For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

భారత్‌లో పోలో అమ్మెుద్దు: డీలర్లకు ఫోక్స్ వ్యాగన్

By Nageswara Rao
|

జర్మనీకి చెందిన ఆటో దిగ్గజం ఫోక్స్ వ్యాగన్ భారత్‌లో ప్రీమియం హ్యాచ్‌బాక్ పోలో విక్రయాలను తాత్కాలికంగా నిలిపివేయాలని బుధవారం డీలర్లను ఆదేశించింది. తదుపరి ఆదేశాలు అందేవరకూ కొత్త కొనుగోలుదార్లకు డెలివరీ చేయొద్దని తెలిపింది.

ఫోక్స్ వ్యాగన్ కార్లకు సంబంధించి ఒక సాంకేతిక అంశం కారణంగా కార్ల విక్రయాలను ఆపేయమన్నామని కంపెనీ లేఖలో పేర్కొంది. అమ్మకాలు ఆపేయడానికి ప్రస్తుతం అంతర్జాతీయంగా తాము ఎదుర్కొంటున్న కాలుష్యకారక ఉద్గారాల సమస్య కారణం కాదని కంపెనీ స్పష్టం చేసింది.

భారత్‌లో పోలో అమ్మెుద్దు: డీలర్లకు ఫోక్స్ వ్యాగన్

భారత్‌లో పోలో అమ్మెుద్దు: డీలర్లకు ఫోక్స్ వ్యాగన్

ఫోక్స్ వ్యాగన్ కంపెనీ తయారు చేసి ప్రపంచ వ్యాప్తంగా విక్రయించిన 1.1 కోటి డీజిల్‌ కార్ల ఇంజన్ల నుంచి వెలువడే కాలుష్య కారక వాయువుల విడుదలను అమెరికా అధికార్లకు తగ్గించి చూపేందుకు వాటిలో ఒక సాఫ్ట్‌వేర్‌ అమర్చి, యావత్ ప్రపంచాన్ని మోసం చేసింది.

 భారత్‌లో పోలో అమ్మెుద్దు: డీలర్లకు ఫోక్స్ వ్యాగన్

భారత్‌లో పోలో అమ్మెుద్దు: డీలర్లకు ఫోక్స్ వ్యాగన్

ఈ నేపథ్యంలో జర్మనీ ప్రభుత్వం సహా పలు దేశాలు ఫోక్స్ వ్యాగన్‌పై దర్యాప్తు చేపట్టాయి. ఈ ఏడాది ఏప్రిల్-ఆగస్టు కాలానికి 20,030 పోలో కార్లను తయారు చేశామని, దేశీయంగా 13,827 కార్లను విక్రయించామని, 6,052 కార్లను ఎగుమతిచేశామని కంపెనీ వివరించింది.

 భారత్‌లో పోలో అమ్మెుద్దు: డీలర్లకు ఫోక్స్ వ్యాగన్

భారత్‌లో పోలో అమ్మెుద్దు: డీలర్లకు ఫోక్స్ వ్యాగన్

కాలుష్య ఉద్గారాల అంశం భారత కార్యకలాపాలపై ఏ మేరకు ప్రభావం చూపనున్నదనే విషయంపై కూడా కసరత్తు చేస్తున్నామని పేర్కొంది. ఈ కసరత్తు ఫలితాలననుసరించి కార్ల రీకాల్‌పై నిర్ణయం తీసుకుంటామని వివరించింది.

 భారత్‌లో పోలో అమ్మెుద్దు: డీలర్లకు ఫోక్స్ వ్యాగన్

భారత్‌లో పోలో అమ్మెుద్దు: డీలర్లకు ఫోక్స్ వ్యాగన్

ఇది ఇలా ఉంటే కాలుష్య నియంత్రణ సంస్థలను మోసపుచ్చే సాఫ్ట్‌వేర్ గల కార్లను తిరిగి సరిచేయడానికి సంవత్సరం పైగా సమయం పట్టేస్తుందని ఫోక్స్‌వ్యాగన్ కొత్త సీఈవో మథయాస్ ముల్లర్ వ్యాఖ్యానించారు.

English summary

భారత్‌లో పోలో అమ్మెుద్దు: డీలర్లకు ఫోక్స్ వ్యాగన్ | Volkswagen stops sale of Polo in India

In a sudden development, Volkswagen India said it is putting sales of its Polo hatchback on a "temporary hold".The development coming right in the middle of an ongoing global crisis that the German car major faces due to cheating over emissions in its diesel engines.
Story first published: Thursday, October 8, 2015, 13:00 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X