ్య కార్యనిర్వహణాధికారి సీవ్‌ బ్రెకే వెల్లడించారు. భారత టెలికాం వ్యాపారం ద్వారా ఈ ఏడాది 2,530 కోట్ల రూపాయల నష్టం వాటిల్లినట్లు తెలిపారు. భారత్‌లో వాయిస్‌ ఆదాయం తగ్గడంతో, ప్రతి వినియోగదారుడిపై ఆర్జించే సగటు 8 శాతం తగ్గి రూ.90కి పరిమితం అయ్యిందన్నారు.

ప్రస్తుత స్పెక్ట్రం పోర్టుఫోలియోతో పోటీ పడలేకపోతున్నామని టెలినార్‌ సిఇఒ సీవ్‌ బ్రెకే చెప్పారు. సరసమైన ధరకు స్పెక్ట్రాన్ని పొందాలని యోచిస్తున్నామని తెలిపారు. ఇందుకోసం భవిష్యతలో జరిగే వేలంపాటలపై, ఇతర కంపెనీలతో ట్రేడింగ్‌ చేయడం గురించి శ్రద్ధ పెడుతున్నామన్నారు.

Telenor Hints at India Exit; Runs Up Huge Operating Loss

ఇదే సమయంలో 4జీ సేవలను అందుబాటు ధరల్లోనే అందిస్తామని పేర్కొన్నారు. 4జి సేవలను కనిష్ఠ ధరలకు అందిస్తామని తెలిపింది. భారతలో లాభార్జనకు వచ్చామని, ఇదే జరగకుంటే ఇతర ప్రత్యామ్నాయాలపై దృష్టి సారిస్తామని కంపెనీ సీఎఫ్ఓ మోర్టెన్‌ కార్ల్‌సన్‌ సోబీ ఈ సందర్భంగా పేర్కొన్నారు.

మరోవైపు భారత్‌లో అనుకున్నంతమేర వృద్ధి సాధించలేకపోతున్నామని యాపిల్‌ వ్యాఖ్యానించింది. ఇండియాలో నెట్‌వర్క్స్‌ చాలా నెమ్మది అని, రిటైల్‌ నిర్మాణం సరిగా లేదని, అందువల్లనే అనుకున్నంత మేర లాభాలను ఆర్జించలేకపోతున్నామని యాపిల్‌ సిఇఒ టిమ్‌ కుక్‌ చెప్పారు.

భారతలో తమ వ్యాపారానికి భారీ అవకాశాలున్నా.. పైకారణాలతో మంచి వృద్ధి సాధించలేక పోతున్నామన్నామని చెప్పారు. ప్రపంచంలో భారత మూడో అతిపెద్ద స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌ అని, అయితే ఇక్కడ ఎక్కువగా చౌక స్మార్ట్‌ఫోన్లకు ప్రాధాన్యమిస్తారని ఆయన అన్నారు.

ఇక్కడి ఆర్థిక పరిస్థితుల కారణంగా మార్కెట్‌ అనుకున్నంత గొప్పగా లేదన్నారు. 13 ఏళ్లలో కంపెనీ రెవెన్యూ తొలిసారి ఈ దఫా క్షీణించిందన్నారు. ప్రస్తుతం భారత పరిస్థితి ఏడేళ్ల క్రితం చైనా పరిస్థితిలా ఉందని, అయితే భారతలో మంచి వ్యాపారావకాశాలున్నాయని కుక్‌ అన్నారు.

చైనాలో యాపిల్‌ విక్రయాలు ఈ ఏడాది 11 శాతం క్షీణించగా, భారతలో 56 శాతం పెరిగాయి. వర్ధమాన దేశాలపై యాపిల్‌ దృష్టి పెడుతుందని చెప్పారు. ఇలాంటి దేశాల్లో వృద్ధి అసమతుల్యంగా ఉంటుందన్నారు. భారతలో ఈ ఏడాది ఎల్‌టిఇ సేవలు అందుబాటులోకి వస్తున్నాయని, సమీప భవిష్యతలో భారతలో మంచి నెట్‌వర్క్‌ ఉంటుందని చెప్పారు.

English summary

సరైన ధరకు స్పెక్ట్రమ్‌ పొందలేకపోతే భారత్‌కు గుడ్‌బై | Telenor Hints at India Exit; Runs Up Huge Operating Loss

Posting a huge operating loss of NOK 3.1 billion (around Rs 2,530 crores) for its Indian telecom business, Telenor Wednesday hinted at exiting India if it fails to procure spectrum at reasonable rates.
Story first published: Thursday, April 28, 2016, 16:56 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X