For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పిల్లల కోసం: యాక్సిస్‌ చిల్డ్రన్‌ గిఫ్ట్‌ ఫండ్‌

By Nageswara Rao
|

ముంబై: ప్రముఖ దేశీయ ప్రైవేట్ బ్యాంకింగ్ దిగ్గజం యాక్సిస్ బ్యాంక్ యాక్సిస్‌ 'మ్యూచువల్‌ ఫండ్‌ చిల్డ్రన్‌ గిఫ్ట్‌ ఫండ్‌' పేరిట ఓ సరికొత్త ఓపెన్ ఎండెడ్ బ్యాలెన్స్‌డ్ స్కీమును ప్రవేశపెట్టింది. ఈ స్కీము ద్వారా రూ. 700 కోట్ల రూపాయలు సమీకరించాలని యాక్సిస్ బ్యాంక్ నిర్ణయించుకుంది.

ఈ ఫండ్ ఎన్‌ఎఫ్‌ఓ నవంబర్‌ 18న ప్రారంభమై డిసెంబర్‌ 2న ముగుస్తుందని యాక్సిస్ బ్యాంక్ ఎండీ, సీఈఓ చంద్రేశ్ కుమార్ నిగమ్ పేర్కొన్నారు. ప్రస్తుత రోజుల్లో తల్లిదండ్రులు పిల్లల చదువు, పెళ్లిళ్లు చేసేందుకే ఎంతో కష్టపడుతున్నారని ఆయన పేర్కొన్నారు.

 Axis MF launches Axis Children's Gilt Fund

ఈ ఫండ్‌లో యూనిట్ల కేటాయింపు అనంతరం దీన్ని నిరంతర పెట్టుబడులకు డిసెంబర్‌ 14లోగా తిరిగి తెరుస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ ఫండ్‌ ద్వారా సేకరించే నిధుల్లో 40 నుంచి 60 శాతం ఈక్విటీల్లో ఇన్వెస్ట్‌ చేసి మిగతా మొత్తాన్ని డెట్‌, ఇతర ఉపకరణాల్లో పెడతామన్నారు.

మ్యూచువల్‌ ఫండ్‌ చిల్డ్రన్‌ గిఫ్ట్‌ ఫండ్‌‌లో రెండు ప్లాన్లు ఉంటాయన్నారు. ఒకటి డైరెక్ట్ ప్లాన్ కాగా, రెండోది రెగ్యులర్‌ ప్లాన్‌ అన్నారు. వీటికి అనుబంధంగా రెండేసి సబ్‌ప్లాన్లు (కంపల్సరీ లాకిన్‌, నో లాకిన్‌) కూడా ఉంటాయన్నారు.

English summary

పిల్లల కోసం: యాక్సిస్‌ చిల్డ్రన్‌ గిఫ్ట్‌ ఫండ్‌ | Axis MF launches Axis Children's Gilt Fund

Axis Mutual Fund has launched a new fund as Axis Children's Gilt Fund, an open ended balanced scheme. The investment objective of the scheme is to generate income by investing in debt and money market instruments along with long-term capital appreciation through investments in equity & equity related instruments.
Story first published: Monday, November 23, 2015, 12:07 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X