For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అంచనాలను మించిన ఇన్ఫీ: సీఎఫ్‌ఓ రాజీనామా

By Nageswara Rao
|

దేశీయ రెండో అతిపెద్ద ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ రెండో త్రైమాసికంలో మార్కెట్‌ అంచనాలకు మించి ఆర్థిక ఫలితాలను నమోదు చేసింది. రెండో త్రైమాసికంలో రూ.3,398 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని కంపెనీ సోమవారం ప్రకటించింది.

గతేడాది ఇదే కాలంతో నమోదైన రూ.3,090 కోట్ల లాభంతో పోలిస్తే వార్షిక ప్రాతిపదికన 9.8 శాతం వృద్ధి చెందింది. ఇక మొత్తం ఆదాయం కూడా 17శాతం దూసుకెళ్లి రూ.13,342 కోట్ల నుంచి రూ.15,635 కోట్లకు ఎగబాకింది.

ప్రధానంగా పటిష్టమైన ఆదాయ వృద్ధి, నిర్వహణ పనితీరు క్యూ2లో కంపెనీ మెరుగైన రాబడులకు దోహదం చేసిందని ఇన్ఫోసిస్ సీఓఓ యుబి ప్రవీణ్ రావు అన్నారు. కాగా, డాలర్ రూపంలో సెప్టెంబర్ క్వార్టర్‌కు ఇన్ఫీ ఆదాయం 6 శాతం ఎగబాకి 2.392 బిలియన్ డాలర్లుగా నమోదైంది.

అంచనాలను మించిన ఇన్ఫీ: సీఎఫ్‌ఓ రాజీనామా

అంచనాలను మించిన ఇన్ఫీ: సీఎఫ్‌ఓ రాజీనామా

గడిచిన 16 క్వార్టర్లలో ఇదే అత్యధిక వృద్ధి కావడం గమనార్హం. రెండో త్రైమాసికంలో ఇన్ఫోసిస్ ఆదాయం మొత్తం రూ.29,989 కోట్లుగా నమోదైంది. గత జూన్‌, 2015తో ముగిసిన మొదటి త్రైమాసిక లాభాలతో పోలిస్తే ఇంకా మెరుగ్గా కనిపించింది.

అంచనాలను మించిన ఇన్ఫీ: సీఎఫ్‌ఓ రాజీనామా

అంచనాలను మించిన ఇన్ఫీ: సీఎఫ్‌ఓ రాజీనామా

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధంతో పోల్చితే ద్వితీయార్ధం సవాళ్లను ఎదుర్కోవాల్సి వచ్చేలా ఉందని, ఆదాయం పడిపోవచ్చని అన్నారు. ప్రధానంగా బీమా, రిటైల్ తదితర రంగాల తీరుతెన్నుల ప్రభావం సంస్థపై ఉండొచ్చన్న ఆయన క్రిస్మస్, కొత్త సంవత్సరం సెలవులతో సాధారణంగా ఐటి సంస్థల వ్యాపారం అక్టోబర్-డిసెంబర్‌లో తక్కువగానే ఉంటుందన్నారు.

అంచనాలను మించిన ఇన్ఫీ: సీఎఫ్‌ఓ రాజీనామా

అంచనాలను మించిన ఇన్ఫీ: సీఎఫ్‌ఓ రాజీనామా

మరోవైపు ఇన్ఫోసిస్ ఆర్థిక ఫలితాలు మార్కెట్ అంచనాలకు మించి నమోదవడంతో తొలుత సంస్థ షేర్లు భారీ లాభాల్లో కదలాడినప్పటికీ.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సంస్థ డాలర్ల రెవిన్యూ అంచనా తగ్గడంతో నష్టాల్లోకి జారుకున్నాయి. దాదాపు 4 శాతం పడిపోగా, ఈ ఒక్కరోజే ఇన్ఫోసిస్ మార్కెట్ విలువ 10,416 కోట్ల రూపాయలు క్షీణించింది.

అంచనాలను మించిన ఇన్ఫీ: సీఎఫ్‌ఓ రాజీనామా

అంచనాలను మించిన ఇన్ఫీ: సీఎఫ్‌ఓ రాజీనామా

కాగా సాప్ట్‌వేర్ సంస్థ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (సిఎఫ్‌ఒ) రాజీవ్ బన్సల్ రాజీనామా చేసినట్లు ఈ సందర్భంగా ఇన్ఫోసిస్ ప్రకటించింది. కాగా సాప్ట్‌వేర్ సంస్థ ఇన్ఫోసిస్ సీఎఫ్‌వో, (చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్) ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ బన్సాల్ తన పదవికి రాజీనామా చేయడం పలువురిని ఆశ్చర్యానికి గురిచేసింది.

అంచనాలను మించిన ఇన్ఫీ: సీఎఫ్‌ఓ రాజీనామా

అంచనాలను మించిన ఇన్ఫీ: సీఎఫ్‌ఓ రాజీనామా

ఆయన స్థానంలో ఎండీ రంగనాథ్ సీఎఫ్‌వోగా బాధ్యతలు చేపట్టనున్నారు. మూడేళ్లపాటు సంస్థకు సేవలందించిన ఆయన సోమవారం రాజీనామా చేయనున్నారని ఆయన స్థానంలో ఎండీ రంగనాథ్ కొనసాగుతారని ఇన్ఫోసిస్ ప్రకటించింది. ఐఐఎమ్ అహ్మదాబాద్ నుంచి మేనేజ్‌మెంట్ ప్రోగ్రామ్‌లో పీజీ డిప్లోమా పొందిన రంగనాథ్ ఇన్ఫోసిస్ కంటే ముందు ఐసీఐసీఐ లిమిటెడ్‌లో పని చేశారు.

English summary

అంచనాలను మించిన ఇన్ఫీ: సీఎఫ్‌ఓ రాజీనామా | Infosys Q2 net profit up at Rs 3,398 cr; lowers dollar guidance

Infosys has posted net profit of Rs 3,398 crore in the September ended quarter, an 8.8 per cent growth over the June-ended quarter, ahead of analyst expectations.
Story first published: Tuesday, October 13, 2015, 13:17 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X