For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మెరుస్తున్న పసిడి: మళ్లీ 28 వేల ఎగువకు

By Nageswara Rao
|

దేశ రాజధాని ఢిల్లీ మార్కెట్‌లో మంగళవారం బంగారం ధర ఒక రోజులో రూ. 710 పెరిగి 28000 మార్క్‌ను చేరుకుంది. ఒకే రోజు బంగారం ధర ఈ స్థాయిలో పెరగడం ఈ మధ్య కాలంలో ఇదే తొలిసారి. బుధవారం అదే స్థాయిలో కూడా బంగారం ధర 28,172 వద్ద కొనసాగుతుంది.

10 గ్రాముల స్వచ్ఛమైన 24 క్యారెట్ల బంగారం ధర మంగళవారం 28,585 రూపాయలను, ఆభరణాల బంగారం ధర 28,435 రూపాయలను తాకింది. దేశ ఆర్థిక రాజధాని ముంబై మార్కెట్లోనూ అదే పరిస్థితి. ఇక స్వచ్ఛమైన బంగారం సరిగ్గా సంవత్సరం తర్వాత మళ్లీ 28 వేల మార్క్‌ను దాటింది.

బుధారం ముంబై మార్కెట్లో స్వచ్ఛమైన బంగారం (10గ్రాములు) ధర 28,534 రూపాయలను తాకింది. అంతర్జాతీయ మార్కెట్లో బుల్లిష్‌ ట్రెండ్‌, రిటైల్‌ కొనుగోలుదారులు, ఆభరణాల తయారీదారులు మళ్లీ భారీగా కొనుగోళ్లు చేస్తుండటంతో ధరలు పెరుగుతున్నాయి.

Gold Up For 8th Straight Day As global Equities Dive

అంతేకాదు వేసవి సమీపిస్తుండటంతో రిటైల్ కొనుగోళ్లు పెరుగుతాయనే అంచనాల మధ్య ఢిల్లీలో గత ఎనిమిది రోజుల్లో 10 గ్రాముల బంగారం ధర 825 రూపాయల మేర పెరిగింది. ఈరోజు ఢిల్లీలో 10 గ్రాముల బంగారం ధర రూ. 28,663గా ఉంది.

డాలర్‌ మారకంలో రూపాయి విలువ పతనం వల్ల దిగుమతుల వ్యయం పెరగడం, ఈక్విటీ మార్కెట్లలో బలహీనత వల్ల ఎగుమతుల కారణంగా ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను బులియన్‌ మార్కెట్‌కు మళ్లిస్తున్నారు. వెండి మార్కెట్ కూడా మళ్లీ కళకళలాడుతోంది.

ఈరోజు కిలో వెండి ధర 1185 పెరుగుదలతో 37235 రూపాయలను చేరింది. పారిశ్రామిక సంస్థలు, నాణేల తయారీదారులు ముమ్మరంగా కొనుగోళ్లు జరుపుతున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్‌ బంగారం ధర తాజాగా 1200 డాలర్లను దాటింది. గతేడాది జూన్‌ తర్వాత మళ్లీ ఈ స్థాయిని చేరడం ఇదే మొదటి సారి.

English summary

మెరుస్తున్న పసిడి: మళ్లీ 28 వేల ఎగువకు | Gold Up For 8th Straight Day As global Equities Dive

Equity markets across the globe nosedived on fears of a global recession, pushing investors towards a safe haven asset like gold. The precious metal notched up its 8th straight day of gains.
Story first published: Wednesday, February 10, 2016, 15:00 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X