For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బెజవాడకు చెర్రీ ట్రూజెట్ బైబై: డిసెంబర్ 1 నుంచి నిలిపివేత

By Nageswara Rao
|

హైదరాబాద్: హైదరాబాద్-గన్నవరం విమానాశ్రయంల మధ్య నడుస్తున్న ట్రూజెట్ విమాన సర్వీసులను డిసెంబర్ 1 నుంచి నిలిపివేస్తున్నట్లు ఆ సంస్థ ప్రకటించింది. ప్రస్తుతం హైదరాబాద్-విజయవాడలకు మధ్య ప్రయాణీకుల సంఖ్య తక్కువగా ఉండటంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ అధికారి ప్రతినిధి తెలిపారు.

వచ్చే ఏడాది జులై నుంచి తిరిగి సర్వీసుల పునరుద్ధరణ అంశాన్ని అప్పుడే తెలియజేస్తామన్నారు. గన్నవరం విమానాశ్రయం అధికారుల సమాచారం ప్రకారం విజయవాడ నుంచి హైదరాబాద్‌కు వెళ్లే విమానాల్లో 80 శాతం అక్యుపెన్సీ రేటు ఉందని, అయితే హైదరాబాద్ నుంచి రిటన్ ప్లైట్స్ అక్యుపెన్సీ రేటు కేవలం 40 శాతంగా ఉందన్నారు.

బెజవాడకు చరణ్ ట్రూజెట్ బైబై: డిసెంబర్ 1 నుంచి నిలిపివేత

బెజవాడకు చరణ్ ట్రూజెట్ బైబై: డిసెంబర్ 1 నుంచి నిలిపివేత

దీనిని దృష్టిలో పెట్టుకునే ట్రూజెట్ సంస్ధ ప్రతినిధులు విజయవాడ నుంచి తమ సర్వీసులను ఒక నెలపాటు నిలిపివేస్తున్నారని గన్నవరం విమానాశ్రయం డైరెక్టర్ మధుసూధన రావు వెల్లడించారు. అయితే త్వరలోనే హైదరాబాద్ నుంచి గోవాకు సర్వీసులను ప్రారంభిస్తున్న నేపథ్యంలో విజయవాడకు సర్వీసులను నిలిపివేస్తున్నట్లు తెలిసిందన్నారు.

బెజవాడకు చరణ్ ట్రూజెట్ బైబై: డిసెంబర్ 1 నుంచి నిలిపివేత

బెజవాడకు చరణ్ ట్రూజెట్ బైబై: డిసెంబర్ 1 నుంచి నిలిపివేత

దీంతో పాటు విజయవాడ పాలనా కేంద్రంగా విమాన సర్వీసులను నిర్వహిస్తున్న ఎయిర్ కోస్టా కూడా క్రాప్ట్ నిర్వహణ కోసం కొన్ని రోజుల పాటు హైదరాబాద్‌కు సర్వీసులను నిలిపివేసింది. కాగా విమానయాన సంస్థ ట్రూజెట్‌కు సినీ నటుడు రామ్ చరణ్ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నారు.

బెజవాడకు చరణ్ ట్రూజెట్ బైబై: డిసెంబర్ 1 నుంచి నిలిపివేత

బెజవాడకు చరణ్ ట్రూజెట్ బైబై: డిసెంబర్ 1 నుంచి నిలిపివేత

ప్రస్తుతం గన్నవరం విమానాశ్రయం వివిధ సంస్థలకు చెందిన 12 విమాన సర్వీసులను అందిస్తోంది. ఇందులో ఐదు హైదరాబాద్ నుంచి విజయవాడకు తమ సర్వీసులను నడుపుతున్నాయి. ఇప్పుడు ట్రూజెట్ తన సర్వీసులను నిలిపివేయడంతో నాలుగు సర్వీసులు మాత్రమే ఉన్నాయి.

బెజవాడకు చరణ్ ట్రూజెట్ బైబై: డిసెంబర్ 1 నుంచి నిలిపివేత

బెజవాడకు చరణ్ ట్రూజెట్ బైబై: డిసెంబర్ 1 నుంచి నిలిపివేత

గతంలో అత్యంత చెత్త సర్వీసు అందిస్తోన్న ఎయిర్‌లైన్స్ జాబితాలో ట్రూజెట్ రెండో స్థానంలో నిలిచింది. డీజీసీఏ నివేదిక ప్రకారం ఎప్పుడుపడితే అప్పుడు సర్వీస్‌ను రద్దు చేస్తున్న ఎయిర్‌లైన్స్‌లో ఎయిర్ పెగాసస్ తర్వాత చరణ్‌కు చెందిన ట్రూ జెట్‌ ఉంది. ప్రయాణికుల ఫిర్యాదులైతే ట్రూజెట్‌పై అత్యధికంగా నమోదయ్యాయి.

English summary

బెజవాడకు చెర్రీ ట్రూజెట్ బైబై: డిసెంబర్ 1 నుంచి నిలిపివేత | Trujet suspends flights between hyderabad, Vijayawada

Trujet suspends flights between hyderabad, Vijayawada.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X