For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆన్‌లైన్ ఉత్పత్తులు: 40 శాతం నాణ్యత లేనివే(ఫోటోలు)

By Nageswara Rao
|

చైనాకు సంబంధించిన ఆన్‌లైన్ వెబ్‌సైట్లలో విక్రయించే వస్తువుల్లో దాదాపు 40 శాతం నాణ్యత లేని వస్తువులే అని ఓ సర్వేలో తేలింది. స్యయంగా ఆ దేశానికి ఓ సంస్ధ సమర్పించిన నివేదికలో ఈ విషయం వెల్లడైంది.

ఆన్‌లైన్ వినియోగదారుల హక్కుల పరిరక్షణపై సమర్పించిన ఈ నివేదిక ప్రకారం గతేడాది వాణిజ్య విభాగ అధికారులు మొత్తం 77,800 కంప్లైంట్స్‌ను అందుకున్నారు. ఈ ఫిర్యాదులు 356.6 శాతం పెరిగాయి.

చైనాలో టాప్ లీడర్స్‌లో ఒకరైన జాంగ్ డెజింగ్ అధ్యక్షతన జరిగిన నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ స్టాండింగ్ కమిటీ ప్లీనరీ సమావేశంలో ఆన్‌లైన్ ట్రేడ్‌ను మరింత కఠినతరం చేయాలని కోరింది. గతేడాది 442 బిలియన్ డాలర్ల మేరక ఆన్‌లైన్ వ్యాపారం చేసి చైనా అగ్రస్థానంలో నిలిచింది.

ఆన్‌లైన్ ఉత్పత్తులు: 40 శాతం నాణ్యత లేనివే

ఆన్‌లైన్ ఉత్పత్తులు: 40 శాతం నాణ్యత లేనివే

అమెరికా కేవలం 300 బిలియన్ డాలర్ల మేరకు మాత్రమే ఆన్‌లైన్ వ్యాపారం చేసింది. ప్రతి ఏటా చైనాలో ఆన్‌లైన్ వ్యాపారం 40 శాతం పెరుగుతూ వచ్చింది. ఈ నేపథ్యంలో ఆన్‌లైన్ వ్యాపారంలోకి నకిలీలు భారీ స్ధాయిలో పెరిగారని ఆ నివేదికలో పేర్కొన్నారు.

ఆన్‌లైన్ ఉత్పత్తులు: 40 శాతం నాణ్యత లేనివే

ఆన్‌లైన్ ఉత్పత్తులు: 40 శాతం నాణ్యత లేనివే

కొన్నేళ్లుగా చైనా జీడీపీ అభివృద్ధిలో ఇంటర్నెట్ కీలకపాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆన్‌లైన్ వ్యాపారంలో జరుగుతున్న మోసాల్ని అదుపు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ నివేదికలో సంస్ధ పేర్కొంది.

ఆన్‌లైన్ ఉత్పత్తులు: 40 శాతం నాణ్యత లేనివే

ఆన్‌లైన్ ఉత్పత్తులు: 40 శాతం నాణ్యత లేనివే

దీనిపై ఆలీబాబా అధినేత జాక్ మా మాట్లాడుతూ తమ సంస్థ సప్లయిర్స్‌ను అత్యంత జాగ్రత్తగా పరిశీలించి ఎంపిక చేస్తోందని తెలిపారు. చైనా ఇంటర్నెట్ నెట్‌వర్క్ ఇన్ఫర్మేషన్ సెంటర్ లెక్కల ప్రకారం చైనాలో 328 ఆన్‌లైన్ వెబ్ సైట్లు ఉన్నాయి.

ఆన్‌లైన్ ఉత్పత్తులు: 40 శాతం నాణ్యత లేనివే

ఆన్‌లైన్ ఉత్పత్తులు: 40 శాతం నాణ్యత లేనివే

చైనా మార్కెట్ మూలధనంలో వీటి వాటా 25.6 శాతం ఉంది. ఆలీ బాబాతో పాటు మూడు కంపెనీలు ప్రపంచంలోనే 10 ఆన్‌లైన్ వెబ్ సైట్లుగా వెలుగొందుతున్నాయి. కాగా చైనాలో 361 మిలియన్ జనాభా తమ షాపింగ్‌ను ఆన్‌‌లైన్‌లోనే చేస్తుండటం విశేషం.

English summary

ఆన్‌లైన్ ఉత్పత్తులు: 40 శాతం నాణ్యత లేనివే(ఫోటోలు) | Over 40 per cent of China’s online goods shoddy, counterfeit: report

In a big set back to China’s e-commerce giants such as Alibaba, an official report submitted to the Chinese lawmakers said only 58.7 per cent of items in online trades were genuine or of good quality last year with the remaining 40 per cent shoddy or counterfeit.
Story first published: Wednesday, November 4, 2015, 13:26 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X