For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

జాగ్రత్త సుమా: ఆన్‌లైన్ ఆఫర్లు ఎంత వరకు మేలు?

By Nageswara Rao
|

ఇంటర్నెట్ వచ్చిన తర్వాత సుమారు 60 శాతం షాపింగ్ ఆన్‌లైన్ ద్వారానే జరుగుతోందని ఈ కామర్స్ దిగ్గజ వెబ్‌సైట్లు చెబుతున్నాయి. ఈ మధ్య కాలంలో ఏ ఈ కామర్స్ వెబ్‌సైట్ చూసిన కళ్లు చెదిరే అఫర్లతో వినియోగదారులను మరింతగా ఊరిస్తున్నాయి.

అయితే ఆర్ధిక నిపుణులు, నెటిజన్లు మాత్రం ఈ కామర్స్ వెబ్ సైట్ల కొనుగోళ్లలో పలు జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు. నిజం చెప్పాలంటే ఈకామర్స్ దిగ్గజాలైన ప్లిప్‌కార్ట్, జబాంగ్, అమెజాన్, లెన్స్‌కార్ట్ లాంటి దిగ్గజ వెబ్ సైట్లు మొదట్లో వినియోగదారులను ఆకర్షించేందుకు ఎన్నో ఆఫర్లను అందించారు.

ముఖ్యంగా పండగొచ్చినా, పబ్బమొచ్చినా ఈ వెబ్‌సైట్లు పోటీ పడి ఆఫర్లు ప్రకటిస్తుంటాయి. కొన్ని ఉత్పత్తులకైతే రూపాయికే ఆర్డర్‌ ప్లేస్‌ చేయండని అంటూ వినియోగదారులను ఊరిస్తుంటాయి. వీలైనంత ఎక్కువ మంది ఆన్‌లైన్‌ ఖాతాదారులను సంపాదించి అమ్మకాలు పెంచుకోవడమే ఈ వెబ్‌సైట్ల లక్ష్యం.

అందుకే ఆఫర్లను జాగ్రత్తగా పరిశీలించి వినియోగదారులు ఆర్డర్‌ చేయాల్సి ఉంటుంది. ఆ జాగ్రత్తలు ఏంటో ఒక్కసారి చూద్దాం.

తక్కువ ధర షిప్పింగ్ ఛార్జీలు

తక్కువ ధర షిప్పింగ్ ఛార్జీలు

కొంత మంది రిటైలర్లు తమ ఉత్పత్తుల ధర తక్కువగా నిర్ణయించినా, వాటి షిప్పింగ్‌ కోసం నగదు భారీగా వసూలు చేస్తుంటారు. ఇటీవల ఓ ఈ కామర్స్‌ దిగ్గజం మొబైల్‌ కేసులు, కవర్లను 80 శాతం డిస్కౌంట్‌తో ఆఫర్‌ ప్రకటించింది. అందులో మోటో జి2 కవర్‌ను రూ. 27కే అందుబాటులో ఉంచింది. ఆ కవర్‌ డెలివరీ ఛార్జీ మాత్రం రూ.100గా నిర్ణయించింది. కొనుగోలుదారులను ఏమార్చేందుకు ఈ కామర్స్‌ వెబ్‌సైట్లు ఇలాంటి ఆఫర్లు ప్రకటిస్తుంటాయి. ఇలాంటి వాటిలో అప్రమత్తంగా ఉండాలి.

 నకిలీ ఉత్పత్తులు

నకిలీ ఉత్పత్తులు

ఆన్‌లైన్‌లోనూ నకిలీ ఉత్పత్తులు హల్‌చల్‌ చేస్తున్నాయి. ఈ కామర్స్‌ వెబ్‌సైట్‌లో ఫొటోలు చూసి ఆర్డర్‌ చేస్తే, తీరా డెలివరీ అయ్యాక నకిలీ వస్తువులను డెలివరీ చేస్తున్నారు. కొన్ని వెబ్‌సైట్లు ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నా, కొన్ని మాత్రం నిర్లక్ష్యంగా ఉంటున్నాయి.

వారెంటీ ఉండటం లేదు

వారెంటీ ఉండటం లేదు

ఆన్‌లైన్‌లో కొనే తమ వస్తువులకు ఎలాంటి వారెంటీ ఉండదని లెనోవో, హెచ్‌పి, డెల్‌, తోషిబా, ఆసుస్‌, నికాన్‌, ఎల్‌జి, సోనీ వంటి కంపెనీలు ఇప్పటికే వినియోగదారులను హెచ్చరించాయి. ఆన్‌లైన్‌ రిటైల్‌ కంపెనీలు వేటికీ తమ వస్తువులను తిరిగి అమ్మే అధికారం లేనందున, వాటి ద్వారా కొనే వస్తువులకు వారెంటీ ఇవ్వలేమని ఈ కంపెనీలు స్పష్టం చేశాయి.

కొనేముందు రెండు మూడు సైట్లను పరిశీలించాలి

కొనేముందు రెండు మూడు సైట్లను పరిశీలించాలి

నేరుగా ఈ రిటైలర్స్‌ వెబ్‌సైట్లకు వెళ్లే బదులు జంగ్లీ, మైస్మార్ట్‌ప్రైస్‌ వంటి వెబ్‌సైట్లను పరిశీలించాలి. వివిధ ఈ కామర్స్‌ వెబ్‌సైట్లలో ఏయే ధరలు ఉన్నాయో తెలుసుకుని, చౌకగా లభించే వెబ్‌సైట్‌ నుంచి ఆర్డర్‌ చేయవచ్చు. రిటర్న్‌ పాలసీ కూడా తెలుసుకోవాలి.

English summary

జాగ్రత్త సుమా: ఆన్‌లైన్ ఆఫర్లు ఎంత వరకు మేలు? | Be careful with online offers

Be careful with online offers.
Story first published: Monday, April 25, 2016, 15:29 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X