For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వడ్డీరేట్లు యధాతథమే..!: ఆర్ధిక నిపుణులు

By Nageswara Rao
|

ముంబై: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) డిసెంబర్ 1న ద్రవ్య పరపతి విదాన సమీక్షలో కీలక వడ్డీరేట్లను యధాతథంగా ఉంచే అవకాశం ఉందని ఆర్ధిక నిపుణలు విశ్లేషిస్తున్నారు. ద్రవ్యోల్బణాన్ని దృష్టిలో పెట్టుకుని వడ్డీ రేట్ల కోతను ఆపాల్సి ఉంటుందంటున్నారు.

అంతేకాదు గడిచిన రెండు నెలలుగా ద్రవ్యోల్బణం ఎగువముఖం పట్టడం, అగ్రరాజ్యం అమెరికా ఫెడరల్ రిజర్వు వడ్డీరేట్లను పెంచేందుకు సమాయత్తమవుతున్న ఈ తరుణంలో ఆర్‌బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ ఇంట్రస్ట్‌రేట్లను యథాతథ స్థితిలోనే కొనసాగించవచ్చునని అత్యధికమంది అభిప్రాయపడుతున్నారు.

వడ్డీరేట్లు యధాతథమే..!: ఆర్ధిక నిపుణులు

వడ్డీరేట్లు యధాతథమే..!: ఆర్ధిక నిపుణులు

అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితులతో ఆర్‌బీఐ రాజన్ వడ్డీరేట్లపై వేచి చూసే ధోరణి అవలంభించవచ్చునని యూకో బ్యాంక్ ఎండీ, సీఈవో ఆర్‌కే ఠక్కర్ తెలిపారు. దేశవ్యాప్తంగా వర్షాభావ పరిస్థితులు నెలకొనడం, పప్పు దినుసుల ధరలు భగ్గుమండుతుండటం, టమాటా ధరలు అధికమవడంతో ఈ నెలలో ద్రవ్యోల్బణ గణాంకాలు మరింత పెరిగే ప్రమాదం ఉందన్న అంచనాతో రాజన్ రేట్లను తగ్గించే అవకాశాలు సన్నగిల్లాయని ఆయన పేర్కొన్నారు.

వడ్డీరేట్లు యధాతథమే..!: ఆర్ధిక నిపుణులు

వడ్డీరేట్లు యధాతథమే..!: ఆర్ధిక నిపుణులు

మంగళవారం నిర్వహించనున్న ఐదో సమీక్షలో కీలక వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగించనున్న రాజన్, ఫిబ్రవరిలో జరగనున్న సమీక్షలో మాత్రం పావు శాతం కోత పెట్టే అవకాశం ఉందని బ్యాంక్ ఆఫ్ అమెరికా మెరిల్లించ్ తెలిపింది. మధ్య తూర్పు దేశాల్లో రాజకీయ అస్థిరత పరిస్థితులు నెలకొనడం, ముఖ్యంగా ఉగ్రవాదుల దాడులు మరింత పెరగడంతో ఆయా దేశాల ఆర్థిక పరిస్థితులపై ప్రభావం చూపనుంది.

వడ్డీరేట్లు యధాతథమే..!: ఆర్ధిక నిపుణులు

వడ్డీరేట్లు యధాతథమే..!: ఆర్ధిక నిపుణులు

ఈ నేపథ్యంలో ఆర్‌బీఐ వడ్డీరేట్లను యథాతథ స్థితిలోనే కొనసాగించేందుకు మొగ్గుచూపనున్నట్లు తెలిపింది. డిసెంబర్ 16న ఫెడరల్ రిజర్వు సమావేశమవనున్నది. 2008 తర్వాత ఫెడ్ వడ్డీరేట్లను పావు శాతం పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి. తాజాగా ఏడో వేతన సంఘం సిఫారసుల అమలు వల్ల ప్రభుత్వంపై ప్రతి ఏటా అదనంగా రూ. లక్ష కోట్ల భారం పడుతుందని అంచనా వేస్తున్నారు.

వడ్డీరేట్లు యధాతథమే..!: ఆర్ధిక నిపుణులు

వడ్డీరేట్లు యధాతథమే..!: ఆర్ధిక నిపుణులు

ఈ ఏడాదిలో ఆర్‌బీఐ వడ్డీరేట్లను ఇప్పటికే మూడుసార్లు 0.25 శాతం చొప్పున (మొత్తం 0.75 శాతం) తగ్గించింది. దీంతో బ్యాంకులకు వర్తించే రెపో రేటు 7.25 శాతంగా ఉంది. రివర్స్‌రెపో 6.25 శాతంగా ఉంది. కేవలం వడ్డీరేట్ల తగ్గింపు ద్వారానే వృద్ధికి ఊతమివ్వడం కాకుండా వ్యవస్థ మూలాలను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం తన వంతు చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని కొందరు విశ్లేషకులు భావిస్తున్నారు.

English summary

వడ్డీరేట్లు యధాతథమే..!: ఆర్ధిక నిపుణులు | Dec Monetary Policy: RBI To Hold Interest Rates Steady

The Reserve Bank of India (RBI) is expected to hold repo rates steady in its meeting on Dec 1, 2015. CPI Inflation has already edged up in the month of Dec to 5 per cent, as against 4.4 per cent in the month of Sept.
Story first published: Monday, November 30, 2015, 12:08 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X