For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

న్యాయ భారతి: భారతి గ్రూప్ వారసులపై మిట్టల్

By Nageswara Rao
|

న్యూఢిల్లీ: భారతీ ఎంటర్‌ప్రైజెస్ ఛైర్మన్ సునీల్ మిట్టల్ తన వారసులు కంపెనీ పగ్గాలు చేపట్టకపోవచ్చంటూ సంకేతం ఇచ్చారు. భారతీ గ్రూపు రోజువారీ కార్యకలాపాలను అత్యంత సామర్థ్యం ఉన్న నిపుణులు పర్యవేక్షిస్తున్నారన్నారు.

తన సంతానం ఎవరి వ్యాపారాలు వారు చేసుకుంటున్నారని ఆయన చెప్పారు. మిట్టల్‌కు ఇద్దరు కుమారులు (కవలలు - శ్రవన్, కవిన్). ఒక కుమార్తె ఈశా ఉన్నారు. తన కుమార్తె ఈశా ప్రస్తుతం లండన్‌లో ఉంటోందన్నారు.

కుమారుడు కవిన్‌ హైక్‌ మెసెంజర్‌ వ్యవస్థాపక సీఈఓ సొంతంగా కెరీర్‌ నిర్మించుకుంటుండగా శ్రవిణ్‌ ఒక పీఈ సంస్థలో కెరీర్‌ చేపట్టాడని తెలిపారు. ఇక నా సోదరుడు రాకేశ్ కుమారుడు సొంతంగా ఆహార వ్యాపారం చేస్తున్నారన్నారు.

 సీఎస్ఆర్ కింద్ ప్రతి ఏటా రూ. 5 కోట్లు: మిట్టల్

సీఎస్ఆర్ కింద్ ప్రతి ఏటా రూ. 5 కోట్లు: మిట్టల్

ప్రస్తుతం వారంతా తమకిష్టమైన పనులు చేస్తున్నారు. ఒకవేళ భారతీ గ్రూపులోకి రావాలనుకుంటే వారు ఏ స్థానంలో సరిపోతారో అప్పుడు ఆలోచిస్తానని చెప్పుకొచ్చారు. చాలా కాలంగా మిట్టల్‌ రోజువారీ వ్యాపార కార్యకలాపాలకు దూరంగా ఉంటూ ఆ బాధ్యతను వృత్తినిపుణులైన సీఈఓలకు అప్పగించిన సంగతి తెలిసిందే.

సీఎస్ఆర్ కింద్ ప్రతి ఏటా రూ. 5 కోట్లు: మిట్టల్

సీఎస్ఆర్ కింద్ ప్రతి ఏటా రూ. 5 కోట్లు: మిట్టల్

ఈ గ్రూప్‌లో ప్రధాన సంస్థ భారతి ఎయిర్‌టెల్‌ ప్రపంచంలోనే మూడో పెద్ద టెలికాం ఆపరేటర్‌గా నిలిచింది. ఈ సందర్భంగా సునీల్ మిట్టల్ మాట్లాడుతూ చిన్న చిన్న కోర్టు కేసులకు సంబంధించి తొలిసారిగా విచారణను ఎదుర్కొంటున్న ఖైదీలకు(అండర్‌ట్రైయల్స్) భారతీ ఎంటర్‌ప్రైజెస్ న్యాయపరమైన సహాయాన్ని అందించనుందన్నారు.

 సీఎస్ఆర్ కింద్ ప్రతి ఏటా రూ. 5 కోట్లు: మిట్టల్

సీఎస్ఆర్ కింద్ ప్రతి ఏటా రూ. 5 కోట్లు: మిట్టల్

ఇందుకోసం ‘న్యాయ భారతి' పేరుతో ఏటా రూ.10 కోట్ల మొత్తాన్ని వెచ్చించనున్నట్లు ప్రకటించింది. చిన్నపాటి నేరాలు చేసి విచారణలో సమయంలో బెయిల్‌కు డబ్బులు లేక, పూచీకత్తు మొత్తాలను చెల్లించలేని ఖైదీల కోసం భారతీ పౌండేషన్ కింద 'న్యాయభారతి' పేరిట సహాయం చేయనుంది.

 సీఎస్ఆర్ కింద్ ప్రతి ఏటా రూ. 5 కోట్లు: మిట్టల్

సీఎస్ఆర్ కింద్ ప్రతి ఏటా రూ. 5 కోట్లు: మిట్టల్

కాగా, తన వేతనం నుంచి వ్యక్తిగతంగా ఈ ప్రాజెక్టు ఫండ్‌కు ప్రతియేటా రూ.5 కోట్లను ఇవ్వనున్నట్లు భారతీ ఎంటర్‌ప్రైజెస్ చైర్మన్ సునీల్ మిట్టల్ చెప్పారు. న్యాయ భారతి సేవలను వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నుంచి మొట్టమొదట ఢిల్లీ-ఎన్‌సీఆర్, పంజాబ్‌లలో ప్రారంభించనున్నామని, తర్వాత జమ్ము-కాశ్మీర్, హర్యానా, రాజస్థాన్ వంటి మరిన్ని రాష్ట్రాలకు దీన్ని విస్తరించనున్నట్లు ఆయన వెల్లడించారు.

సీఎస్ఆర్ కింద్ ప్రతి ఏటా రూ. 5 కోట్లు: మిట్టల్

సీఎస్ఆర్ కింద్ ప్రతి ఏటా రూ. 5 కోట్లు: మిట్టల్

కార్పొరేట్ సామాజిక బాధ్యత(సీఎస్‌ఆర్)లో భాగంగా భారతీ ఎయిర్‌టెల్ ఈ ప్రాజెక్టుకు రూ. 10 కోట్లను అందిస్తుందని.. ఇందులో సగం తనకు లభించే వేతనం నుంచి వెళ్తుందని ఆయన వివరించారు. గత ఆర్థిక సంవత్సరం(2014-15)లో సునీల్ మిట్టల్ రూ. రూ.27.17 కోట్ల వేతన ప్యాకేజీని అందుకున్నారు.

 సీఎస్ఆర్ కింద్ ప్రతి ఏటా రూ. 5 కోట్లు: మిట్టల్

సీఎస్ఆర్ కింద్ ప్రతి ఏటా రూ. 5 కోట్లు: మిట్టల్

కాగా, ప్రస్తుతం దేశంలో 1,387 జైళ్లలో దాదాపు 2.8 లక్షల మందికిపైగానే అండర్‌ట్రయల్స్‌గా ఉన్నట్లు మిట్టల్ చెప్పారు. మొత్తం ఖైదీల్లో వీరి సంఖ్య సుమారు 68 శాతమని ఆయన పేర్కొన్నారు. వచ్చే మూడేళ్లలో రూ.100 కోట్లను పారిశుద్ధ్య పథకం కింద వెచ్చించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుందన్నారు. రాజకీయలపై గతంలో ఆసక్తి ఉండేదని, ఇప్పుడైతే అలాంటిదేమీ లేదని ఒక ప్రశ్నకు సమాధానంగా ఆయన తెలిపారు.

English summary

న్యాయ భారతి: భారతి గ్రూప్ వారసులపై మిట్టల్ | Bharti Enterprises creates fund to help undertrials, Sunil Mittal to take pay cut for this cause

The philanthropic arm of Bharti Enterprises has launched Nyaya Bharti, a programme to legally and financially support underprivileged undertrials that's driven by Chairman Sunil Bharti Mittal. Half the yearly grant toward the initiative will come from a Rs 5-crore cut in Mittal's salary.
Story first published: Friday, November 27, 2015, 12:51 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X