For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మొబైల్ రీఛార్జ్‌తో టెలినార్ ఉచిత బీమా (ఫోటోలు)

By Nageswara Rao
|

చందారులతో దీర్గకాల బంధాన్ని ఏర్పాటు చేసుకోవడానికి దేశంలోనే తొలిసారిగా టెలినార్ వినూత్న సదుపాయాన్ని ప్రవేశపెట్టింది. ప్రతినెలా రీచార్జ్ చేయించుకునే మొత్తానికి 100 రెట్లు అధికంగా ఇన్సూరెన్స్‌ లభిస్తుందని టెలినార్ ఇండియా సీఈఓ వివేక్ సూద్ తెలిపారు.

దేశంలో ఒక మొబైల్‌ ఆపరేటర్‌ ఈ తరహా స్కీమ్‌ను ప్రవేశపెట్టడం ఇదే ప్రథమం. ఇలా గరిష్టంగా రూ. 50,000 వరకు ఇన్సూరెన్స్‌ను పొందవచ్చు. కానీ ఈ ఉచిత ఇన్సూరెన్స్ కావాలంటే మాత్రం రీచార్చ్ మొత్తాన్ని ప్రతి నెలా కనీసం రూ. 20 చొప్పున పెంచుకుంటూ పోవాలని కంపెనీ నిబంధన విధించింది.

యునినార్‌ కంపెనీ టెలినార్‌గా మారిన సమయంలోనే రెండు వారాల క్రితం ప్రారంభించిన ఈ స్కీమ్‌ను బుధవారం లాంఛనంగా ప్రారంభించడంతో పాటు తొలి కస్టమర్‌కు ఐఆర్‌డిఏ చైర్మన్‌ టి.ఎస్‌. విజయన్‌ చేతుల మీదుగా ఇన్సూరెన్స్ పాలసీని అందించారు.

 మొబైల్ రీఛార్జ్‌తో టెలినార్ ఉచిత బీమా

మొబైల్ రీఛార్జ్‌తో టెలినార్ ఉచిత బీమా

టెలినార్‌లో కొత్త కస్టమర్‌గా చేరిన వారందరికీ సిమ్‌తో పాటుగా రెండు నెలల కాలానికి పది వేల రూపాయలకు ఉచిత బీమా కూడా అందుతుంది. ఇప్పటికే కస్టమర్లుగా ఉన్న వారు ఉచితబీమా ప్రయోజనం పొందేందుకు నమోదు చేసుకుని ప్రతీ రీచార్జ్‌ పైన నెల రోజుల కాలానికి ఉచిత బీమా ప్రయోజనం పొందవచ్చు.

మొబైల్ రీఛార్జ్‌తో టెలినార్ ఉచిత బీమా

మొబైల్ రీఛార్జ్‌తో టెలినార్ ఉచిత బీమా

ఈ బీమా కాలపరిమితి నెలరోజులే ఉంటుంది. పాలసీ దీర్ఘకాలం పాటు కొనసాగాలంటే ప్రతీ నెలా రీచార్జ్‌ చేయించుకోవాల్సి ఉంటుంది. అదే రీచార్జ్ మొత్తం రూ. 500 దాటితే ప్రతినెలా అదనంగా రీచార్జ్ మొత్తాన్ని పెంచుకోవాల్సిన అవసరం లేదు. ఇన్సూరెన్స్ కావాలనుకునే వారు ఈ సదుపాయం వినియోగించుకోవచ్చని, అక్కర్లేని వారు సాధారణ రీచార్జ్ చేసుకోవచ్చని వివేక్ సూద్ తెలిపారు.

మొబైల్ రీఛార్జ్‌తో టెలినార్ ఉచిత బీమా

మొబైల్ రీఛార్జ్‌తో టెలినార్ ఉచిత బీమా

ఈ స్కీమ్‌ కింద ఇప్పటికే లక్ష మంది కస్టమర్లు నమోదయ్యారని వివేక్‌సూద్‌ ఈ సందర్భంగా తెలిపారు. ప్రారంభం నుంచి తాము అల్పాదాయ వర్గాలకు చెందిన కస్టమర్లే టార్గెట్‌గా ప్లాన్‌లు ఆవిష్కరించామని, అలాగే అల్పాదాయ వర్గాలకు బీమా రక్షణ అందించడం ద్వారా వారికి సాధికారత అందిస్తున్న శ్రీరామ్‌ లైఫ్‌తో ఈ స్కీమ్‌లోని కస్టమర్లకు బీమా కోసం భాగస్వామ్యం కుదుర్చుకున్నామని ఆయన చెప్పారు.

మొబైల్ రీఛార్జ్‌తో టెలినార్ ఉచిత బీమా

మొబైల్ రీఛార్జ్‌తో టెలినార్ ఉచిత బీమా

ఈ కార్యక్రమంలో పాల్గొన్న శ్రీరామ్‌లైఫ్ సీఈవో మనోజ్ జైన్ మాట్లాడుతూ దీనివల్ల ప్రజల్లో బీమాపై అవగాహన మరింత పెరుగుతుం దన్నారు. గతేడాది రూ. 500 కోట్లుగా ఉన్న కొత్త ప్రీమియం ఆదాయం ఈ ఏడాది రూ. 700 కోట్లు దాటుతుందన్న ధీమాను ఆయన వ్యక్తం చేశారు.

English summary

మొబైల్ రీఛార్జ్‌తో టెలినార్ ఉచిత బీమా (ఫోటోలు) | Telenor launches free insurance for mobile phone users

In a first from a telco in India, Telenor will begin offering life insurance to its new and existing customers, with covers starting from Rs 5,000 going up to Rs 50,000, while consumers don't need to pay any premium.
Story first published: Thursday, October 8, 2015, 12:23 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X